పూజరూంను శుభ్రం చేయడానికి హోం రెమడీస్

దేశంలో అత్యంత ఇష్టంగా పిల్లలు పెద్దలు ఇంటిళ్లిపాది సంబరాలు జరుపుకొనే పండుగ గణేష చుతుర్ధి. ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి కొన్ని వారాల ముందు నుండే ఇంట్లో పనులు మొదలెడుతారు. గణేష చతుర్ధికి పండుగకు గణేష పూజ ప్రధానమైనది. ప్రతి ఇంట్లోను పండుగనాడు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ అట్టహాసంగా ఆ గణేషుడికి పూజలు చేసి ఆశీర్వాదాలు కోరతారు.

ఇంట్లో ప్రధానమైన గధులు ఒకటి పూజగది, రెండవది లివింగ్ రూమ్, మూడవది వంటగది. అయితే వీటిలో ముఖ్యంగా పూజగదికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈగదులను శుచి శుభ్రత పాటించాలి. ఒకేసారి ఇంటిని శుభ్రపరచాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకు చాలా శక్తి, మనస్సుకు ఉత్సాహం కలిగి ఉండాలి. కాబట్టి ఈ దీపావళికి శరీరం శ్రమ చెందకుండా ఇంటి చక్కబెట్టడంలో కొన్ని సులభమైన క్లీనింగ్ చిట్కాలు మీకోసం...ప్రతి ఇంట్లో పూజ సామాగ్రి కొందరు పండుగరోజు మాత్రమే బయటకు తీసి ఉపయోగిస్తుంటారు. ఇలా దాచివుంచిన విలువైన వెండి, సామాగ్రి పాతవాటిలా, మరకలతో కనిపిస్తుంటాయి. అలా కాకుండా అవి కొత్తగా మెరుపును సంతరించుకోవాలంటే కాస్త సమయం కేటాయిస్తే మంచిది. అలా కొత్తవాటిలా మెరవాలంటే ఇంట్లో లభించే పదార్థాలతోనే శుభ్రం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

Cleaning Puja Room

1. వెండి వస్తువులను వేడినీటిలో గంటసేపు ఉంచి నిమ్మరసంతో శుభ్రపరిస్తే చాలు తెల్లగా మెరుస్తాయి.

2. ఇంట్లో తరచుగా వాడో బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్టులా చేసి దాన్ని స్పాంజ్ తో తీసుకొని వెండి సామాగ్రిని రుద్దాలి. తర్వాత వేడినీటితో కడిగి పొడిగా ఉన్న మెత్తని వస్తంతో తుడిస్తే వస్తువుల మీద గీతలు మిలమిలా మెరిసిపోతాయి.

3. పూజసామాగ్రిలో చిన్న చిన్న వస్తువులు శుభ్రపరచడానికి టూత్ పేస్ట్ను రాసి మెత్తని బ్రిసిల్స్ ఉన్న బ్రెష్ తో రుద్దితే సరిపోతుంది.

4. దీపారాధన చేసిన వెండి దీపాలు జిడ్డుగా ఉంటాయి. ఈ జిడ్డును వదిలించాలంటే ఇబ్బంది. కాబట్టి ఈ జిడ్డు సామాగ్రిని శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా పేస్ట్ ను రాసి గంటపాటు అలా ఉంచి వేడినీలితో శుభ్రపరిస్తే జిడ్డు తేలిగ్గా వదులుతుంది.

5. వెండి పూజ సామాగ్రిని పీతాంబరి పౌడర్ తో రుద్ది మంచినీటితో శుభ్రపరచి, పొడి వస్త్రంతో తుడిస్తే మిలమిల మెరుస్తుంటాయి. సబీన పౌడర్ లో కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి రుద్దినట్లైతే సిల్వర్ వస్తువులు శుభ్రపడుతాయి.

6. వార్డ్ రోబ్ తో శుభ్రత మొదలు పెట్టండి: చిన్న ఫర్నీచర్లు మరియు చిన్న చిన్న వస్తువులను శుభ్రం చేయడం చాలా సులభం. కాబట్టి వార్డ్ రోబ్స్ క్లీన్ చేయడానికి రెండు గంట సమయం పట్టవచ్చు. వార్డ్ రోబ్ లో ఉన్న పాత బట్టలు, చిరిగిన బట్టలను తీసి పడేయాలి. అలాగే మీరు తరచూ వాడని బట్టలను విడిగా సర్దుకోవాలి. అలాగే వార్డ్ రోబ్ లో దుస్తులను సర్దేటప్పుడు చిన్న చిన్న దుస్తులను, హ్యాడ్ కర్ఛీఫ్ లను, సాక్స్ లు వంటివి సపరేట్ గా కనబడే విధంగా అమర్చుకోవాలి. డైలీ వేర్ ను సపరేట్ గా సర్దుకోవాలి.

7. బెడ్ బాక్స్ ల శుభ్రత: దీపాలి వచ్చిదంటే అన్ని వస్తువులను క్లీన్ చేయాలని అప్పుడే గుర్తుస్తుంటాయి. బెడ్ కనుకు క్రింద బాక్స్ అమర్చి అందులో దుస్తులు, ఇతర వస్తువులు కుప్పలుగా పడేసి ఉంటారు. బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, ఉపయోగించని కర్టెన్లు ఇలాంటి వాటినన్నింటిని బయటకు తీసి శుభ్రం చేసి అవసరం అయిన వాటిని మాత్రమే తిరిగి అందులో సర్దుకోవాలి. చెక్క బెడ్ ను పొడి వస్త్రాన్ని తీసుకొని శుభ్రం చేయాలి.

8. ఫ్యాన్ మరియు లైట్స్ క్లీనింగ్: ప్రతి మూడు నెలలకొక సారి ఫ్యాన్స్, లైట్స్ ను శుభ్రం చేయడం వల్ల ఫ్యాన్స్ పాడవకుండా ఉంటాయి. లైట్స్ బ్రైట్ గా వెలుగుతాయి. అలాగే ఇంటి కిటికీలు, తలుపులను కూడా శుభ్రం చేసుకోవాలి. ఫ్యాన్స్, లైట్స్ క్లీన్ చేసేటప్పుడు పొడి వస్త్రాన్ని ఉపయోగించాలి. దాంతో కరెంట్ షాక్ కు గురికాకుండా ఉంటారు.

9. వంట గది: ఇంటి మొత్తంలో అత్యంత ప్రధానమైన ప్రదేశం వంటగది. ఎందుకంటే వంట చేయడం, తినడం వంటివి ఈ ప్రదేశంలో ఎక్కువ కాబట్టి ఎక్కువ అశుభ్రంగా మారేది కూడా ఈ గదిలోనే. కాబట్టి వంటగది శుభ్రత మరింత ముఖ్యం. అందులో ఉన్న చిన్న చిన్న పోపు డబ్బాలు, గ్యాస్ స్టౌ, స్లాబ్స్, ఎక్సాస్ట్ ఫ్యాన్, స్టీల్ సామాన్లు అన్నింటినీ శుభ్రం చేసుకోవడం ముఖ్యం. ఈ పనులన్నీ ఒక్కరోజులో శుభ్రం చేసుకోవడానికి వీలుకాకపోతే రెండు మూడు రోజలు డివైడ్ చేసుకొని శుభ్రం చేసుకోవాలి.

10. కిటికీలు మరియు గ్రిల్స్: సాధారణంగా చాలా మంది ఫ్యాన్స్, విండోస్ పట్ల అంత శ్రద్ద తీసుకోరు. కిటీకీలు, గ్రిల్స్ మీదు దుమ్ము, ధూలి అతి సులభంగా వచ్చి చేరిపోతుంది. కాబట్టి సోప్ వాటర్ తో గ్రిల్స్ ను శుభ్రం చేసిన తర్వాత పొడి వస్త్రంతో తుడివాలి.

11. కర్టెన్స్ మరియు సోఫా కవర్స్: చివరగా సోఫా కవర్స్, కర్టెన్స్ వంటివి శుభ్రం చేసుకోవాలి. అవే ఇంటికి ప్రధాన ఆకర్షణ కాబట్టి ఎంత క్లీన్ గా ఉంటే అంత అందంగా ఉంటుంది.

Story first published: Friday, September 6, 2013, 15:08 [IST]
Desktop Bottom Promotion