Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
ఇంటి అలంకరణలో కుషన్ల ప్రాధాన్యత.. వినియోగత...!

ఇక ఆఫీస్‌లలోనూ సోఫాల కుషన్‌లకు ప్రత్యేక అలకరణ తప్పని సరి అయ్యింది. వచ్చిపోయేవారు కాసే పైనా రిలాక్సయ్యే లా మెత్తని కుషన్‌ని గోడరంగులకు, కర్టెన్ల రంగు లకు తగ్గట్టుగా చూడముచ్చటి రంగుల్లో కవరు తొడుగుతున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా అనేక కుషన్ కవర్లు, డిజైన్లు లభ్యమవుతున్నాయి. ఆఫీసైనా,ఇంట్లో డ్రాయింగ్ రూం అయినా... బాల్కనీలోనో... లాన్‌లో ప్రత్యేకంగా చేయించుకున్న ఊయల అయినా... మెత్తని కుషన్లు ఎంతలా కోరుకుంటున్నారో... వాటికి కొత్త అందాలను సంతరించుకునేలా కవర్ డిజైన్లపైనా అంతే మక్కువ చూపిస్తున్నారు. అయితే కుషన్లు ఎంతగా ఉపయోగిస్తున్నార వాటిని వినియోగించుటలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అవి చూడటానికి బాగుండవు. తరుచూ మనం వినియోగించుకోనే సోఫా కుషన్లు చాలా సులభంగా మురికి పట్టిపోతుంటాయి. వాటిని నెలకోసారైనా కుషన్ల కవర్లను తీసి శుభ్రం చేస్తుంటాం. అయితే వాటిని ఎక్కువ కాలం మన్నేలా ఎలా శుభ్రం చేయాలి. మంచి సువానలు కలిగి ఉండాలే ఎలా పెట్టుకోవాలో కొన్ని చిట్కాలు మీకోసం......
1. కుషన్లను శుభ్రపరచడంలో వాక్యూమ్ పద్దతి చాలా సులభమైనటువంటి పద్దతి. వాక్యూమ్ తో క్లీన్ చేయడం ద్వారా కుషన్లలో వున్న దుమ్ము ధూళిని దులిపేయవచ్చు. మీరు ప్రతి రోజూ వాక్యూమ్ చేయడానికి వీలుకాకపోతే కనీసం వారానికి రెండు సార్లైనా వాక్యూమ్ క్లీనింగ్ తప్పనిసరిగా చేయాల్సుంటుంది.
2. వారానికి ఒక సారైనా కుషన్లను ఆరుబయట ఎండలో పెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న క్రిములను వదలగొట్టి, మలినాల్ని తొలగించి, కుషన్లు పొడిగా ఉండేటట్లు చేస్తుంది ఎండ వేడిమి.
3. కుషన్లు ఎప్పుడూ సున్నితంగా ఉండటానికి కుషన్లను, వాటికి దరించే కుషన్ కవర్లను కూడా అప్పుడప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. లేదా డ్రై క్లీన్ చేసినా సరిపోతుంది.
4. ఇంట్లోనే డ్రై క్లీన్ చేయదలచుకుంటే కొన్ని వేడినీళ్ళలో కొద్దిగా డిటర్జెంట్స్ వేసి నానబెట్టి కుషన్లను శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఇలా వాష్ చేసే ముందు ఫ్యాబ్రిక్ లేబుల్స్ ను తప్పకుండా చదివి తర్వాత శుభ్రం చేయండి.
5. సోఫాలపై ఇంట్లో పెంపుడు కుక్కలు ఎక్కి మూత్ర విసర్జన చేస్తే అటువంటి మరకలు, సోఫాకు ఆనుకొన్నపుడు అయ్యే తలనూనె మరకలు, ఆహరపు మరకలు పడినప్పుడు వాటిని వెంటనే తొలగించడం మంచిది.
6. కొన్నింటిని ఉతకకుండానే తొలగించవచ్చు అటువంటి మరకలను తడిబట్టతీసుకొని మరకలు ఉన్నచోట బాగా రుద్ది శుభ్రం చేయాలి. ఆ తడిని పోగట్టడానికి ఫ్యాన్ లేదా హెయిర్ డ్రైయ్యర్ ను ఉపయోగిస్తే వెంటనే తడిఆరిపోయి మాములు స్థితికి చేరుకుంటుంది.
7. మీ కుషన్లు చేతితో ఉతికే సౌకర్యవంతంగా ఉంటే మంచి డిటర్జెంట్స్ సోప్స్, లేదా పౌడర్ తో మరకలను తొలగించుకోవచ్చు.
8. పెంపుడు జంతువుల ఇంట్లో పెంచుకొన్నట్లైతే వాటి నుండి వెలువడే వాసలు, మూత్రవిసర్జన వాసనలు బట్టలకు సోకుతాయి. అటువంటప్పుడు వాటిని డిటర్జెంట్ తో రుద్దడం కానీ లేదా క్లోత్ స్ప్రే చేయడం కానీ చేయాలి. లేదా కుషన్లను శుభ్రపరిచే నీటిలో బేకింగ్ పౌడ్ వేసి శుభ్రపరచాలి.
9. కుషన్లుకు ఉన్న చెడు వాసనలను తొలగించడానికి నాఫ్తలీన్ బాల్స్ బాగా పనిచేస్తాయి.
10. ఈ చక్కటి సులభమైన చిట్కాలతో సోఫా కుషన్లను, కుషన్ కవర్లను శుభ్రం చేయాడానికి ప్రయత్నించి చూడండి. వాటిని ఎక్కువగా రుద్దడం నేలకు వేసి కొట్టడం వంటివి చేయకూడదు. అలా చేస్తే కుషన్లు పాడవడం, లేదా షేప్ లెస్ గా తయారవుతాయి.



Click it and Unblock the Notifications