Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
దోమల నివారణకు 5 నేచురల్ హోం రెమడీస్
అల్పమైన ఒక ప్రాణి గుట్టుచప్పుడు కాకుండా మనల్ని దెబ్బతీసి అనారోగ్యానికి గురి చేసి కొద్ది వారాలపాటు మంచానికి కట్టిపడేస్తుంది. అదే దోమ. దోమలు మనతోపాటు సహజీవనం చేస్తూ రక్తం పీల్చి వ్యాధులకు గురిచేస్తాయి. రక్తాన్ని ఇన్ఫెక్షన్ కు గురిచేస్తున్న దోమలు, దోమకాటుకు గురవడంవల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా మరియు ప్రాణాంతకరమైన ఎల్లో ఫీవర్ తదితర వ్యాధులు సంక్రమించి అనేకమందిని శక్తిహీనులను చేస్తున్నాయి. ఈ ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి , దోమల నివారణోపాయ మందులు వాడటం మంచిది. అయితే ఇవి చాలా వరకూ రసాయనాలతో తయారుచేసినవి . వీటిని ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఊపిరితిత్తులకు మీద దుష్ప్రభాలు చూపెడుతాయి.
అందువల్ల, మన ఇంట్లో దొరికే నేచురల్ దోమ నిరోధకాలను ఉపయోగించాలి. అందుకు ఇక్కడ కొన్ని నేచురల్ మస్కిటో రిప్లెంట్స్ ఉన్నాయి. ఇంట్లో నేచురల్ గా దొరికే ఈ నేచురల్ దోమ నిరోధకాల వల్ల ఎటువంటి సడై ఎఫెక్ట్స్ ఉండవు.
గమనిక: ఈ దోమ నిరోధకాలను కోసం మీరు ఒక ప్లాస్టిక్ బాటిల్ మరియు ఓల్డ్ న్యూస్ పేపర్ ను ఉపయోగించాలి . అందుకోసం బాటిల్ ను సగానికి కట్ చేయాలి. తర్వాత అందులో నేచురల్ మస్కిటో రిపిలింట్(దోమ నిరోధకాలను)ద్రవాలను పోయాలి. తర్వాత దీన్ని తలక్రిందులుగా వంపాలి . తర్వాత ఈ సగభాగం బాటిల్ కు న్యూస్ పేపర్ ను చుట్టాలి తర్వాత ఒక డార్క్ ప్లేస్ లో నిల్వ చేయాలి.

ఇంట్లో తయారుచేసుకొనే నేచురల్ దోమ నిరోధకాలు:
దోమల నివారణకు 5 నేచురల్ హోం రెమడీస్
1. లావెండర్ ఎసెన్సెషియల్ ఆయిల్ చాలా గ్రేట్ గా వాసన వస్తుంది. కాబట్టి దీన్ని ఒక ఎఫెక్టివ్ మస్కిటో రిపిలెంట్ గా ఉపయోగిస్తుంటారు. 5 దోమ నిరోధకాలలో ఇది ఒక ఎఫెక్టివ్ దోమ నిరోధక ఉపాయం. లావెండ్ ఆయిల్ మరియు బ్లీచింగ్ పౌడర్ ద్రవాన్ని రెడీ చేసుకొని. ఈ మిశ్రమాన్ని కట్ చేసుకొన్న బాటిల్లో పోయాలి. పోసిన ఈ బాటిల్ ను ఒక మూల పెట్టాలి. అంతే ఈ వాసనకు దోమలను నివారించవచ్చు.
2. బాటిల్లో అరకప్పు వేడి నీళ్ళు పోసి అందులో పంచదార వేయాలి. ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత, ఈ బాటిల్లో ఈస్ట్ ను జతచేయాలి. ఈ సగం నింపిన బాటిల్ రివర్స్(బాటిల్ మూతి క్రిందికి)లో పెట్టి న్యూస్ పేపర్ చుట్టి లేదా పాత వస్త్రాన్ని చుట్టి, దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో పెట్టాలి.
3. బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు వేపనూనెను వేడినీటిలో మిక్స్ చేసి బాటిల్లో పోయాలి. చల్లారిన తర్వాత అందులో ఈస్ట్ ను జత చేయాలి. తర్వాత న్యూస్ పేపర్ ను చుట్టాలి. దీన్ని దోమలు ఎక్కువగా ఉన్నప్రదేశంలో చుట్టాలి.
4. మరో దోమ నిరోధకం తామర పువ్వులతో తయారుచేసుకోవచ్చు. తామరపువ్వులున్న నీళ్ళు కూడా దోమలను చంపటానికి బాగా సహాయపడుతాయి. ఇది ఒక ఎఫెక్టివ్ నేచురల్ మస్కిటో రిపిలెంట్స్ .
5. అరగ్లాసు నీటిలో కొద్దిగా యూకలిప్టస్ నూనెను వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్ప్రే బాటిల్లో వేసి దోమలున్న ప్రదేశంలో స్ప్రే చేయలి .



Click it and Unblock the Notifications
