Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
విండో గ్రిల్స్ నీట్ గా క్లీన్ గా ఉంచే కొన్ని సింపుల్ టిప్స్
చాలా నీట్ గా, క్లీన్ గా ఉండే ప్రతి ఇల్లూ ఓ చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. మీ ఇల్లు మొత్తం ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా కనబడాలంటే ఇంట్లో ప్రతి మూలలోనూ ఒక కన్నేసి ఉండాలి. ఇంట్లో ఇతర ప్రదేశాలైన కిటికీలు(విండోస్) మరియు విండో గ్రిల్స్ వంటి ఎక్కువగా బయట దుమ్ము, ధూళి మరియు ఇతర కాలుష్యం వల్ల విండో గ్రిల్స్, డోర్స్ అందవిహీనంగా మారుతాయి. ఇంటి అలంకరణలో వీటి శుభ్రత కూడా చాలా అవసరం.
అందువల్ల, మీ ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కనబడాలంటే మీ ఇంటి లోపలి ప్రదేశాలతో పాటు బయటి ప్రదేశాలు అంటే డోర్స్, విండోస్, విండో గ్రిల్స్ కూడా శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే విండో పేన్ ను మీరు సులభంగా శుభ్రం చేయవచ్చు. విండో గ్రిల్స్ శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు మరియు ట్రిక్ ఉన్నాయి. వీటిని ఫాలో అయితే మీ పని సులభం అవుతుంది. ఇల్లు ఆకర్షనీయంగా మారుతుంది.
1. బ్రషింగ్ : విండో గ్రిల్స్ కు పట్టిన దుమ్ము మరియు ధూళి తొలగించడానికి ఒక మృదువైన bristle బ్రష్ తీసుకోవాలి. అందుకు మీరు డస్టర్ లేదా మృదువైన వస్త్రం ఉపయోగించవచ్చు. నీళ్ళతో కడగడం లేదా తుడవడానికి ముందు దుమ్ము, ధూళిని తొలగించడం చాలా ముఖ్యం.
2. తుడవడం: విండో గ్రిల్స్ కు డస్ట్ ను తొలగించడానికి బ్రషింగ్ చేసిన తర్వాత, నాణ్యమైన సోపును లేదా సోప్ వాటర్ ను గ్రిల్స్ కు రాయాలి. తర్వాత మెత్తటి కాటన్ క్లాత్ ను ఉపయోగించి శుభ్రంగా తుడవాలి. వాటి మీదు ఎటువంటి గీతలు పడకుండా తుడవాలి. దుమ్ము ధూళి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లైతే కఠిన మైన సబ్బులను ఉపయోగించవచ్చు.
3. వాటర్ అండ్ వెనిగర్: గ్రిల్స్ అంతగా మురికి పట్టకుండా ఉంటే అందుకు వెనిగర్ మరియు నీళ్ళను ఉపయోగించి తుడవచ్చు. విండో గ్రిల్స్ శుభ్రం చేయడానికి వెనిగర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సోపు లేదా డిటర్జెంట్స్ లేకుండానే గ్రిల్స్ ను ఎటువంటి మార్కు లేకుండా శుభ్రం చేస్తుంది.
4. నో అబ్రసివ్స్: మీ విండో గ్రిల్స్ ను శుభ్రం చేయడానికి ఎటువంటి అబ్రసివ్స్ ను ఉపయోగించకండి. జిడ్డుగా ఉన్న లేదా ఏదైనా అంటుకొన్న గ్రిల్స్ ను శుభ్రం చేయడానికి కాంటరాక్టింగ్ పదార్థాలను ఎంపిక చేసుకోండి లేదంటే విండోస్ మీద స్క్రాచెస్ ఏర్పడుతాయి దాంతో మొత్తం అందం పాడవుతుంది.
5. చేతి తొడుగులు: విండో గ్రిల్స్ శుభ్రం చేసే ముందు చేతులకు కాటన్ హాడ్ సాక్స్ లను తొడుగులను తొడుగుకోవాలి. దాంతో మీరు శుభ్రం చేయాడానికి సులభం అవుతుంది. ఎక్కువ మరకలు లేని లేదా దుమ్ము పట్టని గ్రిల్స్ ను శుభ్రం చేయడానికి ఈ పద్దతి చాలా తేలిక అవుతుంది.
6. వేడి నీళ్ళు: విండో గ్రిల్స్ నుండి డస్ట్ మరియు ఏదైన అంటుకొన్న పదార్థాలను తొలగించడానికి వేడి నీళ్ళు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మీ వంటగది విండోను శుభ్రం చేయాడానికి ఈ పద్దతి బాగా సహాయపడుతుంది. కాటన్ క్లాత్ ను వేడినీటిలో ముంచి తర్వాత విండో గ్రిల్స్ ను తుడవాలి.
7. రసాయనాలు ఉపయోగించకూడదు: విండోకు పట్టిన దుమ్ము,ధూళి లొగించడానికి ఎటువంటి కఠినమైన రసాయనాలను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ఐరన్ విండ్ గ్రిల్స్ ను రసాయనాలను ఉపయోగించకూడదు. లేదంటే అవి తుప్పు పట్టడానికి దారితీస్తుంది. కాబట్టి అందుకు తేలికపాటి డిటర్జెంట్స్ ను ఉపయోగించండి.
బాగా శుభ్రం చేసిన విండో గ్రిల్స్ మీ ఇంటిని ఆహ్లాదకరమైన లుక్ ను అంధిస్తుంది. మరియు ముందు కంటే మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. విండో పేన్ ను మరియు విండో గ్రిల్స్ క్లీన్ గా ఉండటం వల్ల ఇల్లు మరింత ముచ్చటగా కనిపస్తుంది.



Click it and Unblock the Notifications
