Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మహిళలకి సులభమైన ఇంటి చిట్కాలు....

1. లివింగ్ రూమ్, డైనింగ్ హాల్, బెడ్‌రూమ్...ప్రతి గదీ ఓ కొత్తగా కనిపించాలంటే డిజైన్‌లో, ప్యాట్రన్‌లో, రంగులో విభిన్న తరహాలలో ఉన్న వాల్ పేపర్స్‌ని ఎంచుకోవాలి. సీజన్ కు తగ్గ వాల్ పేపర్స్ కంటికి, మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి.
2. గోడకు వేసిన రంగును మార్చేయడం వీలుకావట్లేదు అనుకుంటే సింపుల్ గా నచ్చిన వాల్ పేపర్ ని తెచ్చి అతికిస్తే సరి.
3. ఇద్దరు పిల్లలున్న ఇంట్లో చెరో గదిని కేటాయించడం వీలు కాకపోతే పార్టిషన్ చేసి వారికి నచ్చిన వాల్ పేపర్ తో కవర్ చేయడం సులువైన పద్దతి.
4. మీ బెడ్ రూంలో ఉన్న ఏదో ఒక బల్బ్ మీద పెర్ ఫ్యూం స్ప్రే చేయండి. ఆ లైట్ వేసినప్పుడు. మీబెడ్ రూం అంతా సువాసనతో నిండిపోతుంది.
5. కిచెన్, బాత్రూమ్స్ నీరు, చెమ్మ ఎక్కువగా తగిలే చోట్లు, అందుకని ఈ గదులలో వాల్ పేపర్స్‌ని వాడకపోవడమే మంచిది.
6. ఇల్లు తుడిచే స్పాంజి (ఫ్లోర్ మాప్స్)లను నీళ్ళలో విదిలించి ప్లాస్టిక్ బ్యాగులోచుట్టి పెడితే ఎండిపోయి త్వరగా పాడవకుండా ఉంటాయి.
7. పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్ లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి.
8. కిచెన్ ప్లాట్‌ఫాం మీద కానీ స్టవ్ మీద జిడ్డు మరకలుంటే కొద్దిగా నీళ్లు చల్లి సోడాబైకార్బనేట్ చల్లాలి. ఐదు నిమిషాల తర్వాత స్పాంజ్ తో కాని క్లాత్ తో కాని తుడవాలి.
9. స్టెయిన్ లెస్ స్టీల్ సింకులో రెండు స్పూన్ల సోడా బైకార్బనేట్ చల్లి కొద్దిగా నీటిని చల్లి రుద్ది కడిగితే కొత్తదానిలా మెరుస్తుంది.
10. కిచెన్ లో అవెన్, స్టవ్, ప్లాట్ ఫాం తుడిచే స్పాంజ్ లు, బ్రష్‌లు కొద్దిరోజులు వాడిన తరవాత వాసన పట్టేస్తుంటాయి. వాటిని నీటిలో ఒక టేబుల్ స్పూన్ సోడాబైకార్బనేట్, నాలుగు చుక్కల డిష్‌వాష్ లిక్విడ్ కలిపి రాత్రంతా నానబెట్టి శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications