Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
టాయిలెట్ శుభ్రత ఆరోగ్యకరమైన జీవితం...

కొన్నిసార్లు వీటి శుభ్రత కూడా ప్రశ్నార్థకంగానే మారుతుంది. అలాంటి సమయంలోనే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఏర్పడుతున్నాయి.
అయితే కొంతమంది అతి శుభ్రాన్ని పాటిస్తూ ప్రతిరోజూ మంచి సువాసనగల టాయ్‌లెట్ క్లీనర్స్ తో శుభ్రం చేస్తుంటారు. ఇలా అతి జాగ్రత్తవల్ల కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఒకసారి టాయ్‌లెట్ క్లీనర్ ను ఉపయోగించడం వల్ల దాని నుంచి వచ్చే వాసన, దానితోపాటు కంటికి కనిపించని సూక్ష్మక్రిములు చుట్టుప్రక్కల కొద్దిదూరం వరకు కొన్ని గంటల పాటు వ్యాపించి ఉంటాయి. ఆ వాసనలు పీల్చడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
శుభ్రత లోపించడం, అతి శుభ్రతవల్ల కలిగే ప్రమాదాలు అనేకం వున్నాయి. అలాగే బాత్ రూమ్, టాయిలెట్ రూమ్ లలో ఒకటి లేదా రెండు పచ్చటి మొక్కలు ఉంచితే మంచిది. ఈ గదుల్లో రోజూ ఒక ఒక్కసారైన కొద్దిసేపు క్యాండిల్ వెలిగిస్తే మంచిది. చాలామంది బాత్ రూం లో సువాసనల కోసం కొన్ని బాత్ రూం పెర్ఫ్యూమ్స్ వాడతారు. అసలు పైన పేర్కొన్నట్లు బాత్ రూం పరిశుభ్రంగా ఉంటే వేరే పెర్ఫ్యూమ్స్ అవసరం ఉండదు, మనం వాడే సబ్బు, షాంపూల వాసనలు సరిపోతాయి. లేదా బేకింగ్ సోడాను కొద్దిగా ప్లేటులో వేసి బాత్ రూం లో పెడితే వాసన రాకుండా ఉంటుంది. ఇలా ఉంటే మనం కొంచెం ఎక్కువసేపు బాత్ రూం లో గడుపుతూ స్నానం చేయడం వలన మనం తాజాదనం ఫీల్ పొందవచ్చు, ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.
టాయ్‌లెట్ లోకి వెంటిలేషన్ బాగా ఉండేట్టు చూసుకోవాలి. గాలి బయటకు, లోపలకి బాగా వచ్చేలా ఉండాలి. ఇందువల్ల గాలి కాలుష్యం కాకుండా ఉంటుంది.బాత్ రూం లలో టూత్ బ్రష్ లు టాయ్ లెట్ కి ఆరు అడుగుల దూరంలో ఉంచాలి. ఎందుకంటే టాయ్ లెట్ ను శుభ్రపరిచే సమయంలో గాలిలో కలిసే సూక్ష్మక్రిములు టూత్ బ్రష్ ల మీద ప్రభావం చూపించడంవల్ల దంత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మనం చేతులు కడుక్కున్న తర్వాత ఆ నీటిని నేలపై చిలకరించకూడదు. దీనితో కూడా అనారోగ్యం ఉంది. కాబట్టి పొడి టవల్‌తో శుభ్రంగా చేతులు తుడుచుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications
