Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
టైల్స్, మొజాయిక్ మిలమిల మెరవాలంటే...?

మార్బుల్ వేస్తే ఫ్లోరింగ్ నునుపుగా ఉంటుంది. టైల్స్ మీదే ఇప్పుడు అందరి చూపులు. ఎందుకంటే వుడ్, గ్లాస్, సెరామిక్, విర్టీఫైడ్, మొజాయిక్ అని వివిధ రకాల టైల్స్ అందుబాటులో ఉండడమే ఇందుకు కారణం. ఈ ఆధునిక కాలంలో ఇంటి అలంకరణలో ఈ మొజాయిక్స్ చాలా ప్రసిద్ది చెందింది. ఇవి చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి. అయితే అంతే త్వరగా మురికి పడుతుంటాయి. దుమ్ము..ధూళి చేరి మరకగా కనిపిస్తుంటాయి. కాబట్టి మొజాయిక్ ను శుభ్రం చేయాడానికి కొన్ని చిట్కాలు మీకోసం....
1. వ్యాక్యూమ్ క్లీనింగ్: సాధారణ పద్దతిలో ఫ్లోర్స్ ను శుభ్రపరుస్తుంటాం. చీపురు కట్ట, రఫ్ గా ఉన్న బ్రష్ లతో శుభ్రం చేయడం ద్వారా ప్రయోజనం ఉండదు. అయితే ఆధునిక, సాంకేతిక పద్దతి వ్యాక్యూమ్ క్లీనర్. వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే దానితో దుమ్ము, ధూళి దులిపేసుకోవచ్చు. వ్యాక్యూమ్ క్లీనర్ లేని వాళ్లు మొజాయిక్ ను శుభ్రం చేయడానికి మెత్తని బ్రష్‌ను వాడుకోవచ్చు. మెత్తని బ్రష్ ను లేదా వ్యాక్యూమ్ క్లీనర్ ను ఉపయోగించడం ద్వారా మూలల్లో, టైల్స్ మద్య ఉన్న ధూళికణాలుతో సహా శుభ్రపడుతాయి.
2. సోపు నీళ్ళతో ఫ్లోర్ ను శుభ్రపరచడం: ఇంట్లో వస్తువులను ఉపయోగించి మొజాయిక్స్ ను సులభంగా శుభ్రం చేయవచ్చు. ముందుగా ఫ్లోర్ మీద సోపునీళ్లు పోసి బ్రష్ తో బాగా రుద్దాలి. తర్వాత ఒక బకెట్ మంచినీళ్ళు పోసి సోపునీళ్లను పూర్తిగా శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత బాగా ఆరిపోవాలి. మెత్తటి కాటన్ బట్టతో ప్లోర్ ను తుడిస్తే మంచి షైనింగ్ తో పాటు..ప్లోర్ శుభ్రపడి. తడి త్వరాగా ఆరిపోతుంది. దానికోసం సాదారణ సర్ఫ్ లేదా డిటెర్జెట్ సోపులను వినియోగించుకోవచ్చు. ముందుగా ఒక టైల్ మీద సోప్ వాటర్ వేసి శుభ్రం చేసి చూస్తే ఆ తేడా మీకు తెలుస్తుంది. తర్వాత గది అంతటిని శుభ్రం చేసుకోవచ్చు.
3. బేకింగ్ సోడా: బేకింగ్ సోడాను కూడా మొజాయిక్ క్లీనింగ్ కు ఉపయోగించవచ్చు. ముందుగా బేకింగ్ సోడాను వాటర్ లో కలుపుకొని గది మొత్తం చల్లుకొని, బ్రష్ తో గదింతా రుద్దాలి. రుద్దిన తర్వాత పదిహేను నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చి తర్వాత కార్న్ ను రుద్ది, మంచినీళ్ళు పోసి శుభ్రం చేసుకోవాలి. స్పాంజ్ తో సోప్ వాటర్ లో ముంచి శ్రుభ్రం చేసుకొని తర్వాత మంచి నీళ్ళతో శుభ్రం చేయాలి. తర్వతా మార్పు మీరే గమనించవచ్చు.
4. యాసిడ్ క్లీనింగ్: మొజాయిక్ టైల్స్ ను శుభ్రం చేయడానికి యాసిడ్ కూడా ఉపయోగించవచ్చు. అయితే ఆసిడ్ మోతాదును అతి తక్కువగా తీసుకోవాలి. ఒక బకెట్ నీటిలో ఒక కప్పు యాసిడ్ తీసుకోవాలి. ఎందుకంటే యాసిడ్ ఘాటైనటువంటి రసాయనాలుంటయి. ఎక్కువ మోతాదు ఉపయోగించనట్లైతే టైల్స్ పాలిష్ తగ్గిపోతుంది.
5. మొజాయిక్ ను శుభ్రం చేయడానికి సరైనటువంటి బ్రష్ ఉపయోగించాలి. బ్రష్ తో శుభ్రం చేసేటప్పుడు సాధారణ పద్దతిలో రుద్ది శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications