Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
ఫ్రిజ్ తెరవగానే ఘాటైన వాసనలతో ఇబ్బందిగా ఫీలవుతున్నారా..?

చాలా రోజులగా నిల్వ ఉన్న పదార్థాలను వెంటవెంటనే తొలగిస్తుండాలి: ఫ్రిజ్ లో ముఖ్యంగా చెడు వాసన రావడానికి ఇదొక ముఖ్య కారణం. కొన్ని పదార్థాలు ఫ్రిజ్ లో నిల్వ ఉంచినా కూడా అవి త్వరగా చెడిపోతుంటాయి. వాటిని మనం రెగ్యులర్ గా గమనించక త్వరగా చెడువాసన ఇతర పదార్థాలపై స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఫ్రిజ్ లో ఏటువంటి పదార్థాలు పెట్టినా సరే వాటిపై డైలీ ట్రాక్ ఉండాలి.
మూతలు తప్పనిసరి: ఆహారాలు నిల్వ ఉంచేటప్పుడు తప్పనిసరిగా వాటి మీద మూతలు తప్పకుండా కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. ముఖంగా మసాలాలకు సంబందించినవి. ఎందుకంటే మసాలాలు అతి త్వరగా చెడిపోతుంటాయి. ఘాటు వాసనలున్న పదార్థాలను నిల్వ చేసే ముందు వాటిని సరైన డబ్బాల్లో పెట్టి మూత పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటి వాసనలు బయటకు రాకుండి ఇతర పదార్థాలకు ఎటువంటి హాని చేయకుండా ఫ్రిజ్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, రుబ్బినపిండి లాంటివి ఉంచిన పాత్రల మీద మూతపెట్టాలి.
కంపార్ట్ మెంట్(ట్రే): వండిన పదర్థాలను ఒక ట్రేలో పెడితే, వండని పదార్థాలను మరొక ట్రేలో పెట్టాలి. అలాగే పాలు, పెరుగు, నెయ్యి వంటివి సపరేట్ గా పెట్టుకోవాలి. ఫ్రిజ్ లో ఏ పదార్థాలను ఎక్కడ పెట్టుకోవాలి కంపెనీ వారు గుర్తించి ఉంటారు. కాబట్టి వాటి ప్రకారం సర్ధకొన్నట్లైతే మీ ఫ్రిజ్ లోని పదార్థాలకు ఎటువంటి హానీ జరగదు. ఫ్రిజ్ లో ఆహార పదార్థాలను కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టరాదు. ఫ్రిజ్‌లోపల గాలి ప్రవేశించేలా కొంత ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలను కడిగిన తర్వాత పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాతనే వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. తొడిమలు తీసిన మిరపకాయలను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో వుంచితే అవి కుళ్ళిపోతాయి. కనుక పచ్చి మిర్చిని తొడిమలు తీయకుండా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఆకు కూరలను వేళ్ళను కత్తిరించి తడిపోయేలా బాగా ఆరబెట్టి కట్లను విడదీసి పాలథిన్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలను పాలను అలాగే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బాగా చల్లారనిచ్చి ఆ తర్వాత పెట్టాలి.
బేకింగ్ సోడా: ముఖ్యంగా ఇంటి శుభ్రతలో మరీ ముఖ్యంగా మీ వంటగది విషయంలో బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా ఇది ఒక మ్యాజిక్ పౌడర్ ఇది అన్నివస్తువులను సులభంగా శుభ్రచేస్తుంది. ఫ్రిజ్ ను కూడా ఎటువంటి చెడు వాసనలు లేకుండా మిళమిళ తళతళలాడేలా చేస్తుంది. సన్నని రంద్రాలున్న చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను నింపి ఫ్రిజ్ లో ఒక మూలలో పెట్టడం వల్ల చెడువాసనలు స్ర్పెడ్ కాకుండా ఉంటాయి.
రెగ్యులర్ క్లీనింగ్: ఫ్రిజ్ ను ప్రతి రోజూ శుభ్రం చేయడం కష్టం అన్నాం అయితే అది శాశ్వతంగా కాదు.. ఫ్రిజ్ కనీసం పదిహేను రోజులకొకసారి లేదా నెలకొక్కసారైనా తప్పనిసరిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఫ్రిజ్ కండెన్సర్‌మీద దుమ్ము పేరుకోకుండా శుభ్రం చేస్తుండాలి. నెలకు కనీసం రెండుసార్లు డీప్రాస్ట్ చేసి, ఫ్రిజ్ లోపలకు శుభ్రం చేసి ఫ్రిజ్ బయటకు మరకలు దుమ్ములేకుండా తుడవాలి. ఫ్రిజ్ డోర్ హ్యాండిల్‌కు కవర్‌ను వేయాలి. ఫ్రిజ్ లోపల పెరుగు, ఆహార పదార్థాలు మీగడలాంటివి పెట్టేటప్పుడు ఒలకకుండా చూసుకోవాలి. ఫ్రిజ్‌లో పాలు, పెరుగు వంటివి ఒలికితే దుర్వాసర ఏర్పడుతుంది. అలా పాలు, పెరుగు వంటివి ఒలికితే వెంటనే ఫ్రిజ్ ఆఫ్ చేసి శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications
