Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
దుస్తులు ఎక్కువ కాలం మన్నిక పొందేందుకు 10 సులుభ మార్గాలు..!
మీరు బట్టలు కొనడానికి ఆ మాల్ కి, ఈ మాల్ కి తిరుగుతూ చాలా సమయం, శక్తి, డబ్బులు ఖర్చు పెడుతూ వుంటారు. మీరు మీ విలువైన వనరులను వీటి మీద ఖర్చు చేస్తారు కనుక వాటిని వదలడ౦ అంత తేలికేమీ కాదు. ప్రపంచంలోని ఎంత విలువైన వాటి కోసం కూడా మనం వదులుకోలేని ఇలాంటి బట్టలు మన బీరువాలో చాలానే వుంటాయి. కొన్ని బట్టలు మీకు కొన్ని విషయాలు గుర్తుకు తెస్తాయి, అందుకే అవి చాలా ప్రత్యేకమైనవి. కానీ మీరు వాటిని తక్కువగా వాడి, ఎక్కువగా దాచి ఉంచితే, అవి పిగిలిపోయే ప్రమాద౦ కూడా వుంది. అందుకే, మీ బట్టలు మరింత కాలం మన్నడానికి మేము మీకు 10 మార్గాలు తీసుకొచ్చాం.

జాగ్రత్తగా కొనండి:
మీరు షాపింగ్ చేసేటప్పుడు ఆ బట్టలకు కావలసిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏవిటో గమనించండి. ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరమైనా ఒక జత కొనాలనిపిస్తుంది. అయితే, ఆ బట్టల గురించి తగు జాగ్రత్త తీసుకోలేమేమో అనుకుంటే మాత్రం దాన్ని కొనకండి. ఉదాహరణకు, మీరు నిత్యం మీ బట్టలను డ్రై క్లీన్ చేసుకోలేకపోతే అలాంటి జతలు కొనకండి.

విభజించి పాలించండి:
ప్రతి జత ప్రత్యేకమైన వస్త్రంతో తయారౌతుంది, కనుక దానికి తీసుకోవాల్సిన జాగ్రత్త మారి పోతూ వుంటుంది. దానికి కావలసిన ప్రత్యేకమైన జాగ్రత్త రీత్యా మీ బట్టలను విభజించండి. నిత్యం ధరించే వాటిని ప్రత్యేకమైన జాగ్రత్త కావలసిన వాటి నుంచి వేరు చేయండి. దాని వల్ల వాటిని ధరించే టప్పుడు, ఇస్త్రీ చేసేటప్పుడు తేలికౌతుంది.

వేలాడతీయండి లేక మడత పెట్టండి.
కొన్నిటిని తేలిగ్గా మడత పెట్టి మీ బీరువాలో పెట్టవచ్చు, అయితే కాక్ టైల్ డ్రస్సులు లేదా సూట్ల లాంటివి హాంగర్ కు తగిలించాలి. వాటిని జాగ్రత్తగా గుర్తు పెట్టుకునేలా చూసుకోండి. మడత పెట్టాల్సిన వాటిని వేలాడ తీయకండి, వేలాడ తేయాల్సినవుఇ మడత వేయకండి.

ముదురు, లేత రంగు బట్టలు ఎప్పుడూ కలిపి వుతకకండి
ముదురు రంగు దుస్తులు ఉతికేతప్పుడు రంగు కోల్పోతాయి. వాటిని లేత రంగు బట్టలతో కలిపి ఉతికితే అన్నీ పాడైపోతాయి. అందుకని రంగు పోదని నమ్మకంగా తెలిస్తే తప్ప వాటిని విడిగానే ఉతికేలా జాగ్రత్త పదండి.

ముదురు, లేత రంగు బట్టలు ఎప్పుడూ కలిపి వుతకకండి
ముదురు రంగు దుస్తులు ఉతికేతప్పుడు రంగు కోల్పోతాయి. వాటిని లేత రంగు బట్టలతో కలిపి ఉతికితే అన్నీ పాడైపోతాయి. అందుకని రంగు పోదని నమ్మకంగా తెలిస్తే తప్ప వాటిని విడిగానే ఉతికేలా జాగ్రత్త పదండి.

సున్నితమైన బట్టలు వేరు చేయండి.
లేస్, సాటిన్, నెట్ లాంటి వస్త్రాలకు ఉతికేతప్పుడు మరింత జాగ్రత్త తీసుకోవాలి. మెరుపులు వుండే కొన్ని దుస్తులకు డ్రై క్లీనింగ్ మాత్రమె చేయాలి. కాబట్టి, వాటిని మిగతా బట్టల నుంచి వేరు చేసి ఉతికేలా జాగ్రత్త పడ౦డి.

ఉతకడానికి చల్లటి నీళ్ళు వాడండి.
వేడి నీళ్ళు దీర్ఘ కాలంలో మీ బట్టలను పాడు చేస్తాయి. కాబట్టి ఎప్పుడూ చల్లటి నీళ్ళతోనే బట్టలు ఉతకడం శ్రేయస్కరం.

బట్టలు ఆరబెట్టే యంత్రం వాడకండి
బట్టలు ఆరబెట్టే డ్రైయర్ నుంచి వచ్చే వేడికి రంగులు పోవడమే కాక దీర్ఘ కాలం వాడితే బట్ట కూడా పాడయ్యే ప్రమాదం వుంది. వాటిని ఎండలో వేసి వాటంతట అవే ఆరనీయండి. ఇందుకు మీ బట్టలు కూడా మిమ్మల్ని ఎంతగానో దీవిస్తాయి.

వాటిని జాగ్రత్తగా భద్రం చేయండి.
ఋతువులను బట్టి వాడే బట్టలకు తేమ, ఫంగస్ పట్టకుండా ఉండేలా భద్రం చేయండి. మీ బీరువాలో యాంటి- ఫంగల్ టాబ్లెట్లు వాడి మీకిష్టమైన స్వెటర్ కు చిల్లులు పడకుండా చూసుకోండి.

పాడితే వెంటనే మరమ్మతు చేయండి.
మీ బట్టలకుండే గుండీలు ఊడిపోయినా, లేక అవి చిరిగినా వెంటనే వాటిని బాగు చేసుకోండి. అవి పూర్తిగా పాడయ్యే దాకా ఆగకండి. మీ బట్టలను చక్కగా చూసుకోండి, అవి చాలా కాలం మన్నుతాయి.

సూచనలు పాటించండి.
బట్టలు కొన్నప్పుడు వాటికి వుండే టాగ్ ల మీద వాటిని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రాసి వుంటుంది. వేర్వేరు వస్త్రాలను ఒకేలా చూడలేం. వాటితో పాటు వచ్చే సూచనలను బట్టి వాటిని చక్కగా ఉతకడం, ఆరవేయడం, ఇస్త్రీ చేయడం సాధ్యమౌతుంది. సరైన సూచనలు ఇవ్వకపోతే, మీరు దుకాణదారు ను అడిగి వివరాలు తెలుసుకోవచ్చు.
పై విధానాలను పాటిస్తే మీ బట్టలు మునుపటికన్నా దీర్ఘ కాలం మన్నడం మీరు గమనిస్తారు.



Click it and Unblock the Notifications