Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
దుస్తులపై టీ మరకలను తొలగించడానికి 5ఉత్తమ చిట్కాలు
దుస్తుల మీద పడ్డ మరకలను వదిలించడం కొంచెం కష్టమైన పనే. దుస్తుల మీద ఎటువంట మరకలైనా వెంటనే తొలగిస్తే సులభంగా మరకలు తొలగిపోతాయి. అదే మరకలు ఎండిపోతే మరింత మొండిమరకలుగా మారుతాయి. వాటి మార్క్ అలాగే ఉండటం వల్ల మరకలను తొలగించడం కష్టం అవుతుంది. అటువంటి మరకల్లో టీ మరకలు కూడా ఒకటి. ఈ మరకలను తొలగించడానికి మరింత ఎక్కువ సమయం తీసుకుంటుంది.
దుస్తుల మీద పడ్డ టీ మరకలను తొలగించడానికి కొన్ని హోం రెమడీస్ అద్భుతంగా సహాయడుతాయి. ఏదైనా దుస్తుల మీద పడ్డ వెంటనే ఈ హోం రెమడీస్ అప్లై చేయడం వల్ల ఎఫెక్టివ్ గా మరకలు తొలగిపోతాయి. ఈ హోం రెమడీస్ లో ఉండే యాసిడ్స్ మరకలను ఎఫెక్టివ్ గా తొలగించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. హోం రెమడీస్ మీరు ఉపయోగించనప్పుడు లేదా అవి అందుబాటులో లేనప్పుడు మరకలను వెంటన్ చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల ఇన్షియల్ మార్క్ తొలగిపోతాయి. తర్వాత 3 గంటల లోపు ఈ హోం రెమడీస్ ను ఉపయోగించడం వల్ల మరకలను తేలికపరుస్తాయి.

దుస్తుల మీద పడ్డ టీ మరకలను తొలగించడానికి కొన్ని చిట్కాలు:
1. కాటన్ దుస్తుల మీద పడ్డ టీ మరకలను తొలగించడానికి ఒక సులభమైనటువంటి మార్గం వేడి నీళ్ళు. మరకలు పడ్డ ప్రదేశంలో వెంటనే వేడినీళ్ళను పోయాలి . ఇలా చేయండం వల్ల టీ లోని ఫైబర్ తొలగిపోతుంది. దాంతో మరక తేలిక పడుతుంది.
2. వెనిగర్ గ్రేట్ స్ట్రెయిన్ రిమూవర్ . కొన్ని కప్పుల నీటిలో ఒకటి రెండు స్పూన్ల వెనిగర్ ను మిక్స్ చేసి మరకలు పడ్డ ప్రదేశంలో నేరుగా స్ప్రే చేయాలి . తర్వాత చేత్తో బాగా రబ్ చేసి శుభ్రం చేస్తే టీ మరక తొలగిపోతుంది.
3. కాటన్ ఫ్యాబ్రిక్ మీద పడ్డ టీ మరకలను తొలగించడానికి కొంచెం బేకింగ్ సోడాను చిలకరించి రెండు చేతులతో బాగా రబ్ చేసి కొంత సమయం అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయడం వల్ల టీ మరకలు మాయం అవుతాయి.
4. గుడ్డులోని పచ్చసొనను గిలకొట్టి తర్వాత టీ స్పూన్ తో మరకలు పడ్డ ప్రదేశంలో ఉంచాలి. కొద్దిసేపటి తర్వాత ట్యాప్ క్రింద రన్నింగ్ వాటర్ తో శుభ్రం చేయాలి. కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఈ మరక అలాగే ఉన్నట్లైతే మరో సారి ఇలానే ప్రయత్నించండి.
5. టూత్ పేస్ట్ : టీ మరకలు పడిన వెంటనే తొలగించాలంటే టూత్ పేస్ట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. టీ మరకలు పడిన చోట కొద్దిగా టూత్ పేస్ట్ ను రుద్ది తర్వాత చల్లటి నీటితో కడిగి శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications