Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఉలెన్ దుస్తులు ఉతకడానికి సులభ చిట్కాలు
శీతాకాలంలో వెచ్చని నేస్తాలు ఉలన్ దుస్తులు.. చలి కాలం వచ్చిందంటే చాలు అంతటా ఎముకలు కొరికే చల్లటి వాతావరణం కమ్ముకుంటుంది. రాత్రి, పగలు తేడా లేకుండా శీతల గాలులు వీస్తుంటాయి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు చలి పులి భయానికి ముసుగు వేసుకోవాల్సిందే..! అందుకు ఎప్పటి నుండి వార్డ్ రోబ్ లో సర్దిపెట్టిన ఉలెన్ దుస్తుల కోసం వెదకడం మొదలు పెడతారు, వాటిని బయటకు తీయ్యగానే, వాటిని ధీర్ఘకాలం వాటిని వార్డ్ రోబ్ లో పెట్టడం వల్ల వాటి నుండి ఒక ముగ్గిన వాసన వస్తుంది. వాటిని బయటకు తియ్యగానే మొదట మీరు చేయాల్సింది వాటిని ఎండలో వేయడం. ఇంకా ఉలెన్ దుస్తులను శుభ్రం చేయడానికి అనేక మార్గాలున్నాయి. ధీర్ఘకాలంగో వార్డ్ రోబ్ లో ఉన్న ఉలెన్ దుస్తులను మీరు వెంటనే ధరించడానికి మీకు ఇష్ట లేనప్పుడు వాటిని మీరు వాష్ చేసిన తర్వాత వేసుకోవచ్చు.
శీతాకాలం ఆరంభమైంది. ఇక బయట అడుగుపెట్టాలంటే చలి పులిలా వెంటాడుతుంటుంది. అలాగని పనులు మానుకోలేంకదా. చలి నుంచి తప్పించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కోవిధమైన వస్త్రాలను ఎన్నుకుంటారు. అందులో కుర్రకారయితే తాము వింటర్‌లో ధరించే దుస్తులలో కూడా వెరైటీని కోరుకుంటుంటారు. మార్కెట్‌లోకి వచ్చిన వింటర్ కలెక్షన్‌లను ఫాలో అవుతుంటారు. అయితే ప్రస్తుతం మనం ఎప్పటినుంచో చలికాలంలో ధరించే ఉన్ని దుస్తులపై యువత ఆసక్తి కనబరుస్తోంది. చేతితో నేసిన ఊలు దుస్తులపై మక్కువ పెంచుకుంటున్నారు. దాంతో వాటిల్లోనూ అనేక మోడళ్లు, రకాలు, డిజైన్లు మార్కెట్లో కొలువుతీరాయి. పొడవైన కోటు, క్యాప్స్, స్కర్ట్స్, హ్యాండ్ గ్లౌజెస్, ఊలు మఫ్లర్, జాకెట్స్, స్వెటర్లు ఇలా విభిన్న రకాలలో లభిస్తుంటాయి. ఇవి ధరించడానికి అందంగా ఉన్నా ఉలెన్ దుస్తులు నిర్వహించడం కొంచెం కష్టమైన పని . అందుకు, ఉలెన్ వాషింగ్ టిప్స్ ను కొన్ని మీకోసం అంధిస్తున్నాం. క్రింద ఇచ్చిన చిట్కాలు చాలా సులభమైనవి.
కాబట్టి మీ వార్డ్ రోబ్ లో ఇప్పటికే ఉన్న ఉలెన్ దుస్తులను ధరించడానికి ముందు మీరు వాటిని శుభ్రం చేయడానికి కొన్ని చిట్కాలు....

ఎండ: ముందు చెప్పినట్లుగో మీ వార్డ్ రోబ్ లో ఉన్న ఉలెన్ దుస్తులను బయటకు తీసి, సాధ్యం అయితే రోజంతా ఎండలో వేయండి. ఇక వేళ లేకపోతే, కొన్ని గంటలు వేస్తే సరిపోతుంది. ఇది ఒక ఫర్ ఫెక్ట్ ఉలెన్ కేర్.
వార్మ్ వింటర్: వాటిని ఎండలో ఆరబెట్టిన తర్వాత ఒక బకెట్ లో గోరువెచ్చని నీళ్ళు పోసి, అందులో ఉలెన్ దుస్తులను నానబెట్టాలి. 15నిముషాలు నానబెట్టాలి
డిటర్జెంట్: వేడినీళ్ళలో ఉలెన్ దుస్తులను నానబెట్టిన తర్వాత ఒక గుప్పెడు డిటర్జెంట్ పౌడర్ ను బకెట్లో వేసి, చల్లటి నీటిని అరబకెట్ కు నింపని తర్వాత వాటిని చల్లటి నీటిలో నానబెట్టాలి. మీ చేతులతో మీ ఉలెన్ దుస్తులను డిటర్జెట్లో పాటు రుద్దాలి. రుద్దిన తర్వాత తిరిగా ఆ నీటిలో మరో 5నిముషాలు నాననివ్వాలి.
మెషిన్ : తర్వాత సోప్ వాటర్ లోనుండి ఉలె దుస్తులను తీసి వాషింగ్ మెషిలో వేయాలి. మీ మిషన్ 10నిమిషాలు టైమ్ సెట్ చేసి వాటిని వాష్ చేయాలి.
మరకలు: మీ ఉలెన్ దుస్తులు మరకలు పడిఉన్నట్లైతే, వాటిని రిమూవ్ చేయడానికి ఇదే మంచి సమయం. మరకల మీద, ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి రబ్ చేయాలి. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత మీ ఉలెన్ క్లోత్స్ మీద మరకలను తొలగిస్తుంది. తర్వాత నిమ్మరసం లేదా ఆల్కహాల్ వేసి రుద్ది తర్వాత వాష్ చేసుకోవాలి.
తిరిగా వాష్ చేయాలి: మరకలు తొలగించిన తర్వాత, వాటిని వాషింగ్ మెషిన్ లో వేసి పదినిముషాలు వాష్ చేయాలి. తర్వాత వాటిని ఎండలో వేసి ఎండనివ్వాలి.



Click it and Unblock the Notifications