Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఉదయం రొటీన్ గా చేసే పనులను చిటికెలో ముంగించడం ఎలా....?
మహిళలకు ప్రతి రోజూ ఒక ఒత్తిడితో కూడుకొన్న రొటీన్ వర్క్. ముఖ్యంగా ఇంట్లో ఉండే వారితో సహా, పనిచేసేవారి పని మరీ గోరంగా ఉంటుంది. ఇక ప్రతి రోజూ స్కూలుకు వెళ్ళే పిల్లలుంటే బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయాలి మరియు పెద్దలు ఆఫీసులకు వెళ్ళాల్సివస్తుంది. వీరందరి బాధ్యత ఇంటి మహిళ మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వారు వారి వారి పనులకు వేళ్ళే సమయానికి వారికావల్సినవన్నీ సమకూర్చాల్సింది ఇల్లాలే కాబట్టి. ప్రతి పనీ హరీబరీగా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్రతి రోజూ చేసే రొటీన్ వర్క్ ను త్వరగా..సులభతరంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా చేయాలంటే ? ఉదయం ఏర్పడే ఒత్తిడి నుండి ఉపశమనం పొందుటకు కొన్ని చిట్కాలను పాటించినట్లైతే తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది.
మీరు కనుక మార్నింగ్ రొటీన్ వర్క్ ను టైమ్ కు చేయలేకపోతున్నట్లైతే ఆ పనులు మీరు పూర్తి కొన్ని చిట్కాలు తప్పక ఉపయోగపడుతాయి. స్మార్ట్ గా వర్క్ చేయడానికి ఎల్లప్పుడు కొన్ని ట్రిక్స్ ను కలిగి ఉండటం వల్ల కష్టంగా అనిపించకుండానే పనులు పూర్తిచేసుకోగలరు. అందుకు మహిళలకు ఉపయోగపడే కొన్ని సులభ చిట్కాలు అంధిస్తున్నాం..

వంట గది శుభ్రతను రాత్రి సమయంలోనే పూర్తి చేయండి: పనులన్నీ పూర్తి అయిన తర్వాత, భోజనాలు పూర్తి అయిన తర్వాత రాత్రి పడుకోబోయే ముందుగా కిచెన్ క్లీనింగ్ కూడా పూర్తి చేసుకోవాలి. ఉదయం మీకు అవసరం అయ్యే గిన్నెలను, క్యారేజ్ లను రాత్రే శుభ్రం చేసుకోవాలి. అవును ఎక్స్ ట్రా వర్క్ వల్ల మీకు అలసటగా అనిపించినా, రాత్రి సమయంలో ఇటువంటి పనులు పూర్తి చేసుకోవడం వల్ల, ఉదయం మీరు చేయాల్సిన రొటీన్ పనులు త్వరగా ముగించగలుగుతారు.
ముందుగానే ప్లాన్ చేసుకోవడం: నిద్రకు ఉపక్రమించడానికి ముందే ఉదయం చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఏం పనిచేయాలి, ఏం కూరలు వండాలి. ఏం బ్రేక్ ఫాస్ట్ లు తయారు చేయాలి?అని ఆలోచించే లోపే పది నిముషాలు గడిచిపోతుంది. తర్వాత మీరు తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు ఉన్నాయో లేదో కూడా తెయకుండా ప్లాన్ చేయడం వల్ల ఉదయం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది కూడా ఒక రకంగా ఒత్తిడికి కారణం అవుతుంది. కాబట్టి నిద్రపోయే ముందు రఫ్ గా ఒక ప్లాన్ వేసుకొని, ఉదయం తయారు చేసే ఆహారపదార్థాలు సరిపోయే పదార్థాలు ఉన్నాయో లేదో తెలుసుకొని, లేకపోతే రాత్రే ఆరేంజ్ చేసి పెట్టుకోవాలి.
వంటగది ఎల్లప్పుడు శుభ్రంగా ఉండేలా యూసర్ ఫ్రెండ్లీగా సర్దుకోవాలి: చాలా మంది చేసే పొరపాటు వంట గదిలో వస్తువలు ఎలా పడితే అలా వదిలేసుంటారు. ముఖ్యంగా జార్స్ , బాటిల్స్, వంటివి చిందరవందరగా పడేసి ఉంటారు. ఇలా ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసి ఉండటం వల్ల అవసరం అయినప్పుడు మీకు కావాల్సిన వస్తువు దొరకదు. కాబట్టి కప్ బోర్డ్ లోని వస్తులు, పోపుడబ్బాలు అన్నింటిన్నీ విడివిడిగా క్లీన్ (మీ కంప్యూటర్ లో కీబోర్డ్ లా)గా సర్ధుకోవాలి. కీబోర్డ్ లోని టాబ్ అన్ని మీరు పనిచేయడానికి మీ మెదడు మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే మన సర్ధుకొనే వస్తువుల మీద కూడా అంతే. మీ వంటగది సెల్ఫ్స్ మీరు ఉపయోగించే విధంగా సర్దుకోవాలి.
బట్టలను రాత్రే ఐరన్ చేసి పెట్టుకోవాలి: ఉదయం ధరించాల్సిన దుస్తులను ముందురోజు రాత్రే ఎంపిక చేసి పక్కకు తీసి పెట్టుకోవడం వల్ల ఉదయంపూట మీ విలువైన సమయాన్ని సేవ్ చేస్తుంది. ఐరన్ కూడా రాత్రే పూర్తి చేసి పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ ఉదయానికి పోస్ట్ పోన్ చేయకూడదు. అలాగే ఉదయం మీకు కావల్సిన షూ, సాక్స్ లు, న్యాప్కిన్స్ మరియు మీకు అవసరం అయ్యే ఇతర వస్తువులను కూడా సర్దుకోవాలి.
ఈ చిన్నచిన్న అతి సులభమైన చిట్కాలు ప్రతి మహిళకు సహాయపడుతాయి. వీటిని పాటించినట్టైతే మీ జీవితం సుఖవంతం అవుతుంది. ఎటువంటి ఒత్తిడికి గురి అవ్వకుండా.. ఆరోగ్యంగా ఉండగలుగుతారు.



Click it and Unblock the Notifications











