Latest Updates
-
మిథున, కన్య, మకర రాశుల వారికి బుధుడి అనుగ్రహం.. భారీ లాభాలు! - బుధవారం, 10 జూన్ 2026 -
జూన్ 21నే యోగా దినోత్సవం ఎందుకు జరుపుకొంటారో తెలుసా.? -
శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు? ఈ భయానక రహస్యం వెనుక ఉన్న ఆధ్యాత్మిక -
హెల్తీగా బరువు తగ్గి, రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. కొర్రలతో ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయాల్సిందే.! -
ఏ భర్తా భార్యతో అనకూడని ఒకే ఒక మాట.. లేదంటే విడాకులే దారి.! -
కర్లీ హెయిర్‌తో ప్రతి రోజూ ‘చిక్కులు’.. ఈ చవకైన టిప్స్ పాటిస్తే సరి.! -
హైబీపీ ఉన్నవారికి అలర్ట్.. పరగడుపున పెరుగన్నం తింటే ఇన్ని లాభాలా.? -
పాలక్, బీట్రూట్తో పరోటా.. ఆ మధ్యలో పనీర్ స్టఫ్ చేస్తే ఒకటికి రెండు తినాల్సిందే.! -
మీ పిల్లలు హైట్ పెరగట్లేదా?.. ఈ మార్పులను ఒక్కసారి గమనించండి.! -
జూన్ 9: ఈ నాలుగు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. కెరీర్లో ఊహించని మార్పులు!
అక్కడ ఎవరైనా సరే ఫ్రేష్ గా ఫీలవ్వాల్సిందే..

వంటగదిని ఉన్నంతలో శుభ్రంగా చూపులకింపుగా అలంకరించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే కొంచె టైమ్, కొంచెం ఓపిక రెండూ అవసరమే..చిన్నపాటి చిట్కాలతో వంటగది రూపురేఖలు మార్చేయొచ్చు....
1. చిన్న ఫ్లవర్ వాజ్ లో ఆర్టిఫిషియల్ పువ్వులను..రోజూ మార్చేవైతే ఫ్రెష్ గా దొరికే పువ్వులను పెట్టి ఓ మూలగా ఉంచండి..ఆ రూంలో ఎవ్వరున్నాసరే ఫ్రేష్ గా ఫీలవ్వాల్సిందే..
2. పాతబడిన డబ్బాల స్థానంలో ప్లాస్టిక్ డబ్బాలలో సరుకులు వేస్తే ఏది ఎక్కడుందో సులభంగా తెలవడమే కాదు. కంటికి చాలా అందంగా కనిపిస్తాయి...
3. వంట అనగానే ఫ్రిజ్ గుర్తుకు రాకుండా ఉండదు..అయితే అందులో ఒక ఇంచ్ కూడా స్థలం లేకుండా సర్థేస్తే గందరగోళంగా ఉంటుంది. ఒక్కటి తీయాల్సొస్తే అన్ని తీసి పక్కన పెట్టాల్సిందే...అందుకే కాస్త ఓపిక చూపించి ఎప్పటికప్పుడు ఫ్రిజ్ చెక్ చేసుకుంటూ ఎక్కువ రోజుల నుండి నిల్వ పదర్థాలు..వ్యర్థపదార్థాలు పారేయడం వల్ల ఫ్రిజ్ లో తాజాదనం సంతరించుకుంటుంది.
4. సాధారణంగా పెద్దలు ఉపయోగించిన వంటసామాన్లు..యేళ్ల తరబడి ఒకటే వంటసామాను వాడటం మనకు అలవాటు..అందులోనూ మనకు కొన్ని సెంటిమెంట్లు కూడా ఉంటాయి..ఈ సామాను అత్తగారు ఇచ్చారానో..ఆ సామాను అమ్మగారు ఇచ్చారనో అనుకోకుండా అవి బాగున్నంత వరకు ఉపయోగించుకొని పాడయైపోయిన వాటిని పక్కకు పెట్టేసి..సరికొత్త వాటిని..ట్రెండ్ కుతగ్గ లేటెస్ట్ మాడల్స్ ని ఉపయోగిస్తే సరికొత్త ఉత్సాహం ఏర్పడుతుంది.
5. మ్యూజిక్: ఓ పక్కగా చిన్న రేడియో..టేప్ రికార్డ్స్..ఇప్పుడు ఎక్కడ చూసిన మెబైల్ మ్యూజిక్..ఎసిడి.. మ్యూజిక్ పెట్టి పాటలు వింటూ వంట కానిచ్చేస్తే..చాలా ఉత్సాహంగా ఉంటుంది. మనస్సు ఆహ్లాదంగా ఉండటంతో పాటూ అంతసేపూ వంట చేశామని అనిపించదు....



Click it and Unblock the Notifications