Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
కలావిహీనంగా ఉన్న ఇంటిని కళకళలాడించే చిట్కాలు!
గోడమీది మరకలు, మూసుకుపోయిన కాలువలు, మురికి నీటి మచ్చల తలుపులు మొదలైనవి మీ ఇంటిని పందుల దొడ్డిలా కనపడేలా చేస్తాయి. కానీ ఒక పద్ధతిలో పనులు చేసి, మీ ఇంటిని చక్కగా తయారుచేయడం పేద్ద కష్టం కాదు. ఇక్కడ మీ పనులను తెలికచేసే కొన్ని ఇంటికి సంబంధించిన చిన్న చిట్కాలు ఇవ్వబడ్డాయి.

బబుల్ గమ్ తొలగించడం
గోడమీద లేదా నేలపై ఉన్న బబుల్ గమ్ ను తొలగించాలంటే, ఆ ప్రాంతంలో వేరుశెనగ వెన్నను కొంచెం రాయండి, తరువాత కడగండి. ఈ నూనె అది వెంటనే బైటికి వచ్చేలా చేస్తుంది.

చెక్క నుండి కొవ్వొత్తి మైనాన్ని తొలగించడం:
హెయిర్ డ్రయ్యర్ తో మైనాన్ని సున్నితంగా చేయండి. వాక్స్ తొలగించడానికి పేపర్ టవల్ ను ఉపయోగించండి, వెనిగర్, నీటి మిశ్రమంతో దాన్ని శుభ్రం చేయండి.

ఇనుప వస్తువులు:
మీ స్నానాల గది, వంటగదిలో ఇనుప పూత వస్తువులు మెరవడానికి ఫాబ్రిక్ సున్నితమైన షీట్లను ఉపయోగి౦చండి. నిమ్మకాయ గుజ్జును తీసుకుని, మీ వంటింటి వస్తువులపై రుద్దండి.

అడ్డుపడిన కాలువలు:
మీ కాలువ గ్రీజ్ తో మూసుకుపోతే, ఒక కప్పు ఉప్పు, ఒక కప్పు బేకింగ్ సోడాను కాలువపై చల్లి ఒక గ్లాసు వేడి నీటిని పోయండి.

గోడలపై క్రేయాన్ మరకలు:
ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవారు గోడలపై గీతాలు గీయడానికి పిల్లలు ఎంత ఇష్టపడతారో సాధారణంగా తెలిసే ఉంటుంది. ఆ గీతాలను చెరపడానికి కేవలం ఒక చిన్న, సాధారణ రబ్బరును ఉపయోగించండి. దీనికి బదులుగా బ్లో డ్రయ్యర్ ని కూడా ఐదు నుండి పదినిమిషాలు ఈ గీతాలపై ఉపయోగించవచ్చు. ఆ ప్రాంతాన్ని శుభ్రమైన, పొడి తువాలు తో తుడవండి.

గ్లాసు స్నానపు తలుపులు:
మీ స్నానపు తలుపు శుభ్రంగా, కాంతివంతంగా ఉండాలంటే, తెలుపు వెనిగర్ లో ముంచిన తడి స్పాన్జ్ తో రుద్దండి.

పాచిని తొలగించడం;
మీ స్నానపుగది టైల్స్ పై ఉన్న పాచిని, బూజును హైడ్రోజెన్ పెరాక్సైడ్ తో తొలగించందో. నేరుగా దాన్ని పోస్తే అది వెంటనే మురికిని మృదువుగా చేస్తుంది, మీరు దానిని ఒక క్లాత్ తో తుడిచి తొలగించవచ్చు.

దీపం చాయలు:
మీ మురికి దీప చాయలను చుట్టిన మెత్తటి గుడ్డను ఉపయోగించి తొలగించండి.

బిగుసుకుపోయిన జాడీ మూతలను తీయడానికి:
గిన్నేలుకడిగే రబ్బరు చేతి తొడుగులను ఉపయోగించి, పట్టు జారకుండా జాడీల బిగుతు మూతలను తీయవచ్చు.

పదునైన కత్తెరలు:
పదునులేని కత్తెరలు తీసుకుని, 10,12 సార్లు డబ్బా రేకు మూతని మూడు పొరలుగా కత్తిరించండి. దీన్ని అనుసరించి పదునును పరీక్షించేందుకు కొన్ని పేపర్లను కత్తిరించండి.

దట్టమైన మరకలు:
తుప్పు వంటి మరకలను తొలగించడానికి, మీ సింక్ ను నిమ్మరసం, బోరాక్స్ పేస్ట్ తో రుద్దండి. కొద్దిపాటి మరకలను నిమ్మ చెక్కతో రుద్ది తొలగించవచ్చు.

స్టెయిన్లెస్ స్టీల్ సింక్ లు:
స్టెయిన్లెస్ స్టీల్ సింక్ లు లేదా వస్తువులు మెరవాలంటే, కొద్దిగా పిండిని దానిపై రుద్దండి.

వెండిని స్వచ్చంగా ఉంచడానికి:
మీ వెండి వస్తువులను ప్రత్యేకంగా తెలుపు టూత్ పేస్ట్ ను ఉపయోగించి శుభ్రం చేయండి. కొద్దిగా రాసి, శుభ్రం చేయడం.

వాసనతో కూడిన ఫ్రిజ్:
మీ ఫ్రిజ్ ను తాజాగా ఉంచడానికి, ఫ్రిజ్ వెనుక వైపు మూలలో వెనిలా వాసన కలిగిన కాటన్ బాల్ ను ఉంచండి. కొన్నిసార్లు ఈ ఫ్రిజ్ లో వచ్చే వాసనను ఇది లాగేస్తుంది.

తువాళ్ళు కొత్తగా కనిపించడానికి:
కొత్త తువాళ్ళను ఉతికేటపుడు, ఎప్పుడూ నీటిలో ఒక కప్పు ఉప్పు ను కలపండి. ఉప్పు రంగును పట్టి ఉంచి, తువాళ్ళు త్వరగా రంగుపోకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications
