Just In
- 36 min ago గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- 54 min ago పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- 1 hr ago ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
- 3 hrs ago ఏప్రిల్ 23న కుజుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల 12 రాశులపై దాని ప్రభావం ఎలా ఉంటుంది
ఇంటి కిటికీ అద్దాలు మిళమిళ మెరవాలంటే...
కిటికీలు(విండోస్): 1. ఎండగా ఉన్నప్పుడు కిటికీలను శుభ్రం చేస్తుంటే సన్ గ్లాసెస్ పెట్టుకోండి. లేదంటే ఎండ కళ్లపై పడి ఎలా తుడుస్తున్నారో కనిపించదు.
2. కిటికీ అద్దాలను బయట వైపు అడ్డంగా, లోపలివైపు నిలువుగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఏవైపు సరిగా శుభ్రం అవ్వలేదో కనిపిస్తుంది.
3. కిటికీలు బాగా మురికిగా ఉంటే నాలుగు లీటర్ల నీటిలో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు వెనిగర్ వేసి తుడవండి.
4. ఎత్తు ఎక్కువగా ఉన్న ప్లేస్ లో తప్ప మరెక్కడ లాడర్స్ ఉపయోగించకండి.
5. సోప్ వాటర్ తో క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ డిటర్జెట్ ను వాడకండి.
6. కిటికీలు ఎక్కువ మురికి పట్టింటే తప్పు ఎక్కువ వాటర్ ను ఉపయోగించకండి.
7. కిటికీలు శుభ్రపరుచుకోవడానికి కరెక్ట్ టూల్స్, సోప్స్, లిక్విడ్స్ ఉపయోగించాలి. అలాగే లిక్విడ్ తో తుడవడం పూర్తి అయిన తర్వాత పొడి బట్టతో లేక న్యూస్ పేపర్ తో ఒక సారి తుడవాలి.