Latest Updates
-
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు..
బేకింగ్ సోడా ఉపయోగించి కిచెన్ సింక్ ను శుభ్రంచేయడం ఎలా
ప్రతి మహిళ వారి ఇంట్లో కిచెన్ సింక్ ను చాలా శుభ్రంగా మరియు ఆకర్షనీయంగా పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది. మీ వంటగది శుభ్రతలో కిచెన్ సింక్ ను శుభ్రంగా ఉంచుకోవడం ఒక ముఖ్యమైన భాగం . అందుకు ఒక ఉత్తమ క్లీనింగ్ ఏజెంట్ ను ఎంపిక చేసుకోవడం కొంచెం కష్టమైన పనే, ఎందుకంటే మార్కెట్లో అనేక రకాల క్లీనింగ్ ఏజెంట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మీరో ఎఫెక్టివ్ క్లీనింగ్ ఏజెంట్ కూడా ఇతర కమర్షియల్ ఉత్పత్తులతో పోటిపడుతున్నది.
అదే బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్ ఆప్షన్. ఇది మీ కిచెన్ సింక్ను క్లీన్ గా మరియు మంచి షైనింగ్ తో ఉంచతుంది. వారానికి ఒక సారి బేకింగ్ సోడాను మీ కిచెన్ సింక్ శుభ్రం చేయడానికి ఉపయోగించడం వల్ల బాగా మరకకట్టిన మరియు డైయిన్ వద్ద మొండిమరకలను చాలా తేలికగా తొలగిస్తుంది. అమ్మోనియా, బ్లీచ్ లేదా అబ్రసీవ్ క్లీనర్స్ వంటివి మీ కిచెన్ లోని స్టెయిన్ లెస్ స్టీల్ సింక్ శుభ్రం చేయడానికి నివారించాలి. గరుకుగా ఉన్న స్పాంజ్ ను సింక్ కు ఉపయోగించడం వల్ల సింక్ గీతలు పడుతుంది. అంది మీ మొత్తం కిచెన్ లుక్ మీద ప్రభావం చూపుతుంది. మీ చికెన్ సింక్ ను శుభ్రం చేయడానికి మీ మనస్సులో ఉంచుకోవల్సిని మరికొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి.
కిచెన్ సింక్ ను బేకింగ్ సోడాతో శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఈ చిట్కాలను ఉపయోగించి మీ కిచెన్ సింక్ మరింత శుభ్రంగా మరియు ఆకర్షణీయంగా చేయండి. ఇది చాలా సులభం మరియు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

కడగాలి: బేకింగ్ సోడాతో మీ కిచెన్ సింక్ ను కడగడం వల్ల చాలా ఎఫెక్టివ్ ఫలితాలను అంధిస్తాయి. బేకింగ్ సోడాను మీ కిచెన్ సింక్ శుభ్రం చేయడానికి కాస్తా సమయం పడుతుంది. బేకింగ్ సోడాతో కిచెన్ సింక్ ను ఒకసారి రుద్ది అలాగే వదిలేసి, ఐదునిముషాల తర్వాత వేడినీటితోప్రతి మూలలో వేసి కడగాలి.
నిధానంగా రుద్దాలి: బాగా మురికపడ్డ పాత్రలు మరియు మిగిలిన ఆహారపదార్థాలన్నింటిని సింక్ లో నింపడం వల్ల బాగా కర్రలు కట్టి ఉంటాయి. అందుకు మన్నికైన సోపు, మెత్తటి క్లాత్, గోరువెచ్చని నీళ్ళ ఉపయోగించాలి. నీళ్ళను డ్రైయిన్ లో ఫోర్స్ గా పోయాలి. బేకింగ్ సోడా సింక్ కు రాయడానికి ముందు సింక్ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి.
వేడినీళ్ళు వాడాలి: సింక్ క్లీనింగ్ కు బేకింగ్సడాను ఉపయోగించడానికి ముందుగా, డ్రెయిన్ లో హాట్ వాటర్ టాప్ ను వదలి, నీళ్ళు ఫోర్స్ గా వదలాలి. ఇలా చేయడం వల్ల డ్రెయిన్ లో దుర్వాసన తొలగిపోతుంది మరియు ఏదైనా చిక్కులుకున్నపదార్థాలను సాఫ్ట్ గా తొలగిస్తుంది . శుభ్రం చేసిన తర్వాత సింక్ ను పొడిగా ఆరనివ్వాలి. తర్వాత బేకింగ్ సోడా అప్లై చేయాలి.
బేకింగ్ సోడా: ముందుగా సింక్ క్రింది బాగంలో బేకింగ్ సోడాతో శుభ్రం చేయాలి. సింక్ మొత్తం బేకింగ్ సోడాను అప్లై చేసి, తర్వాత శుభ్రం చేయాలి. మరో ఎంపిక, బేకింగ్ సోడాను పేస్ట్ లా చేసి, అప్లై చేసిన తర్వాత శుభ్రంగా కడిగేలయాలి.
బేకింగ్ సోడా డ్రెయిన్ శుభ్రపడేలా చేస్తుంది: ముందుగా అరకప్పు బేకింగ్ సోడా నీటిని డ్రెయిన్ లో పోయాలి. తర్వాత, అందులో వైట్ వెనిగర్ ను పోయాలి. ఆతర్వాత , వేడినీళ్ళను పోస్తే డ్రెయిన్ క్లియర్ అవుతుంది.
హోం మేడ్ బేకింగ్ సోడా క్లెన్సర్: అరకప్పు బేకింగ్ సోడా మరియు ముప్పావు కప్పు నిమ్మరసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ సింక్ మొత్తం ఉపయోగించి శుభ్రం చేయాలి . ఈ విధంగా కనీసం వారానికొకసారైనా చేయాలి.
బేకింగ్ సోడ్ విత్ వైట్ వెనిగర్: అరకప్పు బేకింగ్ పోడాలో ముప్పావు కప్పు నిమ్మరసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ సింక్ మొత్తం ఉపయోగించి శుభ్రం చేయాలి. ఆ తర్వాత అరకప్పు వైట్ వెనిగర్ ను సింక్ మొత్తంపోయాలి.
బేకింగ్ సోడా విత్ లిక్విడ్ సోప్: బేకింగ్ సోడాను ఉపయోగించడానికి ఇది మరొక కాంబినేషన్ కిచెన్ క్లీనింగ్. ఒక బౌల్లో బేకింగ్ సోడా మరియు లిక్విడ్ సోప్ ను మిక్స్ చేసి, దీన్ని వాటర్ లో మిక్స్ చేసి, వెనిగర్ జోడించాలి . ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్లో నింపి వాడే ముందు బాగా షేక్ చేయాలి.
చివరగా శుభ్రం చేయాలి: ఒకసారి శుభ్రం చేసిన తర్వాత , సింక్ ను పూర్తిగా కడగాలి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసి, సాప్ట్ క్లాత్ లేదా కాటన్ క్లాత్ తో తుడవాలి. సింక్ ను ఉపయోగించిన ప్రతి సారి శుభ్రం చేయాలి . ఇలా రొటీన్ గా చేయడం వల్ల శుభ్రంగా మరియు షైనింగ్ తో మెరుస్తుంటుంది.



Click it and Unblock the Notifications