For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చింతపండు ప్రయోజనాలు తెలుసుకోండి...?

|

సాధారణంగా సౌంత్ ఇండియన్ లో ప్రతి ఒక్క ఇంట్లో చింతపండు స్టాక్ ఉంటుంది. ఎందుకంటే వంటకాల్లో చింత పండును వివిధ రకాలుగా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా చింతపండు గుజ్జు లేదా రసంతో సాంబార్, రసం మరియు చింతపండుతో పులిహోర, పులుసులు ముఖ్యంగా ఫిష్ కర్రీలకు చింత పండు రసం పడాల్సిందే. అందుకే మన ఇండియాలో చింతపండుకు అంత డిమాండ్. అదలా ఉంచితే చింత పండు వంటకు మాత్రమే కాదు క్లీనింగ్ ఏజెంట్ గా కూడా ఉపయోగపడుతుంది. నిజానికి, చింత పండును డిష్ వాష్ లిక్విండ్ గా కూడా కనుగొన్నారు.

నిమ్మరసం మరియు వెనిగర్ వంటివి లాగే చింత పండు కూడా పుల్లగా ఉండటం వల్ల ఇది ఒక గొప్ప క్లీనింగ్ ఏజెంట్ గా మారింది. చింత పండులో కొద్దిగా ఉప్పు కలుపుకొన్నట్లైతే క్లీన్ చేసే వస్తువుల్లో మరింత నాణ్యతతో కూడిన మెరుగుదనం కనబడుతుంది. అంతే కాకుండా వస్తువులను శుభ్రపరచుకోవాలనుకొన్నప్పుడు, చింత పండులో మరో అదనపు ప్రయోజనం కూడా కలదు. నిమ్మకాయ, వెనిగర్ తో పోల్చితే చింత పండు మందంగా, కొంచెం గట్టిగా ఉండటం జిడ్డు వస్తువులను, తుప్పు పట్టిన వస్తువులను, రాగి వస్తువలను రుద్దడానికి చాలా అనుకూలంగా, సులభంగా ఉంటుంది.

సాధారణంగా లోహాలను శుభ్రపరచడానికి చింతపండును ఉపయోగిస్తుంటారు. నిజానికి, వెండి, ఇత్తడి మరియు ఇతర లోహాలను శుభ్రం చేయడానికి సిట్రస్ పండ్లను ఉత్తమ మార్గంగా ఉపయోగిస్తారు. వస్తువులును శుభ్రం పరచే సమయంలో చింతపండు తొక్క కొద్ది కొద్దిగా జారిపోతూ చెల్లాచెదురుగా పడిపోతుంటుంది. వస్తువులను రుద్దే సమయంలో అసౌకర్యం కలిగిస్తుంది. అటువంటప్పుడు చింతపండుకు బదులుగా చింతపండు గుజ్జును ఉపయోగించవచ్చు. రాగిపాత్రల మీద నిండుకొన్న జిడ్డు, దుమ్ము, ధూళిని తొలగించడానికి చింతపండు రసంలో వాటిని కొద్ది సేపు నానబెడితే శుభ్రం చేయడానికి మరింత సులభం అవుతుంది.

మరి చింత పండును వంటకు కాకుండా ఇంట్లో క్లీనింగ్ ఎలా ఉపయోగించాలో చూద్దాం...

ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ ‘చింతపండు’

కిచెన్ షింక్: వంటగదిలో ఉండే షింకులు తరచూ వినియోగిస్తుంటాం కాబట్టి, అవి త్వరగా మరకలు పడే అవాకశం ఎక్కువ. డిటర్జెంట్ సోపులు, లిక్విడ్ తో ఆ మరకలు పోనప్పుడు, చింతపండు గుజ్జుకు కొద్దిగా ఉప్పు చేర్చి షింక్ ను రుద్దినట్టైతే క్లీన్ గా శుభ్రపడి, నీటి మరకలను, ఆయిల్ మరకలను తొలగిస్తుంది.

ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ ‘చింతపండు’

సిల్వర్ వస్తువులు: సిల్వర్ వస్తువులను ఆరబయట లేదా గాలిసోకే విధంగా ఉంచడం వల్ల అవి త్వరగా నల్లగా మారే అవకాశం ఉంది. ఇంకా కొన్ని పాత బడిని, నల్లబడ్డ వెండి వస్తువలను శుభ్రం చేయడానికి బెస్ట్ ఆప్షన్ చింతపండు-ఉప్పు మిశ్రమంతో రుద్దడమే.

ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ ‘చింతపండు’

జువెలరీస్(ఆభరణాలు): కొన్ని మొటల్ పీసెస్ తో అతి క్లిష్టమైన ఆభరణాలను తయారు చేసిఉంటారు. వాటి క్లీన్ చేయడానికి కూడా కొద్ది కష్టం అవుతుంది. వాటిని శుభ్రపరచడానికి సోపులు ఉపయోగపడవు. అందుకు సులవైన మార్గం చింత పండు రసంలో ఈ ఆభరణాలను కొద్దిసేపు నానబెట్టి తీసి చేత్తో రుద్ది మంచి నీళ్ళతో శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచేయాలి.

ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ ‘చింతపండు’

ఇత్తడి వస్తువులును శుభ్రం చేయడానికి: ఇత్తడి మరొక మెరిసేటటువంటి లోహం. వీటిని శుభ్రం చేయడానికి చింతపండు బాగా ఉపయోగపడుతుంది. పాత బడ్డ ఇత్తడి వస్తువులు, ఇత్తడి ముక్కలతో తయారు చేసిన గడియారాలు మరియు తలుపులకున్న నాబ్స్ వంటివి శుభ్రం చేయడానికి చింతపండు గుజ్జు బాగా ఉపయోగపడుతుంది.

ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ ‘చింతపండు’

కాపర్ వస్తువుల శుభ్రపరచడానికి: ఈ రోజుల్లో కాపర్ వస్తువుల వినియోగం చాలా అరుదు. అయితే కొన్ని వారసత్వంగా ఉన్నవాటిని ఇంట్లో ఉంచుకోడం చాలా మందికి ఇష్టం. ఈ కాపర్ తో రకరకాల అలంకరణ సామాగ్రిని తయారు చేయడి ఉంటాయి. ఉదాహరణకు కాపర్ వాజ్ లు మరియు షో పీసులు వంటివి ఎప్పుడూ మెరుస్తుండాలింటే. అప్పడప్పడూ చింత పండుతో శుభ్రం చేయండి.

ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ ‘చింతపండు’

తుప్పు పట్టిన మొటల్ ట్యాప్స్: మెటల్ వస్తువులను శుభ్రం చేయడంలో మంచి క్లీనింగ్ ఏజెంట్ చింతపండు. కాబట్టి మీ మెటల్ ట్యాపులు తుప్పు పట్టి లేదా పాతబడినట్లు కనబడుతుంటే చింతపండుతో రుద్ది కడగండి.

ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ ‘చింతపండు’

దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలు: చాలా మంది హిందువుల ఇళ్ళలో వెండి లేదా ఇత్తడితో తయారుచేసి దేవుళ్ళ విగ్రహాలు కనబడుతాయి. ఈ విగ్రహాలను సులభంగా శుభ్రం చేయడానికి చింతపండు ఉపయోగపడుతుంది.

ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ ‘చింతపండు’

వంటగదిలోని చిమ్నీ(పొగగొట్టం): వంటగదిలోని పొగ గొట్టం నూనెతో కూడిన జిడ్డు, పొగతో నల్లగా మారిఉంటుంది. ఇటువంటి మొండి మరకలను వదించడానికి సిట్రస్ క్లీనింగ్ ఏజెంటైన చింతపండుతోనే సాద్యం.

English summary

8 Ways To Use Tamarind For Cleaning | ఓ మంచి క్లీనింగ్ ఏజెంట్ ‘చింతపండు’

All South-Indian homes have plenty of tamarind in their kitchens. This is because tamarind is widely used for cooking in India. We add tamarind water in sambars, rasam and even in other dishes like tamarind rice. Apart from that, tamarind is a useful cleaning agent too. In fact, tamarind was used even before dish washing liquids were discovered.
Story first published: Friday, February 8, 2013, 12:41 [IST]
Desktop Bottom Promotion