Latest Updates
-
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.!
అబ్బో నిమ్మతో వంటగది ప్రయోజనాలు కూడా ఎక్కువే.!
మెరుపు కోల్పోయిన అనేక వస్తువులకి పలు విధాలుగా ఉపయోగపడే నిమ్మకాయతో తిరిగి వాటికి పూర్వపు మెరుపు ని తెప్పించవచ్చు అని తెలుసా??సిట్రిక్ యాసిడ్ అధికం గా ఉన్న నిమ్మ రసం అతి ప్రభావంతమైన సహజ క్లీనింగ్ ఏజెంటు. తక్కువ పీహెచ్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుండటం వల్ల ఇది వస్తువులని శుబ్రపరచడం లో బాగా ఉపయోగపడుతుంది.నిమ్మ వాసన చాలా బాగుండటమే కాకుండా నిమ్మరసం ఉపయోగించి మీరు శుభ్రం చేసే బట్టలు లేదా చెక్క వస్తువులకి ఏ మాత్రం హాని జరగదు.

కూరగాయలు తరిగే బోర్డు: ఎక్కువగా వాడటం వల్ల చాపింగ్ బోర్డ్ నల్లగా అయి రంగు కోల్పోయి ఉంటాయి.చబద్ హోమ్మేకింగ్ వారి ప్రకారం చాపింగ్ బోర్డుని నిమ్మరసంతో కనుక శుభ్రపరిస్తే మరలా తెల్లబడుతుంది.

ఇత్తడి: నిమ్మకాయని సగానికి కోసి దాని మీద కాస్త కోషర్ ఉప్పు ని చల్లండి. ఈ చెక్కతో ఇత్తడి లేదా రాగి సామానులని రుద్దండి. ఈ సహజ క్లీనింగ్ ఏజెంటు ఇత్తడి, రాగి వస్తువులకి పూర్వపు మెరుపు తెస్తుంది.

తుప్పు మరకలు: నిమ్మరసంలో ఉప్పు కలిపి ఈ రసాన్ని తుప్పు మరకల మీద పూయండి. ఆ పూత ని కాసేపు అలాగే ఉండనిచ్చి ఆ తరువాత కడిగెయ్యండి.తుప్పు మరక తీవ్రతని బట్టి ఈ రసాన్ని మరలా పూయవచ్చు.

పళ్ళు మరియు కూరగాయలు: ఈ మధ్య కాలం లో పుచ్చకాయ జాతి పళ్ళు ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధులకి కారకాలుగా గుర్తించారు. కొలొరాడో రాష్ట్ర యూనివెర్సిటీ నిపుణుల ప్రకారం మీరు తినే పదార్ధాలలో ఈ కోలీ బ్యాక్టీరియా నిర్మూలించాలంటే నిమ్మరసం కలిపిన నీటితో కుళాయి కింద పళ్ళు కూరగాయలని కడగాలి.

కిటికీలు: అవును కిటికీలని కూడా నిమ్మకాయతో శుభ్రపరచవచ్చు. కాస్త తెల్ల వినిగర్ ని పావు కప్పు గోరు వెచ్చటి నీటిలో కలపండి. దీనికి పావుకప్పు నిమ్మరసం చేర్చాలి. ఈ ద్రవం వంటగది కిటికీ మీద పడ్డ నూనె మరకలని కూడా శుభ్ర పరిచేంత గాఢత కలిగి ఉంటుంది.

గ్లాసు డోర్లు: గ్లాస్ డోర్లని శుభ్రపరచడానికి కూడా సహజ క్లీనింగ్ ఏజెంటు అయిన నిమ్మరసం ఉపయోగపడుతుంది.గ్లాసు డోర్ మెరుపు కోల్పోయినట్లనిపిస్తే ఒక నిమ్మకాయ ని సగానికి కోసి ఆ ముక్క తో గ్లాస్ డోర్ ని రుద్దండి.లేదా నిమ్మ రసానికి కాసిని నీళ్ళు కలిపి స్ప్రే బాటిల్ లో పోసి డోర్ మీద ఆ ద్రవం స్ప్రే చేసి కాసెపు అలా ఉండనివ్వండీ. అరగంట తరువాత గ్లాస్ డోర్ ని మరలా ఈ ద్రవం తో తడిపి తడి స్పాంజ్ తో తుడిచెయ్యండి.

మరుగుదొడ్లు: నిమ్మరసం బేకింగ్ సోడా కలిపి బాత్రూంని శూభ్రం చేస్తే మీ ఇల్లు మెరవడం ఖాయం. ఈ రెండింటినీ కలిపి టాయ్లెట్ బౌల్ మీద పూసి వదిలెయ్యండి. కాసేపాగి వచ్చి టాయిలెట్ బౌల్ లోపల బ్రష్ తో రుద్దితే శుభ్రపడినట్లే.

టప్పర్ వేర్: కాస్త బేకింగ్ సోడాని టప్పర్ వేర్ లో వేసి అర నిమ్మ చెక్క రసంతో టప్పర్ వేర్ సామాగ్రి లోపలా బయటా రుద్దండి.టప్ప్ర్ వేర్ మరలా పూర్వ వైభవం సంతరించుకునే అవకాశాలున్నాయి.

ఫర్నీచర్: నూనే నిమ్మరసం సమ పాళ్ళలో తీసుకుని ఫర్నీచర్ ని రుద్దండి. నేషనల్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ సెంటర్ ప్రకారం కాస్త మినరల్ ఆయిల్ లో నిమ్మరసం కలిపి కూడా ఫర్నీచర్ ని శుభ్రపరచవచ్చు. ఇంకా బాగా శుభ్రం చెయ్యాలంటే ఈ ద్రవాన్ని స్ప్రే బాటిల్ ల్లో పోసి ఫర్నీచర్ మీద చల్లండి. ఆ తరువాత పాలిష్ ఏస్తే సరి.

స్టవ్ మీద పడ్డ నూనె మరకలు: బేకింగ్ సోడా లో కాస్త నిమ్మరసం వేసి పేస్ట్ లా చెయ్యండి. నూనే మరకలు పడ్డ చోట ఈ పేస్టు ని పూసి కాసేపు అలా ఉండనీండి. 15 నిమిషాల తరువాత దీనిని తడి స్పాంజ్ తో తుడిచెయ్యండి



Click it and Unblock the Notifications