Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
నిమ్మకాయతో బాత్ రూమ్ లో తాజా సువాసనలు...!

స్నానాల గదిలో వుండేది తక్కువ స్థలమే అయినా పొందిగ్గా అలంకరిస్తే అందంగా వుంటాయి. కృతిమంగా చేసిన అరలు ఏర్పాటు చేసుకోవటం, తాజా గాలి లోపలికికి వచ్చేలా జాగ్రత్త లు తీసుకోవటం వంటి చిన్న చిన్న విష యాల మీద దృష్టి పెడితే స్నానాల గది కూడా సువాసనలతో నిండి ఉంటుంది. బాత్ రూమ్ ను శుభ్రం ఉంచక పోతే ఇంట్లో వారికే కాదు ఇంటికి వచ్చే అతిథులు కూడా గిల్టీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇంట్లో మిగతా అన్నీ గదులకు ఎంత ప్రాధాన్యతనిస్తామో బాత్ రూమ్ కూడా అంతే ప్రాధాన్యత తీసుకొంటే మంచిది.
బాత్ రూమ్ ఎప్పుడూ సువాసనలతో నిండి ఉండాలంటే రోజుకు కనీసం రెండు సార్లైనా ఎయిర్ ఫ్రెష్ నర్ ను వినియోగించాలి. లేదా సెంటెడ్ క్యాడిల్స్ ను వెలిగించాలి. అయితే రసాయనాలున్న ఈ సెంట్ క్యాండిల్స్ లేదా స్ప్రేలను వాడటం వల్ల అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. అలా కాకుండా ఎక్కువ సమయం బాత్ రూమ్ తాజాగా సువాసనలతో నిండి ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజంతా బాత్ రూమ్ సువాసనలతో నిండి ఉండాలంటే ఇక్కడ కొన్ని చిట్కాలు మీ కోసం...
చాలా మంది బాత్ రూమ్ లో చెత్త బుట్టలను ఏర్పరచుకుంటారు. కాలీ అయిన షాంపూ బాటిల్స్, షాంపూ కవర్లు, సోప్ కవర్లు, టాయిలెట్ పేపర్స్, ఇలాంటి వాటి కోసం ఉపయోగించే డస్ట్ బిన్ లు ప్రతి రోజూ లేదా రెండు రోజులకు ఒక్కసారి వాటిని పడేసి, నీళ్లతో శుభ్రం చేసి ఆరిన తర్వాత మళ్ళీ వాటి స్థానంలో పెడుతుండాలి. డస్ట్ బిన్ లు ఉంచే ప్రదేశం కూడా ఎప్పుడూ పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. బాత్ రూమ్ చిన్నదైనా పెద్దదైనా టైల్స్‌వున్నా లేకపోయినా అందులో అవసరమైనవి మాత్రమే వుంచండి.
ఖాళీ షాంపూ బాటిల్స్, పౌడర్ డబ్బాలు, విరిగిపోయిన బకెట్లు మీ స్నానాల గదిలో వుంచకండి.
బాత్ రూమ్ లో గాలి తాజాగా ఉండాలంటే... బాత్ రూమ్ ను ఉపయోగించనప్పుడు బాత్ రూమ్ కిటికీల డోర్లు, షట్టర్స్ ను ఎప్పుడూ తెరిచి పెట్టాలి. బాత్ రూమ్ డోర్ లేదా వెంటిలేటర్లును మూసి ఉంచడం వల్ల గాఢమైన వాసనలు లోపలే ఉండి చెడువాసనలకు దారితీస్తుంది. కాబట్టి బాత్ రూమ్ లో పని అయిపోగానానే వెంటిలేటర్లు, కిటికి డోర్లు తెరిచి ఎప్పుడ తాజాగాలి లోపలి వచ్చేవిధంగా చూసుకోవాలి.
బాత్ రూమ్ లో టాయిలెట్ ను ఉపయోగించన తర్వాత నీటిని ఫ్లచేయాల్సి వచ్చినప్పుడు, లాయిలెట్ బేసిన్ కవర్ ను మూసి నీళ్లను ఫ్లష్ చేయాలి. దాంతో మల, మూత్రాలు లాయిలెంట్ గోడలు మీద కానీ, లేదా టాయిలెట్ స్టెప్స్ మీద కానీ పడకుండా చేస్తుంది. వంట గదిలోలాగే బాత్ రూమ్ లో కూడా ఎక్సాస్ట్ ఫ్యాన్ ను ఏర్పాటు చేసుకొని అప్పుడప్పుడు బాత్ రూమ్ లో కూడా ఎక్సాస్ట్ ఫ్యాన్ ఉపయోగించడం మంచిది. ఎక్సాస్ట్ ఫ్యాన్ లేనప్పుడు బాత్ విండ్ లేదా వెంటిలేటర్లు ఎప్పుడు తెరచి ఉండేట్లు చూసుకోవాలి. స్నానాల గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోతే ఓడోనిక్ వాడండి.
బాత్ రూమ్ ను ఎప్పుడూ పొడిగా ఉంచాలి. బాత్ రూమ్ ను వీలైనంత వరకూ ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. బాత్ రూమ్ లో స్నానం అయిన వెంటనే బాత్ రూమ్ డోర్లను వెంటిలేటర్లును తెరచి ఉంచడం వల్ల త్వరగా తడి ఆరి, పొడిగా వుండటం వల్ల బాత్ రూమ్ లో చెడు వాసనలుండవు. స్నానాల గది ఎప్పుడూ తడిగా వుండకుండా గాలి, వెలుతురు వచ్చేలా తలుపులు తీసివుంచండి. తడిగావుంటే చెడువాసన రావడమే కాకుండా దోమలు, కీటకాలు పెరిగే అవకాశముంది.
బాత్ రూమ్ లో చెడు వాసనలు వదలగొట్టడంలో నిమ్మకాయా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా శక్తి వంతమైన ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి బాత్ రూమ్ ను కానీ, టాయిలెట్ బేసన్ కానీ శుభ్రం చేయడానికి నిమ్మకాయను ఉపయోగించి శుభ్రం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల బాత్ రూమ్ సిట్రస్ సువాసనలతో బాత్ రూమ్ తాజాగా ఉంటుంది.
స్నానాల గదిలో నీరు నిల్వచేసుకోవలసి వస్తే ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ నిల్వ వుంచకండి. నిల్వ వున్న నీళ్ళు వాడితే ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం వుంటుంది. ఇంట్లో వున్న వారందరికి స్నానాల గది ఉపయోగించాక క్లీన్ చేసే అలవాటు చేయండి. స్నానాల గదే కదా ఫరవాలేదు అని బద్దకించకుండా ప్రతిరోజూ స్నానాల గదిని కడిగి క్లీన్‌గా వుంచుకోవడానికి ఓ పదినిమిషాల సమయం కేటాయిస్తే మీ స్నానాల గది కూడా ఓ గ్లామర్ రూమ్‌గా మారుతుంది.



Click it and Unblock the Notifications