Latest Updates
-
ఇంట్లో దేవతా చిత్రాలు ఎక్కడ ఉంచాలి? శాస్త్రాలు చెప్పే నియమాలు -
ఫెమినిజం అంటే వాటితో పోలిక కాదు.. నెట్టింట్లో చర్చకు దారి తీస్తున్న సునీత కామెంట్స్.. అసలేమన్నారు.! -
అటు ప్రొటీన్, ఇటు టేస్ట్.. పిల్లలు లంచ్ బాక్స్‌లోకి ఇష్టంగా తినేలా పనీర్ ఖీమా రైస్.! -
పిల్లల నుంచి పెద్దల వరకు.. రక్తహీనత పోగొట్టి ఎముకల బలాన్ని పెంచే రాగి బీట్రూట్ జున్ను.! -
టైమ్ తక్కువ, టేస్ట్ ఎక్కువ..లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ పుదీనా పులావ్ చేసేయండిలా -
మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా మీ ప్రియమైన వారికి విషెస్ ఇలా తెలియజేయండి.! -
గుండెకు బ్యాడ్ మార్నింగ్.. ఆ సమయాల్లో ఆహార ఎంపికలతో పెను ముప్పు.! -
జూన్ 26 సాయంత్రం ఈ 5 రాశుల వారికి అదృష్టం.. ధనయోగం, కెరీర్ సక్సెస్ మీ సొంతం! -
ఈరోజు సాధ్య యోగం.. ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
ఒత్తిడికి గురవుతున్నారా.. ఇది మీ జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.?
దుస్తుల మీద పడ్డ ఎల్లో కర్రీ మరకలను తొలగించే సులభ చిట్కాలు
సాధారణంగా దుస్తుల మీద పడ్డ ఎటువంటి మరకలైనా తొలగించాలంటే కొంచెం కష్టమే. ముఖంగా కొన్ని మరకలు వెంటనే కడిగేస్తే తొలగిపోతాయి. కొన్ని మరలకు అంత సులభంగా పోవు. అటువంటి మరలక్లో కర్రీ(కూర)మరకలు తొలగించడం కూడా కొంచెం కష్టంతో కూడిన పనే. ఎందుకంటే మన ఇండియన్ కర్రీలలో దాదాపు అన్ని కర్రీలకు పసుపును చాలా సహజంగా ప్రాధానంగా ఉపయోగిస్తారు. ఈ పసుపు వంటలకు ఫ్లేవర్ రుచిని అంధించడం మాత్రమే కాదు, దుస్తుల మీద పడితే మొండి మరకలుగా ఏర్పడుతాయి.
దుస్తుల మీద పడ్డ కర్రీ వాసనను తొలగించడం చాలా కష్టం మరియు కొన్ని నేచురల్ పదార్థాలు మాత్రమే వీటిని తొలగిస్తాయి. ఈ క్రింది తెలిపిన పదార్థాలను ఉపయోగించి మీరు దుస్తుల మీద పడ్డ పసుపు కలర్ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు.
తెల్లని షర్ట్ మీద ఎల్లో కలర్ కర్రీ మరకలను తొలగించడం కష్టం. కాబట్టి, కొన్ని నేచురల్ పదార్థాలను ఉపయోగించి తెల్లని దుస్తుల మీద పడ్డ మొడిమరకలను తొలగించుకోవచ్చు.

గ్లిజరిన్:
మరకలు పడ్డ దుస్తుల మీద గ్లిజరిన్ ను అప్లై చేయాలి. చేతి వేళ్ళతో మరక మీద బాగా రుద్ద అప్లై చేసి పది పదిహేను నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి.

వెనిగర్:
ఎల్లో కర్రీ మరకలను తొలగించడానికి వైట్ వెనిగర్ ను ఉపయోగించాలి. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక టేబుల్ స్పూన్ లిక్విడ్ డిష్ వాషింగ్ డిటర్జెంట్ ను ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ తో మిక్స్ చేసి రెండు కప్పులు చల్లటి నీటిలో వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఈ నీటితో ఎల్లో మరకమీద వేసి రుద్దాలి. ఇలా మరకపోయే వరకూ రుద్దుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆల్కహాల్:
తెల్లని దుస్తుల మీద పడ్డ ఎల్లో కర్రీ మరకలను తొలగించడానికి ఒక సాప్ట్ స్పాంజ్ ను తీసుకొని దుర్దాలి. ఇలా స్పాంజ్ తో రుద్దడానికి ముందు ఆల్కహాల్ రెండు మూడు చుక్కలు వేసి రుద్దాలి. లేదా స్పాంజ్ మీద ఆల్కహాల్ వేసి రుద్దాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్:
హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కొద్దిగా నీళ్ళలో వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ఆ నీటిలో, ఎల్లో కర్రీ మరకలు పడ్డ తెల్లని దుస్తులను వేసి నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు నానబెట్టి తర్వాత వాష్ చేయాలి.

హాట్ వాటర్ లేదా కోల్డ్ వాటర్:
తెల్లని దుస్తుల మీద పడ్డ ఎల్లో కర్రీ మరకలు తొలగించడానికి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకు మరకలు పడ్డ కాటన్ దుస్తులను వేడి నీళ్ళలో నానబెట్టుట వల్ల మరకలను తేలికపరిచిసాప్ట్ గా చేస్తుంది. చల్లటి నీరు లేదా ఐస్ వాటర్ కూడా మరకలను ఫ్రెష్ గా మార్చుతుంది.

నిమ్మరసం:
కాటన్ దుస్తుల మీద పడ్డ ఎల్లో కర్రీ మరకలను తొలగించడానికి నిమ్మరసం బాగా పనిచేస్తుంది. మెండి మరకల మీద నిమ్మరసం పిండి, ఒక చుక్క వెనిగర్ వేసి బాగా రుద్ది వాష్ చేస్తే శుభ్రంగా తొలగిపోతుంది. ఈ రెండింటి కాంబినేషన్ ఒక నాణ్యమైన నేచురల్ బ్లీజ్ గా పనిచేస్తాయి.
గమనిక: దుస్తుల మీద పడ్డ కర్రీ మరకలు పసుపుగా మారిన మొండి మరకలు మరియు వాసనను తొలగించాలంటే, దుస్తుల మీద కర్రీ పడిన వెంటనే రన్నింగ్ వాటర్ లో ముందుగా కడిగేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో దుస్తులను నానబెట్టుట వల్ల సాప్ట్ గా మార్చుతుంది. మరకలు తొలగించిన తర్వాత నేచురల్ క్లోత్ సాఫ్ట్ నర్స్ను ఉపయోగించాలి .



Click it and Unblock the Notifications