Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బహుమతులు...బహువిధాలుగా ఉపయోగించండి...!

1. బందధువులు, సన్నిహితుల్ని ఏదైనా వేడుకకి ఆహ్వానిస్తున్నప్పుడు కానుకలు తేవద్దని... వారు రావడమే ముఖ్యమనే విషయాన్ని సున్నితంగా తెలపాలి.
2. మన ఆత్మీయుల్లో కొందరు ఫోటోలు బాగా తీయగలరు. ఒంకొందరు చక్కని చిత్తరువులు గీయగలరు. గృహాలంకరణ వస్తువుల తయారీలో సృజన కనబరిచే వారుంటారు. అలాంటి వారితో చనువుంటే మా పెళ్ళి రోజుకు చక్కటి ఫోటోలు తీసి పెట్టండి, మీకు కుదిరినప్పుడు టీపాయ్ మీదకు ఓ పెయింటింగ్ పాట్ చేసివ్వగలరా అంటూ అభ్యర్థించొచ్చు. తమ కళను గుర్తించినందుకు వాళ్లూ సంతోషపడతారు. చక్కగా, కంటికింపుగా ఉండే కళాత్మక వస్తువులు కానుకలుగా అందుకోవచ్చు.
3. ఒకే తరహా వస్తువులు కానుకల రూపంలో అందుతుంటాయి కొన్నిసార్లు. వంటింటి సామాగ్రి, హ్యాండుబ్యాగులు, గృహలంకరణ వస్తువులు లాంటివి ఆ కోవలోకే వస్తాయి. అలాంటివాటిని పక్కన ఉంచేయడం కన్నా... పెద్దమనస్సుతో అవసరమైన వారికి ఇచ్చేయండి.
4. కొందరు దుస్తులు బహుమతిగా ఇస్తుంటారు. అయితే ఆ సైజు, రంగు డిజైను మీకు నచ్చకపోవచ్చు. అలాగని నచ్చలేదని చెప్పలేదని చెప్పలేని పరిస్థితి. అందుకే మీకు కొద్దిగా బిగుతుగా అయ్యిందని చెప్పి చూడండి. అవతలివాళ్లు ముందు నొచ్చుకున్నా. ఆ తర్వాత మార్చుకొనే అవకాశం ఉందని గుర్తు చేస్తారు.
5. గిప్ట్ కాగితం కూడా తెరవని బహుమతులు అలా ఉండిపోయాయి.... ఏం చేయాలో తెలియడం లేదు అంటుంటారు కొందరు. వాటిని పరిశీలించి, సన్నిహితుల పుట్టిన రోజులు, పెళ్ళి రోజులప్పుడు వారికి కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయొచ్చు.
6. గోడ చిత్రాలు, పింగాణీ పాత్రలు, గడియారాలు, షోకేసుల్లో పెట్టుకునే గాజు బొమ్మల వంటివి సాధారణంగా బహుమతులుగా వస్తుంటాయి. ఈ విషయం గుర్తించుకొని కానుకలను ఇంటికి చేరవేసేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అవి రూపురేఖల్ని కోల్పోతాయి.



Click it and Unblock the Notifications