Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
వంటింట్లో మిళమిళలు...తళతళలు...!

1. మసాలా, మాంసాహార వంటకాలు వడ్డించడానికి, తినడానికి చెంచాలు, ఫోర్కులు ఉపయోగించినప్పుడు వాటిని సబ్బుతో రుద్ది శుభ్రపరచాలి. తర్వాత వేడినీళ్ళలో నిమ్మరసం పిండి కొద్దిసేపు అందులో వేయాలి. దీనివల్ల మసాలా, మాంసాహారం తాలూకు ఘాటు వాసనలు లేకుండా ఉంటాయి.
2. ఘాటైన రసాయనాలు కలిపిన సబ్బులు, సబ్బునురగ వాడటం వల్ల పాత్రలపై స్టీలు పూత పొరలుగా ఊడిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి స్పూన్లు తుప్పు కూడా పడుతుంటాయి. అలాంటప్పుడు కొత్త వాటినే పూర్తిగా పక్కన పడేస్తుంటాం. అందుకే సబ్బు నురగలో ఎక్కువ నీళ్ళు పోసి కొద్దిగా అంటించి రుద్దిన వెంటనే కడిగేయాలి. వీటిని శుభ్రం చేయడానికి మృదువుగా ఉండే స్పాంజిని రుద్దడానికి ఎంచుకుంటే మంచిది.
3. ఫోర్కులను పైపైన రుద్ది కడగడం కాకుండా..పళ్ల మధ్యలో ప్రత్యేకంగా శుభ్రపరచాలి. వాటి మధ్యలో పదార్థాలేమన్నా మిగిలిపోతే తర్వాత దుర్వాసనలు వచ్చే ప్రమాదం ఉంది.
4. కోడిగుడ్డులోని తెలసొన, మయోనైజ్ వంటి వాటిని చెంచాతో గిలకొట్టాక కొద్దిసేపు పక్కన పెడితే పొరలాగా గట్టిగా అవుతుంది. వాసన కూడా వస్తుంది. అలాంటప్పుడు వాటిని కడిగిన వెంటనే నీళ్ళ మరిగే గిన్నెలో వేయాలి. తర్వాత మెత్తని వస్త్రం మీద వేసి ఎండలో ఉంచాలి. అప్పుడే చెంచా మీద పేరుకొన్న సల్ఫర్ పొర వదిలిపోతుంది.
5. స్టీలు పాత్రల్లో వంట వండినప్పుడు అడుగంటుతుంటాయి. శుభ్రం చేయడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు, వంట వండటం పూర్తయిన వెంటనే, పదార్థాలను వేరే బౌల్ లోనికి సర్వ్ చేసుకొని స్టీల్ పాత్రలను చిన్న టబ్ లో కొద్దిగా నిమ్మరసం, వేడినీళ్లు పోసి అందులో నానబెట్టి, కొద్దసేపటి తర్వాత శుభ్రం చేయాలి.
6. కొన్ని స్టీలు పాన్స్ బ్రౌన్ కలర్ లో మరకలు పడుతుంటాయి. అటువంటప్పుడు కొన్ని నీళ్ళలో టీస్పూన్ సోడా, రాళ్ళ ఉప్పును చేర్చి బాగా వేడిచేసి అందులో కొద్దిసేపు నానబెట్టిన తర్వాత శుభ్రం చేస్తే ఎటువంటి మరకలైన సులభంగా వదిలిపోతాయి.



Click it and Unblock the Notifications
