For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రిజ్ తెరవగానే ఘాటైన వాసనలతో ఇబ్బందిగా ఫీలవుతున్నారా..?

|

Tricks For A Smell-Free Refrigerator
ఆధునికత పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం ఎక్కువవుతోంది. ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉండటం తప్పనిసరి అయ్యింది. కానీ కొందరు ఫ్రిజ్‌ నిండా ఏవేవో పదార్థాలు నింపేస్తుంటారు. వాటితో పాటు ఏదైన మిగిలిన పదార్థాలను కూడా ఫ్రిజ్ లో రోజుల కొద్ది నింపేసి వాటిని వాడుతుంటారు. దాంతో ఫ్రిజ్ డోర్ తెరిచిన ప్రతి సారి ఏదో ఒక చెడు వాసన వస్తుంటుంది. ఫ్రిజ్ ను ప్రతి రోజూ శుభ్రం పరచడం అంటే కష్టమైన పనే. అందుకు ముందు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే చెడు వాసనలు లేకుండా మీ పని సులభం అవుతుంది. అందుకు ఏం చేయాలి? అందుకు కొన్నిసలభమైన హోం ఇంప్ర్యూమెంట్ చిట్కాలు ఉన్నాయి.

చాలా రోజులగా నిల్వ ఉన్న పదార్థాలను వెంటవెంటనే తొలగిస్తుండాలి: ఫ్రిజ్ లో ముఖ్యంగా చెడు వాసన రావడానికి ఇదొక ముఖ్య కారణం. కొన్ని పదార్థాలు ఫ్రిజ్ లో నిల్వ ఉంచినా కూడా అవి త్వరగా చెడిపోతుంటాయి. వాటిని మనం రెగ్యులర్ గా గమనించక త్వరగా చెడువాసన ఇతర పదార్థాలపై స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఫ్రిజ్ లో ఏటువంటి పదార్థాలు పెట్టినా సరే వాటిపై డైలీ ట్రాక్ ఉండాలి.

మూతలు తప్పనిసరి: ఆహారాలు నిల్వ ఉంచేటప్పుడు తప్పనిసరిగా వాటి మీద మూతలు తప్పకుండా కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. ముఖంగా మసాలాలకు సంబందించినవి. ఎందుకంటే మసాలాలు అతి త్వరగా చెడిపోతుంటాయి. ఘాటు వాసనలున్న పదార్థాలను నిల్వ చేసే ముందు వాటిని సరైన డబ్బాల్లో పెట్టి మూత పెట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటి వాసనలు బయటకు రాకుండి ఇతర పదార్థాలకు ఎటువంటి హాని చేయకుండా ఫ్రిజ్ ఫ్రెష్ గా కనిపిస్తుంది. ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, రుబ్బినపిండి లాంటివి ఉంచిన పాత్రల మీద మూతపెట్టాలి.

కంపార్ట్ మెంట్(ట్రే): వండిన పదర్థాలను ఒక ట్రేలో పెడితే, వండని పదార్థాలను మరొక ట్రేలో పెట్టాలి. అలాగే పాలు, పెరుగు, నెయ్యి వంటివి సపరేట్ గా పెట్టుకోవాలి. ఫ్రిజ్ లో ఏ పదార్థాలను ఎక్కడ పెట్టుకోవాలి కంపెనీ వారు గుర్తించి ఉంటారు. కాబట్టి వాటి ప్రకారం సర్ధకొన్నట్లైతే మీ ఫ్రిజ్ లోని పదార్థాలకు ఎటువంటి హానీ జరగదు. ఫ్రిజ్‌ లో ఆహార పదార్థాలను కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టరాదు. ఫ్రిజ్‌లోపల గాలి ప్రవేశించేలా కొంత ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలను కడిగిన తర్వాత పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాతనే వాటిని ఫ్రిజ్‌లో పెట్టాలి. తొడిమలు తీసిన మిరపకాయలను ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో వుంచితే అవి కుళ్ళిపోతాయి. కనుక పచ్చి మిర్చిని తొడిమలు తీయకుండా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఆకు కూరలను వేళ్ళను కత్తిరించి తడిపోయేలా బాగా ఆరబెట్టి కట్లను విడదీసి పాలథిన్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలను పాలను అలాగే ఫ్రిజ్‌లో పెట్టకూడదు. బాగా చల్లారనిచ్చి ఆ తర్వాత పెట్టాలి.

బేకింగ్ సోడా: ముఖ్యంగా ఇంటి శుభ్రతలో మరీ ముఖ్యంగా మీ వంటగది విషయంలో బేకింగ్ సోడా బాగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా ఇది ఒక మ్యాజిక్ పౌడర్ ఇది అన్నివస్తువులను సులభంగా శుభ్రచేస్తుంది. ఫ్రిజ్ ను కూడా ఎటువంటి చెడు వాసనలు లేకుండా మిళమిళ తళతళలాడేలా చేస్తుంది. సన్నని రంద్రాలున్న చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను నింపి ఫ్రిజ్ లో ఒక మూలలో పెట్టడం వల్ల చెడువాసనలు స్ర్పెడ్ కాకుండా ఉంటాయి.

రెగ్యులర్ క్లీనింగ్: ఫ్రిజ్ ను ప్రతి రోజూ శుభ్రం చేయడం కష్టం అన్నాం అయితే అది శాశ్వతంగా కాదు.. ఫ్రిజ్ కనీసం పదిహేను రోజులకొకసారి లేదా నెలకొక్కసారైనా తప్పనిసరిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఫ్రిజ్ కండెన్సర్‌మీద దుమ్ము పేరుకోకుండా శుభ్రం చేస్తుండాలి. నెలకు కనీసం రెండుసార్లు డీప్రాస్ట్ చేసి, ఫ్రిజ్ లోపలకు శుభ్రం చేసి ఫ్రిజ్ బయటకు మరకలు దుమ్ములేకుండా తుడవాలి. ఫ్రిజ్ డోర్ హ్యాండిల్‌కు కవర్‌ను వేయాలి. ఫ్రిజ్ లోపల పెరుగు, ఆహార పదార్థాలు మీగడలాంటివి పెట్టేటప్పుడు ఒలకకుండా చూసుకోవాలి. ఫ్రిజ్‌లో పాలు, పెరుగు వంటివి ఒలికితే దుర్వాసర ఏర్పడుతుంది. అలా పాలు, పెరుగు వంటివి ఒలికితే వెంటనే ఫ్రిజ్ ఆఫ్ చేసి శుభ్రం చేయాలి.

English summary

Tricks For A Smell-Free Refrigerator | ఫ్రిజ్ లోని పదార్థాలు సురక్షితం ఇలా...?

Every time you open the door of your refrigerator your nostrils are assaulted by an abominable cocktail of smells. Sometimes you can smell yesterday's dal mixed with the eggs you made in the morning or maybe everything kept in teh refrigerator smells liek stale bananas. You possibly cannot clean your refrigerator every day to get rid of the odours. So what do you do? There are some simple home improvement tips for storing food and cleaning the refrigerator that will help you keep pungent smells at bay.
Story first published:Wednesday, August 29, 2012, 12:55 [IST]
Desktop Bottom Promotion