For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారం కొరకు వాస్తు చిట్కాలు

|

ఇంటి ప్రవేశద్వారం ప్రధాన శక్తిని తీసుకువస్తుంది. ప్రధాన ద్వారం యొక్క వాస్తు గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి.

ఇంటికి ప్రధాన ద్వారం ఇంటి ప్రధాన విభాగాలలో ఒకటిగా ఉంది. డాక్టర్ స్నేహళ్ S దేశ్పాండే, ఆధునిక ఫెంగ్ షుయ్ & ప్యర వాస్తు కన్సల్టెంట్ దీని గురించి మరింతగా చెప్పారు. ప్రధాన ద్వారం ప్రధాన శక్తిని ఇచ్చే ఒక ఇంటి ముఖద్వారంగా ఉంటుంది. ఇక్కడ తలుపుకు సంబంధించి చేయవలసిన మరియు చేయకూడని కొన్ని నియమాలు ఉన్నాయి.

సౌత్ వెస్ట్ ముఖంగా తలుపు కలిగి ఉండే లక్షణంను నివారించండి. ఈ విధంగా చేస్తే దెయ్యం శక్తి ప్రవేశం మరియు పోరాటాలు మరియు దురదృష్టకర సంఘటనలు జరుగుతాయి. ఆధునిక ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంటి సంపద శక్తి బాగుంటే యజమానులు ప్రారంభ 3-4 సంవత్సరాలలో సంపన్నుడు కావచ్చు. కానీ మీ ఇంటికి ఇప్పటికే సౌత్ వెస్ట్ ముఖంగా ఒక తలుపు కలిగి ఉంటే అప్పుడు మీరు క్రిందికి పతనం ఎదుర్కొనవలసి వస్తుంది. దానిని నివారించటానికి తలుపు బయట 2 హనుమంతుని యొక్క టైల్స్ (తన ఎడమ చేతిలో గదతో ఉన్న) పెడితే ఆ తేడాను మీరే గమనించవచ్చు. పసుపు నీలమణి,భూమి క్రిస్టల్స్ లాంటి కొన్ని రత్నాలను నిపుణుల సలహాతో ఈ లోపం యొక్క తీవ్రతను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. అటువంటి లక్షణాలను నివారించటం అనేది ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉంటుంది.

Vaastu tips for your home's main entrance

సౌత్ ఈస్ట్ ముఖంగా తలుపు ఉంటె అనారోగ్యం,కోపం మరియు కోర్టు విషయాలు వస్తాయని చెప్పబడుతుంది. గాయత్రీ మంత్రం యొక్క స్టికర్లను బయట నుండి తలుపు రెండు వైపులా ఫిక్స్ చేయాలి. పసుపు నీలమణి,పగడాలు వంటి రత్నాలను ఉపయోగించండి. అంతేకాక ఒక సరైన సలహా మేరకు రాగి రేకును పెట్టటం వలన కూడా తలుపు యొక్క లోపాలు తగ్గుతాయి.

తలుపు దక్షిణ ముఖంగా ఉంటె ఇంటి సానుకూల శక్తి క్షేత్రంలోకి పదునైన శక్తిని తీసుకువస్తాయి. ఇక్కడ తలుపు ఉంటె అత్యంత చురుకైన సాంఘిక జీవనానికి అర్ధం అని చెప్పవచ్చు. దాని వలన కొన్ని సార్లు వాదనలు లేదా విబేధాలు రావచ్చు. అప్పుడు మళ్ళీ తలుపు బయట పైన పేర్కొన్న రెండు హనుమంతుని యొక్క టైల్స్ ఫిక్సింగ్ చేయాలి. ఇంకా ప్రధానంగా పిల్లి యొక్క కన్ను మొదలైనవి ఉపయోగించి రక్షణ కల్పిస్తున్నారు. కానీ తలుపు నాలుగో పాదంలో ఉంటే స్వాధీనం కొరకు చాలా బాగుంటుంది.

తలుపు పడమర ముఖంగా ఉండటం తప్పు కాదు. ఇలా ఉండుట వల్ల యువకులు క్రియాశీల శక్తిని & వనరులను ఆస్వాదిస్తారు. అందుకే జపాన్ లో గీషా ఇళ్ళు ఎల్లప్పుడూ పశ్చిమ ముఖంగా ఉంటాయి.

నార్త్ వెస్ట్ ముఖంగా తలుపు ఉండటం తప్పు కాదు. ఇతర వాస్తు నియమాలు మద్దతు ఉంటే ఇది ఆరోగ్య, సంపద మరియు శ్రేయస్సును తీసుకువస్తుంది. ఇక్కడ విషయం ఏమిటంటే తలుపు పడమటి ముఖంగా ఉండుట వల్ల ఇంటి ప్రధాన పురుష సభ్యుడు దీర్ఘకాలం ఇంటి బయటే ఉండవచ్చు. అలాగే తలుపు ఉత్తర ముఖంగా ఉంటె మహిళ కూడా అలాగే ఉండవచ్చు.

సాధారణంగా తలుపులు తూర్పు, ఉత్తర,ఈశాన్య ముఖంగా ఉండటం అనేది మంచిదని చెప్పబడింది. కానీ మళ్ళీ మినహాయింపుల వంటి అనేక ఇతర విషయాలు ఉన్నాయి. పొడిగింపులు,గ్రౌండ్ వాటర్ ట్యాంకులు కింద,ఇంటి ఫెంగ్ షుయ్ (ఫ్లయింగ్ స్టార్స్ చార్ట్) వంటివి యజమానులు యొక్క సంపద మరియు ఆరోగ్యాన్ని నిర్ణయించబడుతుంది.

English summary

Vaastu tips for your home's main entrance

The entrance of the house brings in the main energy. Read on to find out more about the vaastu of the main entrance
Story first published: Wednesday, October 9, 2013, 16:09 [IST]
Desktop Bottom Promotion