Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
క్రిస్మస్ సెలబ్రేషన్ కు ముందే ప్లాన్ చేసుకోండి..
క్రిస్మస్ దగ్గరలో రాబోతోంది, ఇల్లు శుభ్రంగా చేయాలి. అందంగా అలకరంచే పనులు అప్పుడే మొదలు పెట్టేసుంటారు . ఈ శీతాకాలంలో మీ ఇంటిని శుభ్రం చేయడం చాలా అవసరం. అప్పుడే మీరు క్రిస్మస్ ను ఎంజాయ్ చేసే అనుభూతికి కలిగి ఉంటారు . ఈ పండుగ సమయంలో మీ ఇంట్లో మరియు బయట శుభ్రం చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది హోలీ సీజన్, అందుకే మీ ఇంటిని క్లీన్ చేయడం చాలా అవసరం.
ఇంట్లో ఫ్యాషన్ గా వస్తువులను అలంకరించడం, ఇంటి డెకరేట్ చేయడం, పాత డెకరేషన్స్, పేపర్స్ తొలగించడం, కొత్తవాటిని డెకరేట్ చేయడం వంటి పనులన్నీ కూడా ఒక ఫర్ ఫెక్ట్ ప్రేరణను కలిగిస్తుంది. ఇంట్లో కొత్తగా ఉండే, కర్టెన్స్, సోఫా కవర్స్, బెడ్ షీట్స్ మార్చడం మరియు క్రిస్మస్ ట్రీ అలంకరించడానికి కొత్త ఆభరణాలను కొనుగోలు చేయడం, కలర్ ఫుల్ లైట్స్ కొనుగోలు చేసి, అలంకరించడం వల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే క్రిస్మస్ రోజుకు వారం రోజులు ముందుగానే ఇంట్లో అన్నింటిని రెడీ చేసుకోవాలి. వారం రోజుల ముందుగానే ఇంటికి కావల్సిన వస్తువులను, డెకరేషన్ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలని మీరు ముందుగానే ప్లాన్ చేసి, సర్దుకోవచ్చు. పండుగ రోజు ఎటువంటి గందరగోలం ఉండదు. క్రిస్మస్ కు మీ ఇంటిని అందంగా అలంకరించడానికి, పండుగకు అన్నిసిద్దం చేసుకోవడానికి ఇటువంటి చిట్కాలు మరికొన్ని మీకోసం...

గ్రిల్ ను శుభ్రం చేయాలి:
మీ ఫేవరెట్ డిష్ లను తయారుచేయడానికి సిద్దంగా ఉంచుకోవడానికి మీ గ్రిల్స్ ను శుభ్రంగా ఉంచాలి. వింటర్ సీజన్ లో గ్రిల్డ్ పదార్థాలను ఎక్కువగా ఇష్టపడుతారు. అందువల్ల, ముందుగానే గ్రిల్స్ ను శుభ్రం చేసి, ముందుగానే సెట్ చేసి పెట్టుకోవాలి.

కుక్కీస్ మౌల్డ్స్:
కుక్కీస్ తయారుచేసే అచ్చులను, క్రిస్మస్ కు ఒక వారంకు ముందే శుభ్రం చేయాలి. బేకింగ్ సోడా మరియు నిమ్మరసం ఉపయోగించి, కుక్కీస్ అచ్చులను శుభ్రం చేసి సిద్దంగా పెట్టుకోవాలి.

క్రిస్మస్ ట్రీని గాలిలో కొంత సమయం పెట్టాలి:
క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడానికి ముందే, గాలివీచే ప్రదేశంలో మరియు ఎండలో కొద్దిసేపు పెట్టాలి. ఒక సంవత్సరం పాటు రోల్డ్ చేసి, స్టోర్ రూమ్ లో పెట్టడం వల్ల ఆకులు ముడుచుకొన్నట్లు, రెమ్మలు, ఆకులు ఎక్కడివి అక్కడ బందించబడి ఉంటాయి. మరియు వాసన కూడా ఉంటుంది. కాబట్టి, కొంత సమయం వాటిని బయట పెట్టడం మంచిది.

డెకరేషన్:
డెకరేషన్ విషయంలో, ముందుగా పాతవి మరియు డెకరేషన్ కు పనికిరానివి ముందుగా తొలగించాలి. మీ ఇంటిని పండుగ వాతావరణం కల్పించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

అనవసర వస్తువులను తొలగించాలి:
క్రిస్మస్ కు మీ ఇంటిని సిద్దం చేసేపుడు ముందుగా గుర్తించుకోవల్సింది, ఇంట్లో పనికిరాని వస్తువులు, పదార్థాలు వంటివి తొలగించాలి .

మీ ఇంటికి పెయింట్ చేయాలి:
క్రిస్మస్ కు రెండు వారాల ముందుగానే పెయింట్ చేయడం వల్ల క్రిస్మస్ లోపు మీరు మీ ఇంటిని అద్భుతంగా అలంకరించుకోవచ్చు . క్రిస్మస్ కు మీ ఇంటిని అలంకరించడానికి ఇది ఒక అద్భుతమైన ఉపాయం .

పశువులకు గడ్డి వేసి తొట్టె(క్రిబ్)కోసం ఒక ప్రదేశంను ఎంపిక చేసుకోవాలి:
ఇంట్లో క్రిబ్ కోసం ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆప్రదేశం చాలా బ్రైట్ గా అందంగా కనిబడలా జాగ్రత్త పడాలి.

వైన్ సెల్లర్ క్లియర్ చేయండి:
క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు అత్యంత ముఖ్యమైన అంశం వైన్. వైన్ సెల్లర్ ను శుభ్రం చేయడం, క్లియర్ చేసి, కొత్తవాటిని తీసుకొచ్చి వాటిలో స్టోర్ చేయడం క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో ఒక భాగం.

క్రిస్టల్స్:
క్రిస్మస్ కు మీ ఇంటిని మరింత కలర్ ఫుల్ గా, ప్రకాశవంతంగా మార్చడం కోసం క్రిస్టల్స్ ఎంపిక చేసి, మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications