Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
హైడ్రోజెన్ పెరాక్సైడ్ ఉండగా మీకు చింత ఏలా...?
హైడ్రోజెన్ పెరాక్సైడ్ క్లీనింగ్ ఏజెంట్ గా బాగా పనిచేస్తుంది. దీన్ని ఇంట్లో వివిధ వస్తువులను శుభ్రం చేయాడానిక ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను గాయలాను మాన్పడానికి మరియు తెగిన చర్మాన్ని బాగు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను ఫస్ట్ ఏయిడ్ ఉపయోగించడం కథ అంటుంచితే..ఇంట్లో వివిధ రకాల వస్తువులను క్లీన్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు: ఉడెన్ కట్టింగ్ బోడ్స్ శుభ్రం చేయవచ్చు. ఇది శుభ్రం చేసే క్లీనింగ్ ఏజెంట్స్ లో ఖరీదు తక్కువ. అంతే కాదు కూరగాయల మీద కొద్దిగా హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను చిలకరించడం వల్ల బ్యాక్టీరియాను నాశనం చేయవచ్చు. ఇలాంటి మరికొన్ని ప్రయోజనాలను చూడండి...
మొండి మరకలను తొలగిస్తుంది: దుస్తుల మీద పడ్డ రెడ్ వైన్ లేదా నూనె లేదా కఠినమైన మట్టి మరకలను తొలగించడంలో హైడ్రోజెన్ హైడ్రోజెన్ పెరాక్సైడ్ అద్భుతంగా పనిచేస్తుంది. నీటిలో కొద్దిగా హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను మిక్స్ చేసి దుస్తులను వాష్ చేయడం వల్ల చెమట మరకలు సులభంగా తొలగిపోతాయి. అలాగే రక్తపు మరకలు కూడా సులభంగా తొలగిపోతాయి.
మరకలు పడ్డ ఫ్లోర్ లేదా టైల్స్ ను శుభ్రం చేస్తుంది: ఇండ్లో వైట్ ఫ్లోర్ లేదా వైట్ టైల్, బాత్ రూమ్ లోని వైట్ టైల్స్ ను మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఏచిన్న మరకలేర్పడ్డా అసహ్యంగా కనబడుతుంది. కాబట్టి కొన్ని నీళ్ళలో హైడ్రోజెన్ హైడ్రోజెన్ పెరాక్సైడ్ మరియు వైట్ వెనిగర్ వేసి ఇల్లు తళతళ మెరిసేలా చేయవచ్చు.
వంటగది: మీరు వంటగదిలోని చాలా వస్తువులను హైడ్రోజెన్ పెరాక్సైడ్ ఉపయోగించి శుభ్రపరచవచ్చు. ఉదా: ఉడెన్ కట్టింగ్ బోర్డ్స్, డిష్ వాషింగ్ స్పాంజులు, స్ర్కబ్స్ మొ...హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది.
సింక్: కిచెన్ సింక్ నూనె మరియు జిడ్డు మరకలతో అసహ్యంగా మారుతుంటాయి. వీటిని శుభ్రపరచడానికి హైడ్రోజెన్ పెరాక్సైడ్ బాగా సహాయపడుతుంది. హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను ఉపయోగించి సింక్ లో ఉన్న చెడు వాసనను మరియు నీటి మరకలను తొలగించవచ్చు. అలాగే బాత్ హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను ఉపయోగించి రూమ్ వాష్ బేషిన్ కూడా తళతళ మెరిపింప చేయవచ్చు.
అంటువ్యాధులకు గురిచేసే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది: బ్యాక్టీరియాను హైడ్రోజెన్ పెరాక్సైడ్ నాశనం చేస్తుంది. వెజిటేబుల్స్ మీద బ్యాక్టీరియా లేకుండా కొన్ని చుక్కల హైడ్రోజెన్ పెరాక్సైడ్ ను చిలకరించడం మంచిది అలాగే కిచెన్ స్లాబ్స్, మీద కూడా చల్లి శుభ్రం చేయవచ్చు.

రిఫ్రిజరేటర్ ను శుభ్రపరుస్తుంది: ఫ్రిజ్ లో ఎటువంటి చెడు వాసన లేకుండా హైడ్రోజెన్ పెరాక్సైడ్ సహాయపడుతుంది. కాటన్ వస్త్రం మీద హైడ్రోజెన్ పెరాక్సైడ్ వేసి ఫ్రిజ్ ను తుడవడం వల్ల చెడు వాసన తొలగిపోవడంతోపాటు ఫ్రిజ్ తళతళ మెరుస్తుంటుంది.
టాయిలెట్ క్లీనింగ్: టాయిలెట్స్ లో ఏర్పడే పసుపుపచ్చని మరకలు నిజంగా చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. కాబట్టి వీటిని తొలగించడానికి హైడ్రోజెన్ పెరాక్సైడ్ బాగా సహాయపడుతుంది. అంతే కాదు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. బ్యాడ్ స్మెల్ ను తొలగించి క్లీన్ గా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications
