Latest Updates
-
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం!
మనల్ని ఆరోగ్యంగా ఉంచే మన వంటగది బ్లీచింగ్ ఏజెంట్స్....!
సాధారణంగా ఇంటి పరిశుభ్రతలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంట్లో వారందరు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇల్లును ఎంత శుభ్రంగా ఉంచినా కూడా ఏదో ఒక ప్రదేశంలో క్రిములు, దుమ్ముధూళి మళ్లీ చేరుతూనే ఉంటాయి. కొన్ని ప్రదేశాలు బ్లీచింగులు వినియోగిస్తే మాత్రమే శుభ్రపడుతుంటాయి. కాబట్టి అందుకు కొన్ని నేచురల్ బ్లీచింగ్ వస్తువును మనం నిల్వ ఉంచుకోవడం చాలా అవసరం. కొన్ని ప్రదేశాలు ఎంత శుభ్రం చేసినా ఒకటి రెండు రోజులకే మళ్ళి అదే విధంగా డర్టీగా కనబడుతుంటాయి . ఉదాహరణకు బాత్ రూమ్ టైల్స్ పసుపుపచ్చగా మారుతుంటాయి. అంతే కాదు ప్రతి రోజూ ఆ ప్రదేశంలో నీరును ఉపయోగించడం వల్ల షైనింగ్ కూడా తగ్గిపోతుంది.
అంతే కాదు కొన్ని నేచులర్ బ్లీచింగ్ వస్తువులను ఉపయోగించి తెల్ల దుస్తులను శుభ్రం చేస్తుంటారు. దాంతో తెల్లంగా మెరిసే దుస్తులు రెండు మూడు ఉతుకులకే షైనింగి తగ్గిపోతాయి. కాబట్టి మీ తెల్లని వస్త్రాలు ఎప్పటికి అదే మెరుపుతో మెరుస్తుండాలంటే ఉప్పు అద్భుతమైన బ్లీచింగ్ ఏజెంట్. కొంత మంది బ్లీచింగ్ పౌడర్ ను లేదా సోడా డ్రింక్ లో కెమికల్స్ కలిగి ఉండటం వీటి బ్లీచింగ్ ఏజెంట్లుగా ఉపయోగిస్తుంటా. వీటికి బదులు నేచురల్ గా నిమ్మ, మరియు వెనిగర్ వంటి నేచురల్ వస్తువులు కూడా మంచి బ్లీచింగ్ ఏజెంట్సే....ఇలాంటివి మన ఇంట్లోనే.. మన వంటగదిలో బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసేవి చాలానే ఉన్నాయి. అవి బెస్ట్ బ్లీచింగ్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

నిమ్మకాయ లేదా నిమ్మరసం: ఇందులో ఉండే సిట్రస్ యాసిడ్ టైల్స్ ను అద్భుతంగా క్లీన్ చేస్తాయి. అంతే కాదు ఈ సిట్రస్ యాసిడ్ టైల్స్ మీద పేరుకున్న జిడ్డును, దుమ్ము, ధూళిని తొంలగిస్తాయి. మరో అధ్బుతమైన ఉపయోగం మంచి సువాసనతో ఇల్లంతా వాసన వెదజల్లుతుంది. ఇంటి శుభ్రతలోనే కాదు, ఒంటి శుభ్రతలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. చర్మసంరక్షణకు ఉపయోగపడుతుంది.

వెనిగర్: నిమ్మరసం లాంటిదే, వెనిగర్ కూడా పుల్లగా ఉండే సిట్రస్ ఏజెంట్ మరియు ఇది మన వంటగదిలో ఎప్పుడూ నిల్వ ఉండే వస్తువే. తెల్లని దుస్తులను ఉతికే ముందు నీళ్ళలో వెనిగర్ వేసి నానబెట్టి తర్వాత శుభ్రం చేస్తే మిళ మిళ మెరవాల్సిందే. ఇంకా వెనిగర్ టైల్స్ ను శుభ్రపరిచే మెరిసేలా చేస్తుంది. గ్లాస్ విండోస్, డోర్ లను శుభ్రం చేయడానికి వెనిగర్ వేస్తే కొత్తవాటిలా మెరిస్తుంటాయి.

బ్లీచింగ్ పౌడర్: బ్లీచింగ్ అనేది పేరులోనే వుంది, వస్తువులు బ్లీచింగ్ పౌడర్ తో తెల్లబడుతాయి. బ్లీచింగ్ పౌడర్ ను బాత్ రూమ్ క్లీనింగ్ కు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే దుస్తులకు దీన్ని ఉపయోగిస్తే మాత్రం దుస్తుల రూపురేకలు మారిపోవాల్సిందే. అంతే కాదు జీన్స్ వంటి వాటికి ఉపయోగించ డం వల్ల షేడ్ అయ్యే ప్రమాదం ఉంది.

బేకింగ్ సోడా: బేకింగ్ సోడా ఒక పౌడర్ఏజెంట్, దీన్ని ఇంట్లో తరచూ ఉపయోగిస్తుంటాం. గోడలకు ఉన్న ఆయిల్ మరకలను, డర్టీ ఓవెన్స్ శుభ్రం పరచాడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదు వంటగదిలో ఒక మూలలో నీటిలో కానీ లేదా అలాగే ఉంచడం వల్ల చెడువాసన దూరం చేస్తుంది. ఇంకా దుస్తుల శుభ్రతలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే తగు మోతాదులో మాత్రమే వినియోగించాలి.

ఉప్పు: ఉప్పుకూడా బ్లీచింగ్ ఏజెంటే ఐతే మిగిలిన వాటితో పోల్చితే ఇది అంత స్ట్రాంగ్ కాదు. అయితే నిమ్మరసం లేదా వెనిగర్ తో మిక్స్ చేసి ఉపయోగిస్తే బ్లీచింగ్ పవర్ మరింత పెరుగుతుంది.

కోలా లేదా సోడా డ్రింక్: ఎరేటెడ్ పానీయాలు లేదా సోడాలు వంటివి బాత్ రూమ్ శుభ్రం చేసే బ్లీచింగ్ పౌడర్ కంటే చాలా ఉపయోగకరమైనవి. ఒక సారి సోడాతో టాయిలెంట్ బేషన్ శుభ్రం చేస్తే మీకే తెలుస్తుంది ఇది ఎంత నిజం అనేది. అంత అద్భుతంగా శుభ్రపడుతుంది.

చింత పండు: చింత పండు కూడా ఒక బ్లీచింగ్ ఏజెంటే ఎందుకంటే ఇంట్లో వెండి, ఇత్తడి, రాగివస్తువులను శుభ్రపరచడే కాదు, వాష్ బేషన్లు, వాటర్ టాప్ లను కూడా శుభ్రం చేస్తుంది.

పొటాటో: పొటాటో కూడా ఒక మంచి బ్లీచింగ్ ఏజెంట్. తుప్పు పట్టిన సామాన్లు లేదా గ్రిల్స్ ను శుభ్రపరుస్తుంది. బంగాలదుంపను స్లైడ్స్ గా కట్ చేసి రుద్దడం వల్ల శుభ్రపడుతాయి.



Click it and Unblock the Notifications