Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కాఫీ తాగితే దుర్వాసన దూరమవుతుందా?
దుర్వాసనలను..దూరం చేసే కాఫీ..!
సాధారణంగా ఇంటి శుభ్రతలో కొన్ని ఇంట్లోని వస్తువులను ఉపయోగించి క్లీన్ చేస్తుంటాం. ఉదాహరణకు నిమ్మ, పంచదార, వెనిగర్ మరియు బేకింగ్ సోడా. ఈ వస్తువులను వంటలకు మాత్రమే కాదు, ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు క్లీనింగ్. ఇంకా బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనందరికీ కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం అంతే కాదు కాఫీ బీన్స్ సువానంటే..ప్రతి ఒక్కరినీ టెమ్ట్ చేసేస్తుంది. !కానీ, కాఫీ వల్ల మరికొన్ని ఇతర ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా?
నిమ్మకాయ, బేకింగ్ సోడా, పంచదార, వలే కాఫీ కూడా ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. అవును, కాఫీ బీన్స్ లేదా పౌడర్ బీన్స్ ను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా కాఫీ వల్ల చాలా బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చర్మాన్ని ఎక్స్ ఫ్లోయిట్ చేయడానికి కాఫీని ఎక్కువగా ఉపయోగిస్తారు. కారును శుభ్రం చేయడానికి మరియు రూమ్ లో వచ్చే వాసనలు దూరం చేయడానికి కాఫీ బాగా సహాయపడుతుంది. మరి కాఫీ వల్ల ఇతర ప్రయోజనాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే..ఈ క్రింది విషయాలను పరిశీలించండి.

దుర్వాసనను తొలగిస్తుంది: బాత్ రూంలో దుర్వాస ఎక్కువగా వస్తుంటే, ఒక చిన్న కాటన్ క్లాత్ లో కాఫీ పైడర్ కానీ లేదా కాఫీ గింజలు కానీ మూట కంటి బాత్ రూమ్ లో వేలాడదియ్యాలి. ఇది ఎక్కువగా వస్తున్న దుర్వాసనను దూరం చేస్తుంది. అలాగే ఫ్రింజ్ లో కూడా ఏదైన వాసనలు తరచూ వస్తుంటే కానుక ఒక బౌల్లో కాఫీని ఉంచండి.
చీమలను నివారించడానికి: ఇంట్లో నూక్స్ మరియు కార్నర్ పాయింట్స్ లో చీమల ఎక్కువగా ఉన్నట్లైతే, ఆ ప్రదేశంలో కాఫీ పౌడర్ ను కానీ, కాఫీ గింజలను కానీ చిలకరించాలి. అలాగే గార్డెన్ లో కూడా చీమల బెడద లేకుండా చేసుకోవాలంటే కాఫీ పౌడర్ ను చిలకరించాలి.
పాత్రలను శుభ్రపరచడానికి: ఇంట్లో తరచూ ఉపయోగించే పాత్రలు, గిలకొట్టిన గుడ్డు వాసన వస్తున్నా లేదా వెజిటేబుల్ కట్ చేయడానికి ఉపయోగించే చాకులు వెల్లుల్లి గార్లిక్ వంటి వాసనలు వస్తున్నా, కాఫీ పౌడర్ ను ఉపయోగించి రుద్దడం వల్ల వాసన తొలగిపోతుంది. ఈ స్టాంగ్ కాఫీబీన్స్ వాసన చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా కాఫీతో ఎక్కువగా మరకలు పడ్డ పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.
పెంపుడు జంతువుల నుండి వచ్చే వాసనను నివారిస్తుంది: మనకు పెంపుడు జంతవులంటే చాలా ఇష్టం. అయితే వాటి వాసన మాత్రం ఇష్టం ఉండదు. పెంపుడు వాసన రూపుమాపడానికి మీ సోఫా మీద తాజా కాఫీ బీన్స్ యొక్క ఒక బ్యాగ్ ఉంచండి. ఇంకా పెంపుడు జంతువుల యొక్క మూత్రపు వాసన తగ్గించడానికి కాఫీని ఉపయోగించవచ్చు. ఇక ఐరన్ స్కిల్లెట్ లో కాఫీని వేడి చేయడం వల్ల రెండు మూడు నిముషాల్లోనే వాసన గది మొత్తం విస్తరిస్తుంది.
వేవిళ్ళు నుండి ఉపశమనం కలిగిస్తుంది: స్ట్రాంగ్ గా సువాన వచ్చే కాఫీ తీసుకోవడం వల్ల ఉదయం వచ్చే వికారాన్ని వదిలించుకోవచ్చు. కాఫీ బీన్స్ కొలుగోలు చేసే ముందు వాటిని ఎలా గుర్తిస్తారు?కాఫీ బీన్స్ యొక్క తాజా వాసన గర్భిణీ స్త్రీలకు కలిగే వికారం నుండి ఉపశమనం పొందడానికి ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది.
కంపోస్ట్: గార్డెన్ లోని మట్టి మరింత సారవంతం చేయడానికి ఆ మట్టిలో కాఫీని మిక్స్ చేయవచ్చు. కాఫీలో ఉండే ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటివి మట్టిని సారవంతం చేయడానికి అద్భుతంగా సహాయపడుతాయి. మీరు తాగగా మిగిలిన కాఫీని గార్డెన్ లో చల్లవచ్చు.



Click it and Unblock the Notifications