వంటగది శుభ్రతలో డిష్ టవల్స్ ఎలాఉండాలి...?

Tips to Wash and Clean Dish Towels
వంటగదిలో తరచూ టవల్స్ ఉపయోగిస్తుంటాం. అవి ఏదో ఒక రకంగా అతి తర్వగా మరపట్టేస్తుంటాయి. వంటగదిలో వంట చేసే ప్రదేశంలో ఎక్కువగా నీళ్ళు, నూనెలు, కూరలు, పాలు వంటివి ఫ్లోర్ మీద పడుతుంటాయి. అలాంటివన్నీ డిష్ టవల్స్ తో అప్పటికప్పుడు తుడిచేస్తుంటాం. అయితే అవి బాగా మరకపట్టేస్తుంటాయి. అయితే వాటి ప్రతి రోజూ లేదా వారానికి ఒక సారి ఉతికి ఎండబెట్టినా కూడా వాటి నుండి వెలువడే చెడు వాసనలు మాత్రం అలాగే ఉంటాయి. దాంతో వాటిని పక్కన పడేసి నెలకోసరి కొత్తటవల్స్ కొంటుంటారు. అలా చేయకుండా డిష్ టవల్స్ ను ఎలా శుభ్రం చేయాలో కొన్ని చిట్కాలు మీకోసం....

1. వంటగదిలో ఉపయోగించే టవల్స్ ను ఉతకడానికి ముందు డిటర్జెంట్ పౌడర్ లో అరగంట సేపు నానబెట్టి తర్వాత బ్రష్ తో రుద్ది శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇలా చేయడం ద్వారా డిష్ టవల్స్ అంటుకొన్న మరకలు సులభంగా వదిలి, చెడువాసనలు లేకుండా చేస్తుంది.

2. ఒక వేళ వంట గదిలో ఉపయోగించే టవల్స్ మంచి రంగులు కలిగినటుంటి ఉన్నట్లైతే, కలర్ పోకుండా సురక్షితంగా ఉండాలనుకుంటే వాటిని క్లోరిన్ బ్లీచ్ లో నానబెట్టి శుభ్రం చేయాలి. క్టోరిన్ టవల్స్ లో ఉన్న మరకలను, గ్రీజును సులభంగా తొలగిస్తాయి.

3. చిన్న బకెట్ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి, అందులో డిష్ టవల్స్ వేసి, అరగంట పాటు నాననివ్వాలి. డిటర్జట్ సోప్ తో, బ్రెష్ తో రుద్ది శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టాలి.

4. వంటగదిలో ఉపయోగించే బట్టలకు నూనె మరకలు అధికంగా ఉంటే, వైట్ వెనిగర్ సహాయపడుతుంది. నీళ్ళలో కొద్దిగా వైట్ వెనిగర్, డిటర్జెంట్ పౌడర్ వేసి నానబెట్టి, శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల నూనె మరకలను శుభ్రతొలగిస్తుంది. టవల్స్ ను ఎండలో ఎండబెట్టడం ద్వారా వెనిగర్ వాసనలు కూడా తొలగిపోతాయి.

5. మంచి కలర్స్ ఉన్నటువంటి టవల్స్, రంగు పోకుండా మరకలను వదలగొట్టాలంటే మరొక మార్గం ఉంది. నీళ్ళలో డిటర్జెంట్ పౌండర్, కొద్దిగా నిమ్మరసం కలిపి, టవల్స్ అందులో నానబెట్టి, అరగంట తర్వాత మంచినీళ్ళలో శుభ్రం చేయాలి. నిమ్మరసం టవల్స్ ఉన్న నూనె మరకలను, చెడువాసనలను తొలగిస్తుంది.

6. వంటగదిలో ఉపయోగించే బట్టలు శుభ్రం చేసిన తర్వాత, ఎప్పుడూ ఎండలోనే ఆరబెట్టాలి. అప్పుడే అందులో ఉన్న చెడు వాసనలు, బ్యాక్టీరియా తొలగిపోతుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటించి, శుభ్రమైనటువంటి డిష్ టవల్స్ ఉపయోగించిడం ద్వారా ఆరోగ్యానా కాపాడుకోవచ్చు.

Story first published: Friday, May 18, 2012, 11:48 [IST]
Desktop Bottom Promotion