Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
మెషిన్లో దుస్తులు శుభ్రంచేయడానికి సులభ చిట్కాలు
వాషింగ్ మిషన్ గురించి తెలుసుకుంటే, వాషింగ్ మెషిన్ చాలా ఉపయోగకం మరియు ఎక్కువ దుస్తులను ఒక్కే సారి శుభ్రం చేయడానికి చాలా సులభం అవుతుంది. అంతే కాదు, వాషింగ్ మెషిన్ లో శుభ్రం చేసిన దుస్తులు, మంచి మెరుసుతో మరియు బ్రైట్ గా కనిపించేలా చేస్తాయి. అయితే, వాషింగ్ మెషిన్ లో కలర్ దుస్తులను వాష్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే కలర్ దుస్తులు రంగు కోల్పోవడం వల్ల, ఆ రంగు ఇతర దుస్తులకు అంటుకుంటుంది. కాబట్టి, లాండ్రీ విషయంలో అనుసరించాల్సిన కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ను ఫాలోచేసే వారు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఉన్నారు.
వాషింగ్ మెషిన్ లో దుస్తులును శుభ్రం చేయడానికి మందు కొన్ని డిఫరెంట్ మెటీరియల్స్ ను సపరేట్ గా లాండ్రీ చేయాలి. లేదంటే, హార్డ్ గా ఉన్న దుస్తులు, సున్నితమైన దుస్తులను నాశనం చేస్తాయి. మరి మీ ల్యాండ్రీ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఇక్కడ బెస్ట్ ల్యాండ్రీ మొదలు పెట్టడానికి ముందు కొన్ని టిప్స్ ను అనుసరించాలి. మీకోసం కొన్ని ల్యాండ్రి టిప్స్..

బ్లాంకెట్స్ వాష్ చేయడం : శీతాకాలం మొదలైంది, మీ బ్లాంకెట్స్ సరైన పద్దతులతో మరియు సరైన జాగ్రత్తలు తీసుకొని వాష్ చేయాలి. డిటర్జెంట్ పౌడర్ తో బ్లాంకెట్స్ ను సపరేట్ గా శుభ్రం చేయాలి . దుప్పట్లు ఉతికాలనుకొన్నప్పుడు ఎండ బాగా పడేటప్పుడు ఉతకడం వల్ల దుప్పట్లు బాగు డ్రై అవుతాయి. ఉతికిన తర్వాత దుప్పట్లు, నీళ్ళలో జాల్సే ముందు వెనిగర్ వేస్తే మంచి సువవాస వస్తుంది.
జీన్ ఉతకడానికి: మీరు జీన్ దుస్తులు ఉతకాలనుకొన్నప్పుడు, వాషింగ్ మెషిన్ లో వేయడానికి ముందు జీన్స్ దుస్తులను వేడి నీటిలో కొంత సమయం నానబెట్టిన తర్వాత వాషింగ్ మెషిన్ లోవ ేయాలి . అలాగే వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు కూడా చేర్చడం వల్ల మీ జీన్స్ కలర్స్ పోకుండా నివారిస్తుంది. మరియు శుభ్రం అవుతాయి.
ఆయిల్ మరకలు: మరకులు చాలా సమస్యత్మకమైనవి, అంత సులభంగా పోవు . కాబట్టి, ఆయిల్ మరకలను నివారించడానికి ల్యాండ్రి టిప్స్ మొదట ఆయిల్ మరకల మీద టాల్కం పౌడర్ అప్లై చేసి పదినిముషాలు అలాగే ఉంచి, తర్వాత చల్లటినీటిలో శుభ్రం చేయాలి . తర్వాత మెషిన్ లో వేయాలి.
సున్నితమైన దుస్తులు ఉతకడానికి: సున్నితమైన దుస్తులను చాలా సున్నితంగా ఉతకాల్సి ఉంటుంది !సున్నితమైన దుస్తులను శుభ్రం చేయడానికి, బెస్ట్ ల్యాండ్రీ టిప్స్ గుర్తుంచుకోవల్సింది మొదటి చల్లటి నీటిలో హ్యాండ్ వాష్ చేయాలి . తర్వాత మెషిన్ లో వేసి రెండు నిముషాలు శుభ్రం చేసుకోవాలి.
లోదుస్తులు శుభ్రం చేసేటప్పుడు: లోదుస్తులను శుభ్రం చేయడానికి ఒక కప్పు బ్లాక్ టీని ఒక మగ్గు నీటిలో వేసి, అందులో లోదుస్తులను కొద్దిసేపు నానబెట్టి, తర్వాత శుభ్రం చేయడం వల్ల లోదుస్తులు రఫ్ గా లేకుండా సున్నితంగా ఉంటాయి. ముఖ్యంగా లేస్ తో తయారుచేసిన లోదుస్తులుకు మంచి ఫలితం ఉంటుంది.
స్వెటర్స్: స్వెటర్స్ ను శుభ్రం చేయడానికి ఒక బెస్ట్ ల్యాండ్రీ టిప్, ముందుగా స్వెటర్స్ ను వెనిగర్ నీటిలో పది నిముషాలు నానబెట్టుకోవాలి. తర్వాత వాషింగ్ మెషిన్ లో వేసి శుభ్రం చేయాలి.
రక్తపు మరకలున్న దుస్తులు శుభ్రం చేయడం: బ్లీడింగ్ దుస్తులు శుభ్రం చేయడానికి, ఉప్పు, మరియు వెనిగర్ నీటిలో 15నిముషాలు నానబెట్టాలి. తర్వాత వాషింగ్ మెషిన్ లో వేసి శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications