Latest Updates
-
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026 -
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
దుస్తులకు గంజి పెట్టడానికి 6 సహజ పద్దతులు
ప్రస్తుత రోజుల్లో చాలా మంది కాటన్ దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో కాటన్ దుస్తుల వాడకం కూడా ఎక్కువే. కాటన్ దుస్తులు స్టిఫ్ గా ఉంటేనే చూడటానికి అందంగా కనబడుతాయి. లేదంటే మెత్తబడి అందవిహీనంగా కనబడుతాయి. దుస్తులకు గంజి పెట్టడానికి ఆర్టిఫిషియల్ గా మార్కెట్లో అనేక రకాల ఉత్పత్తు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఇవి కఠిమనమైన కెమికల్స్ కలిగి ఉండటం వల్ల ఇవి దుస్తులు చిరిగిపోయేలా చేయవచ్చు లేదా దుస్తులను డ్యామేజ్ చేయవచ్చు . అయితే అలా దుస్తుల మీద ఎటువంటి ప్రభావం చూపకుండా దుస్తులు సురక్షితంగా ఉండేలా చేసే కొన్ని పదార్థాలు మనకు మన ఇంట్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో నేచురల్ పదార్థాలతో రెగ్యులర్ గా దుస్తులకు గంజి పెట్టుట వల్ల దుస్తులకు ఎటువంటి హాని జరగదు, చిరగడం లేద కలర్ పోవడం వంటివి జరగవు.
నేచురల్ పద్దతుల్లో దుస్తులకు గంజి పెట్టుట వల్ల మీ దుస్తులు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. మరి ఆ నేచురల్ పదార్థాలేంటి మరియు వాటిని ఎలా ఉపయోగించాలని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?ఈ సింపుల్ ఖర్చులేని పదార్థాలను ఉపయోగించి సింపుల్ చిట్కాలు ఉపయోగించండి...

కార్న్ స్ట్రార్చ్
కార్న్ స్టార్చ్ (మొక్కజొన్న పిండి) ని 15mlతీసుకొని, చల్లటి నీటిలో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ నీటిలో ఒక నిముషం బాగా మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని స్పే బాటిల్లో వేసి ఉపయోగించుకోవచ్చు. లేదా పూర్తింగా బకెట్లో వేసి జాలించవచ్చు.

బంగాళదంపు నీళ్ళు
నేచురల్ పద్దతిలో గంజి తయారుచేయడానికి రెండు మూడు బంగాళదుంపలు తీసుకోవాలి. ఈ బంగాళ దుంపలను నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత ఈ నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. తర్వాతి రోజు ఉదయం నీరు వడగట్టుకొని దుస్తులకు పట్టించవచ్చు.

రైస్ వాటర్(గంజి)
ప్రెజర్ కుక్కర్ లో అన్నం వండకుండా సపరేట్ గా గిన్నెలో వండుకొంటే మంచిది. అన్నం వండటానికి సరిపడా కంటే మరికొన్ని ఎక్కువ నీళ్ళు పోసి అన్నం ఉడికిన తర్వాత గంజి సపరేట్ గా వంపుకోవాలి . తర్వాత గంజి చల్లబడిన తర్వాత అందులో మరికొన్ని నీళ్ళు పోసి తర్వాత దుస్తులను ఆ నీటిలో డిప్ చేయాలి. ఇది ఎక్కువ మంది ఉపయోగించే నేచురల్ పద్దతి.

వెజిటేబుల్ వాటర్
ఒక గిన్నెలో నీళ్ళు పోసి తర్వాత అందులో వెజిటేబుల్స్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఆ నీటిని వేరే పాత్రలోనికి వంపుకొని, చల్లారిన తర్వాత దుస్తులకు అందులో డిప్ చేసి ఎండలో ఆరబెట్టుకోవాలి.

ఆరో రూట్
ఆరోరూట్(ఛామ గడ్డ)గంజి పొందడానికి ఒది ఇక మార్గం. ఛామగడ్డను కెమికల్ ట్రీటెడ్ స్ట్రార్చ్ లలో కూడా ఉపయోగిస్తుంటారు . ఛామగడ్డను మెత్తగా పేస్ట్ చేసి అందులో మగ్గునీళ్ళు పోసి బాగా మరిగించి, వడగట్టి, చల్లారిన తర్వాత దుస్తులకు పట్టించాలి.

గోధుమ
బియ్యం లాగే వీటిని కూడా నేచురల్ గా గంజి పెట్టించవ్చు. గోధుమలు ఉడికించిన నీటిని వేరే గిన్నెలోకి వంపుకొని, చల్లారిన తర్వాత దుస్తులను అందులో డిప్ చేసి ఎండలో వేయడం వల్ల దుస్తులు స్టిఫ్ గా ఉంటాయి.



Click it and Unblock the Notifications