For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో వంటగది వేడి తగ్గించటం ఎలా...

|

Summer Maintenance For Your Kitchen
వేసవిలో ఇంట్లో కానీ, బయటకానీ పనిచేయాలంటే చాలా ఎండ వేడిమికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వంటగదిలో పనిచేసేటప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది. దాంతో చర్మంపై పొక్కులు రావడం, శరీరం వేడి చేయండం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి కాస్తంత ఓపిక, ఆసక్తి ఉన్నట్లైతే వంటగదిని అందంగా కూల్ కూల్ గా సర్ధుకోవచ్చు. అలాగు వంటగది ఇరుకుగా ఉంటే వంట వండేటప్పుడు ఉత్పన్నమయ్యే వేడి బయటకు త్వరగా పోదు. దీంతో గదిలో వేడి తగ్గాలంటే కొన్ని మార్పులు చేయాల్సి వుంటుంది.

1. సాధ్యమైనంత వరకూ వంటగదిలో ఎగ్సాస్ట్ ఫ్యాన్ లేదా చిమ్నిని ఏర్పాటు చేసుకోవాలి. చిమ్ని ఏర్పాటు చేయడంతో స్టౌ ద్వారా వచ్చే వేడి కేవలం స్టౌ వరకే ఉంటుంది. గది మొత్తం వేడిగా అనిపించే అవకాశం ఉండదు.
2. ఎగ్సాస్ట్ ఫ్యాన్‌ ను ఏర్పాటు చేయడంతో వంటగదిలోని వేడినంతా ఆ ఫ్యాన్ బయటకు పంపించేస్తుంది. దాంతో వంట గది వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. వంటింట్లో పనిచేసే స్త్రీలకు నిస్సత్తువ కలగడమే కాకుండా, అనారోగ్యాలు ఏర్పడతాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వంటింట్లోని ఎగ్జాస్టింగ్‌ ఫ్యానును వంటచేసే సమయంలో ఉప యోగించాలి.
3. వంటగదిలో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా ఉండాలి. ఎక్కువగా వంటలు చేసే సమయంలో వంటగదిలో ఎక్కువ పొగ గదంతా చుట్టు కోకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను బయటకు పోయే సదుపాయం లేకపోతే అక్కడే ఉన్న పొగవల్ల ఆ గదిలో వేడి పెరుగుతుంది.
4. ఫ్యాను లేకపోతే వంటింటి తలుపు, కిటికీ తలుపు ఎక్కువ సమయం తెరిచే ఉంచాలి. సూర్యర్శి వంటింట్లోకి సోకే అవకాశం లేకున్నాచ వెలుతురు, గాలి వంటింట్లోకి ప్రవేశించేటట్లుగా చూసుకోవాలి.
5. కిచెన్‌లో ఒకపైపు గోడకు అలమారలు వుండటంవల్ల వంటింటికి అవస రమయ్యే వస్తువులన్నింటినీ వాటిలో చక్కగా సర్దు కోవచ్చు. వంటింటి అల మరలకు చెక్క తలుపులు పెట్టించు కోకపోవడమే మంచిది. గాలి పోతూవుంటే పచారీ సామాన్లకు పురుగు పట్టకుండా వుంటుంది.

English summary

Summer Maintenance For Your Kitchen | వంటగదిలో వేడి తగ్గించటం ఎలా...

Rising temperatures and glorious sunny days make summer an ideal season for getting work done around the house. Whether you’re cooling off indoors or working on your tan, take the time to perform some simple, routine home maintenance. You’ll have a safer home if you catch problems and wear-and-tear before they become hazards.
Story first published:Friday, March 9, 2012, 13:25 [IST]
Desktop Bottom Promotion