Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ప్లాస్టిక్ వస్తువులు శుభ్రం చేయడానికి ఉత్తమ చిట్కాలు
ప్లాస్టిక్ వస్తువులను సోపులు, డిటర్జెంట్ పౌడర్లు సరిగా శుభ్రపరచకపోతే, అప్పుడు మీరు కొన్ని వంటగది వస్తువులను ఉపయోగించుకోవచ్చు. ఈ నేచురల్ పదార్థాలు, ప్లాస్టిక్ వస్తువులను శుభ్రపరచడంతో పాటు, మంచి సువాసనను కలిగి ఉంటాయి మరియు ఎటువంటి మరకలుండవు.
ప్లాస్టిక్ వస్తువులను ఎలా శుభ్రం చేసినా పాత వాసనలు అలాగే ఉంటాయి. వాటిని తొలగించడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయాలనుకొన్నప్పుడు ముందుగా చల్లటి నీటితో కడిగేయాలి. తర్వాత ఒక టబ్ నీటిలో 10నిముషాలు నానబెట్టాలి. ఆ సమయంలో పాతవాసనలు తొలగిపోతాయి. తర్వాత బయటకు తీసి ,పొడి బట్టతో తుడవటం వల్ల వాసన తొలగిపోతుంది. ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయడానికి మరికొన్ని సులభ చిట్కాలు క్రింది విధంగా ఉన్నాయి.

న్యూస్ పేపర్: కొత్తప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేసినప్పుడు వాటి నుండి కొత్తగా ప్లాస్టిక్ వాసన వస్తుంటే, న్యూస్ పేపర్ తీసుకొని బాగా ఉండచుట్టి ప్లాస్టివస్తువుల్లో స్టఫ్ చేసి పెట్టాలి. ఇది ప్లాస్టిక్ వాసన తొలగించడానికి బాగా సహాయపడుతుంది. తర్వాత మరుసటి రోజు వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి.
చార్కోల్: ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర వస్తువుల్లో చార్కోల్ (బొగ్గు)ను వేసి ఉంచవచ్చు. చార్కోల్ వేసే ముందు అవి తడిలేకుండా చూసుకోవాలి . తేమ ఉంటే ప్లాస్టిక్ వస్తువుల్లో మరకలు పడుతాయి. తర్వాత మూత పెట్టి ఒక రోజంతా అలాగే ఉంచడం వల్ల లోపల వాసన తొలగిపోతుంది.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడా మరియు కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను ప్లాస్టిక్ వస్తువులకు అప్లై చేసి ఒకటి లేదా రెండు రోజులు అలాగే ఉంచి తర్వాత మంచి నీటితో కడిగితే మొండి మరకలు తొలగిపోతాయి.
నిమ్మరసం: ప్లాస్టిక్ వస్తువులను శుభ్రం చేయడానికి మరో ఉత్తమ మార్గం నిమ్మరసం. నిమ్మతొక్కతో ప్లాస్టిక్ వస్తువులను రుద్ది కడగడం వల్ల ప్లాస్టిక్ వాసన మరియు ఇతర ఆహార పదార్థాల యొక్క వాసనతొలగిపోవడంతో పాటు మరకలు కూడా తొలగిపోతాయి.
కాఫీ: ప్లాస్టిక్ వస్తువులకు ఏదైనా అంటుకొన్నప్పడు కాఫీ గింజలలో ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి తర్వాత నిధానంగా రబ్ చేయాలి ఇలా చేస్తే పాత వాసనలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications
