Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
మగువలు మెచ్చే లెగ్గింగ్స్ ఎక్కువ రోజులు మన్నాలంటే...

ట్రెండు బట్టి ఫ్యాషన్ మారుతుండటం సహజమే. ఆ క్రమంలోనే ఒకప్పుడు వదులు వదులుగా ఉండే పటియాలా మోడల్ నుంచి నేటి తరం లెగ్గింగ్స్ వరకూ కొత్త ట్రెండ్ మార్చేసింది. ఈ లెగ్గింగ్స్ స్ట్రెచబుల్ మెటీరియల్‌తో వంటికి హత్తుకుపోయినట్టు ఉండే లెగ్గింగ్స్ ఎంతో సౌకర్యంగా ఉండడంతో యువతులు ఈ ఫ్యాషన్‌ను అందిపుచ్చుకున్నారు. షార్ట్ టాప్స్, లాంగ్ టాప్స్ ఇలా ప్రతి దాని మీదకీ లెగ్గింగ్స్ వేయడం మొదలుపెట్టారు. లెగ్గింగ్స్ వేసుకోవడానికి సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది కనుక దానికి చాలా మంది అలవాటుపడిపోయారు.
లెగ్గింగ్స్ వాడాకం బాగా ప్రాచుర్యం చెందింది అయితే వాటి వాడకంలో, శుభ్రతలో, తీసుకోవాల్సిన జాగ్రత్తల కొరకు కొన్ని ట్రిక్స్ పాటిస్తే లెగ్గింగ్స్ వేసుకోవడానికి ఫిట్ గా, క్లీన్ గా ఉంటాయి.
1. ముందుగా లెగ్గింగ్స్ కొనే ముంది వాటి వెనుక లేబుల్ లో ఏం రాసుందో, ఎలా వినియోగించాలో తెలుసుకోవాలి. కఠినమైన ఫ్రాబ్రిక్స్ తో వాష్ చేయడం వల్ల రెండు మూడు ఉతుకులకే కలర్ మారిపోతుంటాయి. కాబట్టి లేబుల్ సూచనలు తప్పని సరి.
2. లెగ్గింగ్స్ వాష్ చేయాలనుకొన్నప్పుడు వాటిని మొదట మంచి డిటర్జెంట్ పౌండర్ లో 15-20నిమిషాల పాటు నానబెట్టి తర్వాత చేత్తోనే ఉతకాలి. ఉతికిన తర్వాత నీడలో ఆరబెట్టుకోవాలి.
3. లెగ్గింగ్స్ ఉతికేటప్పుడు చేతులతోనే వాష్ చేయాలి. బ్రష్ వాడకపోవడమే మంచిది. బ్రష్ ఉపయోగించినట్లైతే కలర్ పోవడంతోపాటు ఎలాస్టిక్ వదులు అవ్వడం వంటివి జరుగుతాయి.
4. లెగ్గింగ్స్ కి కెమికల్స్, బ్లీచింగ్ వంటి వేసి వాష్ చేయకూడదు. అలా చేయడం వల్ల కలర్, క్వాలిటీ విలువలు తగ్గిపోతాయి. లిక్విడ్ డిటర్జెట్ మాత్రమే ఉపయోగిస్తే సరిపోతుంది.
5. లెగ్గింగ్స్ పై చెమట మరకలు, బురద మరకలు, దుమ్ము ఎక్కువగా ఉన్నట్లైతే నిమ్మరసం కలిపిన నీళ్ళలో పదినిమిషాల పాటు నానబెట్టి తర్వాత వాష్ చేయాలి.
6. లెగ్గింగ్స్ ను వేడి నీళ్ళతో నానబెట్టి ఉతకకూడదు. చల్లని నీళ్ళలోనే ఉతకాలి.
7. కలర్, క్వాలిటీ తగ్గకుండా ఉండాలంటే లెగ్గింగ్స్ వాష్ చేసిన తర్వాత ఫ్రాబ్రిక్ కండీషనర్ వినియోగించాలి.
8. లెగ్గింగ్స్ ఎక్కువ సార్లు ఉతకడం వల్ల ఎలాస్టిక్ పాడై లూజ్ అవుతుంది. కాబట్టి ఈ లెగ్గింగ్స్ ఉతకడంలో ఈ చిట్కాలను పాటించినట్లైతే ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి.....



Click it and Unblock the Notifications
