Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
వార్డ్ రోబ్ హ్యాంగర్స్ ను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు...
వార్డ్ రోబ్ లో బట్టలు అందంగా, నీట్ గా కనిపించాలంటే, వాటిని హ్యాంగర్స్ కు పెట్టి వేలాడదీయాల్సిందే. అయితే హ్యాంగర్స్ కొనేటప్పుడు అవసరం దాన్ని వాడాలనుకునే విధానాల ప్రకారం రకరకాల డిజైన్స్ ఎంపిక చేసుకుంటుంటాము. అయితే అటువంటి హ్యాంగర్స్ ఏ మాత్రం వంగినా ...విరిగినా ..
సింపుల్ గా వార్డ్ రోబ్ నుంచి తీసి పక్కన పెట్టేస్తాం. మరి, వాటి వల్ల ఇతర ప్రయోజనాలేమీ లేవా? అవి అలా వేస్ట్ గా వదిలేయాల్సిందేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఆలోచనలకు సమాధానం కావాంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే...
వివిధ రకాల మెటీరియల్స్ తో, భిన్నమైన డిజైన్స్ లో హ్యాంగర్స్ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని వాడినంత కాలం వాడే9సి, ఏ చిన్న డ్యామేజ్ వచ్చినా వెంటనే పక్కన పెట్టేస్తాం. కానీ, మెదడుకు కొంచెం పదును పెడితే వాటిని కూడా ఇంట్లో ఏదో ఒక రకంగా ఉపయోగపడేలా మలుచుకోవచ్చు. ఏవిధంగానో తెలుసుకోవాలనుందా....

1. మీకు సమయం కుదిరినప్పుడల్లా హ్యాండీక్రాఫ్ట్స్ తయారుచేసే అలవాటు ఉందా?అయితే మీ కళాకృతులను అందంగా కనిపించేలా సర్దడానికి హ్యాంగర్స్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు డిజైన్ చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పెయింటింగ్స్,..మొదలైనవి క్లిప్స్ సాయంతో హ్యాంగర్స్ కు వేలాడదీయవచ్చు. అలాగే కావాలనుకుంటే రంగు రంగుల దారాలతో హ్యాంగర్ ని కూడా మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.
2. బాత్రూమ్ లోనూ, వాష్ బేసిన దగ్గర టవల్ వేసుకోవడానికి వీలుగా హ్యాంగర్ ని తిరగేసి వేలాడదీస్తే చక్కగా ఉపయోగపడుతుంది.
3. అలాగే హ్యాంగర్స్ కు రిబ్బన్స్, కళ్లద్దాలు...ఇలా రకరకాల యాక్సెసరీస్ కూడా తగిలించుకోవచ్చు. చూడటానికి అందంగా ఉండటమే కాకుండా తీసుకొని పెట్టుకోవడానికి కూడా చలా సౌకర్యంగా ఉంటుంది.
4. మీకు స్కార్ఫ్స్ ఉపయోగించే అలవాటు ఉందా? మీ వద్ద స్కార్ఫ్స్ ఎక్కువగా ఉన్నాయ? అయితే వాటిని కూడా హ్యాంగర్స్ కి తగిలించుకోవచ్చు.
5. హ్యాంగర్స్ కు చెవి రింగులు, గాజులు, ఇతర యాక్సెసరీలు కూడా తగిలించవచ్చు.
6. అంతే కాకుండా వంట గదిలో మనం ఉపయోగించే గ్లోవ్స్, కత్తులు మొదలైనవన్నీ భద్రపరుచుకోవడానికి హ్యాంగోవర్స్ కు ఒక క్లాత్ తో పర్సులా ఉపయోగించుకోవచ్చు. అదెలా అన్నది మాత్రం మీ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది.
7. ఇంకా మూసుకుపోయిన డ్రెయినేజ్ హోల్స్ తెరుచుకోవడానికి ఇంట్లో క్యాలెండర్స్ తగిలించుకోవడానికి..ఇలా రకరకాలుగా హ్యాంగర్స్ ని ఉపయోగించుకోవచ్చు. అదెలా అన్నది మాత్రం మీ అవసరాల మీద ఆధారపడి ఉంటుంది.
చూశారు కదండీ..బట్టలు తగిలించుకునే హ్యాంగర్స్ తో ఎన్ని ప్రయోజనాలున్నాయో...మరి, మీరు కూడా డ్యామేజ్ అయిన హ్యాంగర్స్ పక్కన పెట్టేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో కాస్త ఆలోచించండి...



Click it and Unblock the Notifications