Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
వాడకం తక్కువ.... పొదుపు ఎక్కువ...!

సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనటు వంటి వాషింగ్ మెషిన్ ని కొన్ని దుస్తులు ఉతకడానికే తరచూ ఉపయోగించడం వల్ల నెలవారీ విద్యుత్త్ బడ్జెట్ పెరుగుతుంది. అలాకాకుండా నిర్ణీత సమయాన్ని ఎంచుకొని మెషిన్ పూర్తిగా నిండిన తర్వాతే ఉపయోగించాలి. దీనివల్ల పరికరం మన్నికతో పాటు ఖర్చు తగ్గుతుంది.
ఇప్పుడు కొత్తగా వస్తున్న వాషింగ్ మెషిన్స్ లో ఎంత సేపు ఉతకాలో నిర్ణయించే సైకిల్ టైమ్' ఉంటుంది. దుస్తుల క్వాంటిటీని బట్టి సమయాన్ని తక్కువగా ఉంచడం, అందులో ఇచ్చిన టైమర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల విద్యుత్ వృథా తగ్గుతుంది. అలాగే వాషింగ్ మెషిన్ లో ఎక్కువ (30, 40, 60 డిగ్రీ ఓల్ట్స్) ఆప్షన్ ఎంచుకోకుండా సాధ్యమైనంత వరకూ కోల్డ్ వాష్ ఆప్షన్ ఎంచుకోవడం మంచిది.
వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతికేటప్పుడు బట్టలు మిలమిలా మెరుస్తాయి. ఎక్కువ శుభ్రపడుతాయి కదాని నీటిని, డిటర్జెంట్ ని ఎక్కువ వాడటం సరికాదు. అవసరం మేరకే ఉపయోగించాలి. లేదంటే నురగని తొలగించాడానికి ఎక్కువ నీరూ, దాంతో పాటే కరెంటూ ఖర్చు అవుతాయి. దుస్తులు మరీ మురిగ్గా ఉంటే తప్ప వేడి నీటిని వాడకూడదు.
బట్టలు రైసింగ్(జాలించేటప్పుడు ఎప్పుడూ చల్లని నీటినే వాడాలి. ఆరేసేటప్పుడు అందులో ఉండే ఎలక్ట్రికల్ డ్రయ్యర్ కి బదులుగా సమజమైన వెలుతురులో ఆరనివ్వడం వల్ల దుస్తుల మన్నికతో పాటు విద్యుత్ ఆదా అవుతుంది.
గ్లీజర్లు: వచ్చేది వర్షాకాలం. గీజర్ల వాడకం క్రమంగా పెరిగే సమయం. అయితే వీటిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకవోాలి. ఇంట్లో ఉన్న పాత తరహా అంటే లోహంతో చేసిన గీజర్లకి చుట్టూ ఇన్సులేషన్ చెయ్యాలి. వస్త్రంతో చుట్టేయడం వల్ల వేడిని కోల్పోకుండా ఉంటాయి. అదే ప్లాస్టిక్ ది అయితే ఈ అవసంర ఉండదు.
గీజర్ ఉష్ణోగ్రతలని 60డిగ్రీల నుంచి 50 డిగ్రీలకు మార్చడం వల్ల 18శాతం విద్యుత్ ని ఆదా చేయొచ్చు. వీటికి బదులుగా సోలార్ వాటర్ హీటర్లని ఉపయోగించడం అన్నింటిక్నా మేలైన మార్గం. అలాగే ఒక్కొక్కరి చొప్పున ఎక్కువసార్లు వేసుకోకుండా... ఒకేసారి వేసి అందురూ స్నానం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటే దీని ఖర్చుని నివారించవచ్చు.
మైక్రో ఓవెన్లు: చిన్న చిన్న పదార్థాలు వేడిచేయడానికి మైక్రో ఓవెన్లు బాగా సహకరిస్తాయి. గ్యాస్ పై వండటానికి అయ్యే సగం ఖర్చుతోనే వీటిలో వంటని కానిచ్చేసుకోవచ్చు. పదార్థాలు వేడి చేయడానికి ముందు పరికరాన్ని వేడి చేయాలేమో అనుకొంటారు చాలా మంది. కానీ కేకులు చేయడానికి తప్పు మరే ఇతర వంటకాలకి ముందుగా వేడిచేయాల్సిన అవసరం లేదు. అది వృథా ఖర్చు...
ప్రతి సారీ పదార్థాలు వేడక్కాయా లేదా అని పరీక్షించడం కోసం ఓవెన్ తలుపులని తరచూ తీసి చూడ్డం వల్ల ఉష్ణోగ్రతలు 25డిగ్రీలకు తగ్గిపోతాయి. తిరిగి వేడక్కడానికి కొంత సమయం తీసుకుంటుంది. మైక్రో ఓవెన్ ముందుగా బయట ఉండే అంచులు వేడెక్కిన తర్వాత క్రమంగా మధ్యబాగం వేడవుతుంది. అందుకే ఎక్కువ సమయం వేడిచేయాల్సిన పదార్థాలని, మందంగా ఉన్న వంటకాలను అంచుల వద్ద ఉంచి లోపల చిన్న చిన్న పాత్రలు పెట్టాలి.
ఫ్యాన్లు: వంటింట్లో ఉపయోగించే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లు మామూలు ఫ్యాన్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి. లేకపోతే ఘాటువాసనలు ఎంతసేపయినా గదిలోనే ుండి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఫ్యాన్లకు సంప్రదాయక రెగ్యులేటర్ వాడకం కన్నా.. ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లని వాడటం వల్ల బోలెడు ప్రయోజనం. చలికాలంలో రెగ్యులేటర్ ని తక్కువగా ఉపయోగించుకొంటే విద్యుత్ ఖర్చు కూడా అదుపులో ఉంటుంది.
ఇంట్లో ఎలక్ట్రానిక్ స్టౌని ఉపయోగిస్తున్నట్టు అయితే కనుక.. నిర్థేశిత సమయానికన్నా రెండు మూడు నిమిసాలు ముందు ఆపేయడం ప్రయోజనకరం. అలాగే దీనిపై ఉంచే పాత్రల అడుగు భాగం ఎంత వెడల్పుగా ఉంటే అంత త్వరగా పదార్థాలు ఉడుకుతాయి.



Click it and Unblock the Notifications