Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫిష్ బౌల్ శుభ్రపరుచుటకు 6సింపుల్ చిట్కాలు
ప్రస్తుత జనరేషన్ లో నిద్ర లేచినప్పటి నుండి ఉరుకులు...పరుగులు..కార్యక్రమాలు...ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడి నుంచి కాస్తయినా ఉపశమనం పొందాలంటే..ఇంట్లో ఏదో ఒకటి ఉండాల్సిందే. మొక్కల పెంపకం, పెట్స్ పెపకం, అక్వేరియం.....ఇంట్లో ఓ అక్వేరియం ఉంచుకోవడం చాలా అవసరం. ఎంతటి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా లేదా రక్తపోటు ఉన్నా అక్వేరియం ఇంట్లో ఉంటే చాలా వరకూ పరిస్థితి మెరుగుపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే అక్వేరియంను పెట్టుకుంటే సరిపోదు, దానికి తగ్గ నిర్వహాణ బాధ్యతలు కూడా చేపట్టాలి. అక్వేరియం అంటానే అదేదో పెద్దగా ఉండనవసరంలే, ఒకటి రెండు చేపలను ఉంచుకొనే ఫిష్ ట్యాంక్ లేదా ఫిష్ బౌల్ కూడా మనం ఇంట్లో పెట్టుకొని, ఆహ్లాదకరమైన వాతావరణంను పొందవచ్చు. ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉన్నప్పుడు అందులో నుండి వాసన రాకుండా కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫిష్ బౌల్ శుభ్రం చేసేప్పుడు, అందులోని చేపలను మరొక బౌల్లోనికి మార్చుకోవాలి. ఫిష్ ట్యాంక్ ను సోప్ వాటర్ తో శుభ్రపరిచినా కూడా, చేపల వాసన అలాగే వస్తుంటే, వంటింట్లోని కొన్ని పదార్థాలను ఉపయోగించి ఫిష్ ట్యాంక్ లోని వాసనను పూర్తిగా నివారించుకోవచ్చు. అలా ఫిష్ ట్యాంక్ లోని నీచు వాసన రాకుండా, క్లీన్ గా ఉండటానికి కొన్ని చిట్కాలు మీకోసం...

వెనిగర్ తో ఫిష్ ట్యాంక్ శుభ్రత
ఫిష్ బౌల్ శుభ్రపరుచుటకు వెనిగర్ ను ఉపయోగించండి. కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా వెనిగర్ వేసి, ఆనీటిలో వెనిగర్ కొద్దిసేపు ఉండేవరకూ అలాగే ఉంచండి. తర్వాత ఆ నీటిని ఉపయోగించి ఫిష్ బౌల్ ను శుభ్రం చేయండి.

బేకింగ్ పౌడర్
ఫిష్ బౌల్ ను శుభ్రం చేయడానికి బేకింగ్ పౌడర్ తో శుభ్రం చేయాలి. బేకింగ్ పౌడర్ ఫిష్ ట్యాంక్ మీద మరకలను తొలగించడంతో పాటు, వాసనను కూడా తొలగిస్తుంది. అయితే బేకింగ్ పౌడర్ ను చాలా తక్కువగా ఉపయోగించాలి.

నిమ్మరసం
ఫిష్ బౌల్ శుభ్రపరచడానికి నిమ్మరసం ఒక ఉత్త వంటగది వస్తువు. కొద్దిగా నిమ్మరసంను ఫిష్ బౌల్లో చిలకరించి, నిమ్మతొక్కతో బాగా రుద్ది పది నుండి పదిహేను నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచినీటితో శుభ్రం చేయాలి. అంతే ఫిష్ ట్యాంక్ లో చెడు వాసన పోయి, తాజాగా ఫ్రెష్ గా లైమ్ వాసన వస్తుంటుంది.

ఉప్పు
ఫిష్ బౌల్ శుభ్రపరుచటకు ఉప్పు అద్భుతంగా సహాయపడుతుంది . అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక గుప్పెడు రాళ్ళఉప్పు తీసుకినొ కొద్దిగా నీళ్ళు పోసి, ఉప్పును వేసి చేత్తో బాగా రుద్ది కొద్ది సమయం అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మరకులు సులభంగా తొలగిపోతాయి.

సోపును ఉపయోగించడం
చేపలు పెట్స్ లాంటివే, కాబట్టి వాటి శుభ్రతకు సోపును ఉపయోగించవచ్చు. మరియు మీ ఫిష్ బౌల్ చూడటానికి అందంగా ఉంటుంది. మెరిస్తూ ఉంటుంది. మరియు ఫిష్ ట్యాంక్ లో ఫౌల్ స్మెల్ ను నివారిస్తుంది

బ్లీచింగ్
బ్లీచ్ ఒక ఉత్తమ వంటింటి వస్తువు, ఒక టేబుల్ స్పూన్ బ్లీచ్ ను నీటితో మిక్స్ చేసి ఫిష్ బౌల్ ను శుభ్రపరుచుకోవాలి.



Click it and Unblock the Notifications