For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో ఆహార పదార్థాల నిల్వ చిట్కాలు...!

|

Summer food Safety Tips
వేసవిలో కాలంలో సెలవులు, ట్రిప్పులు, ఇంటి నిండా బందువులు, పిలల్లతో అందంగా, హాయిగా సెలవులు ఇట్టే గడిచిపోతుంటాయి. వేసవి సెలవుల్లో రకరకాలు వంటలు ఇంట్లో నూరూరిస్తుంటాయి. వేసవిలో పసందైన వంటలో పిల్లలు..పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వేసవి సెలవులు కాబట్టి అలా అవుట్ డోర్ వెళ్ళి, లాంగ్ డేస్ టిప్ప్స్ వేయడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. అటువంటప్పుడు ముఖ్యంగా గర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సంవత్సరంలో మిగతా సీజన్ లో కంటే సమ్మర్ లో ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి. సరిగా నిల్వ ఉంచకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. వేసవిలో వాతావరణంలో వేడికి ఆహారపదార్థాలు మామూలు వాతారణం కంటే వేసవిలో రెండింతలు ఫాస్ట్ గా బ్యాక్టీరియా తయారవుతుంది. కాబట్టి వేసవిలో ఎక్కువగా మిగలబడేలాగా వంటలు వండటం వంటివి చేయకూడదు. అలా మిగలబడినవి తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వామిటింగ్ మరియు డయోరియా వంటి అనారోగ్యం పాలు అయ్యే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా పిల్లల్లో ఈ ప్రభావం చాలా చురుకుగా కనిపిస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వేసవిలో ఫుడ్ ఫ్రెష్ గా సేఫ్ గా పెట్టుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో చూద్దాం....

1. టెంపరేచర్ ను కంట్రోల్ పెట్టుకోవడం: ఇంట్లో ఆహారపదార్థాలు, కూరగాయలు, పండ్లు నిల్వ ఉంచే రిఫ్రిజరేర్ ను 5డిగ్రీల సెంటీగ్రేడ్ లో సెట్ చేసుకోవాలి. ఫ్రీజర్ ను 15డి.సెం నుండి 18డి.సెలోపు సెట్ చేసి పెట్టుకోవాలి.
2. త్వరగా ఫుడ్ ను ఇంటికి తీసుకురావడం: చల్లటి పదార్థాలుకానీ, వేడి పదార్థాలు కానీ బయటనుండి తీసుకొచ్చేటప్పుడు ఎండలో ఎక్కువ సేపు పెట్టకుండా త్వరగా ఇల్లు చేర్చాలి. తెచ్చిన ఫుడ్ ను ప్యాకెట్స్ నుండి వేరు చేసి వాటికి తగినటువంటి బౌల్స్ లో అరేంజ్ చేయాలి.
3. వేడి పదార్థాలను వేడిగానే ఉంచాలి: వేడి చేసి తినే పదార్థాలను చల్లగా ఉంచడం కంటే బాగా వేడిచేసి తర్వాత సర్వ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.
4. వేడిపదార్థాలను ఫ్రిజ్ లో పెట్టకుండా జాగ్రత్తపడాలి. వేడిపదార్థాలు పూర్థిగా చల్లబడ్డ తర్వాతే ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఏవైనా వేడి పదార్థాలను త్వరగా చల్లబరచాలనుకొన్నప్పుడు స్టౌమీద నుండి దించి వేరే పాత్రల్లోని మిర్చి చల్లని నీరు వున్న మరోక పాత్రలో ఉంచితే త్వరగా చల్లబడుతాయి.
5. మాంసాహార వస్తువులు, మాంసం, చికెన్, చేపలు, సీఫుడ్ ఇలాంటి వండిన పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టకూడదు. అవి పచ్చిగా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇందులో కూడా పచ్చిమాంసాహారం, వేరుగా పెట్టుకోవాలి. లేదంటే వాటి బ్యాక్టీరియా వండిన పదార్థాలపై చేరి వాటిని కూడా ఫుడ్ పాయిజన్ చేస్తాయి. అలాగా పచ్చి మాంసాహారాన్ని చేతులతో తాకే ముందు చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి.
6. ఎక్స్ పైరీ డేట్ చూసుకొని ఫ్రిజ్ కొన్నింటిని స్టాక్ పెట్టుకోవచ్చు. ఎక్స్ పైరీ డేట్ పూర్తి అయ్యుంటే వెంటనే అవి అక్కడ నుండి తొలగించాలి.
7. అలాగే ఫ్రిజ్ లో ఎక్కువ పదార్థాలు...ఫ్రిజ్ పట్టనంతగా నింపేయకూడదు. ఏవి పెట్టినా వాటికి కూల్ గాలి బాగా సోకే విధంగా ఫ్రీగా సర్దుకోవాలి.
8. మిగిలిపోయినటువంటి ఆహార పదార్ధాలను 3-5డేస్ లోపు తినేసేయాలి. అంతకు మించి నిల్వ ఉన్నవాటి తినకుండా పడయేడమే ఆరోగ్యానికి మంచిది.
9. ఫ్రిజ్ లో నుండి చికెన్, సీఫుడ్, మటన్, పాస్తా, అన్నం వంటి ఆహార పదార్థాలను బయటికి తీసిన వెంటనే వాటిని తినకూడదు.
10. వేసవిలో డయేరియా, జ్వరం, చర్మం సమస్యలు, థ్రోట్ ఇన్ఫెక్షన్, లాంటి అనారోగ్యంగా ఉన్నపుడు చేతివంటిలకు దూరంగా ఉండటమే ఉత్తమమైన పని.

English summary

Summer food Safety Tips...! | నిల్వ ఆహారాలు తగు జాగ్రత్తలు...!

Summer eating can be enjoyable with fresh seasonal produce, outdoor eating and entertaining for special occasions or family gatherings. Unfortunately, food poisoning is more common in summer than at any other time of year. Bacteria in food multiply faster in hot, humid weather. Most home kitchens aren’t designed for the safe handling of large quantities of food.
Story first published:Saturday, April 28, 2012, 16:40 [IST]
Desktop Bottom Promotion