Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వైట్ షూ(తెల్లబూట్లు)శుభ్రం చేసే సులభ చిట్కాలు
షు(బూట్లు)లను శుభ్రం చేయాలంటే ఎప్పుడు ఒక కష్టమైన పనిగా భావిస్తారు. అందులోనూ షూ తెలుపు లేదా బ్లూ అయితే ఇంకా కష్టం. షూ పై భాగం నుండి క్రింది భాగం వరకూ ప్రతి కార్నర్ లో మురికిగా మారి ఉంటుంది. షు ప్రతి రోజూ ధరిస్తుంటారు కాబట్టి, అవి రోజూ శుభ్రం చేసుకొనే అవసరం ఉంది. షులు ఎంత శుభ్రంగా ఉంటే, పాదాలకు అంత సంరక్షణ కల్పించవచ్చు. అలాగే మురికిగా ఉన్న షూలను ధరించడానికి కూడా ఇష్టం ఉండదు.
తెల్లని షూలు చూడటానికి చాలా అందంగా మరియు క్లాసీగా ఉంటాయి. వైట్ షూలంటే స్త్రీ మరియు పురుషులిద్దరికీ ఇష్టమే . వైట్ షూలు ధరించిన వారు చూడటానికి చాలా స్పోర్టివ్ గా అందంగా కనబడుతారు . వైట్ షూలు, వైట్ జీన్స్ మరియు సాధారణ దుస్తులకు కూడా బాగుంటుంది. అయితే తెలుపు షూలను నిర్వహించడం వాటి అందంగా, క్లీన్ గా ఉంచుకోవడం కొంచెం కష్టమైన పనే. అంత సులభంగా శుభ్రపడవు.
తెల్లగా ఉండే షూల మీద ఏ చిన్న మరక పడ్డా, చాలా బాగా ఎత్తికనబడుతుంటుంది. తెల్లగా ఉన్న షూలను కొన్ని సార్లు వేసుకొన్న తర్వాత తిరిగి వాటిని వేసుకోవాలనిపించదు. అందువల్ల వైట్ షూ క్లీన్ చేయడానికి కొంత బాధాకరమే. అటువంటప్పుడు మీ వైట్ షూను శుభ్రం చేయడానికి ఇక్కడ కొన్ని సింపుల్ క్లీనింగ్ చిట్కాలున్నాయి. అవేంటో ఒక సారి చూడండి...

తడి స్పాంజ్: తెల్లగా ఉండే షూలను శుభ్రం చేయడానికి , వాటిని కొత్తవాటిలా మెరిపించడానికి ఇది ఒక సులభ పద్దతి. మీరు తెల్లని షూలను ధరించినప్పుడల్లా, ఒక తడి స్పాంజ్ తీసుకొని, నీట్ గా శుభ్రంగా ఎటువంటి మురికి మరియు మరకలు లేకుండా తుడవాలి. అలా చేయడం వల్ల మరకలు శాస్వతంగా ఉండకుండా నివారిస్తుంది. ముఖ్యంగా మరకులు తెల్లటి షూలరు పసుపుపచ్చవర్ణంలోకి మార్చేస్తాయి. కాబట్టి, మీరు షూలను తీసిన తర్వాత వాటిని తడి స్పాంజ్ తో తుడిచి పెట్టుకోవాలి. అలాగే షూలను శుభ్రం చేసుకోవడానికి డిటజ్జెంట్ ను ఉపయోగించవచ్చు.
డిటర్జెంట్: మీరు ఇంట్లో తెల్లని షూలను శుభ్రం చేయడానికి ఒక సులభ మార్గం ఇది. అందుకు మీరు చేయాల్సిందల్లా, డిటర్జెంట్ ను నీళ్ళలో వేసి బాగా మిక్స్ చేసి, ఆనీటిలో షూల నానబెట్టి10-15నిముషాలు అలాగే ఉంచాలి. 15నిముషాల తర్వాత మరకలను రుద్ద శుభ్రంగా కడగాలి. సర్ఫ్ నీటిలో షూలను నానబెట్టుట వల్ల మరకలు తేలికపడి సులభంగా తొలగిపోతాయి.
బేకింగ్ సోడా : తెల్లని షూలను బేకింగ్ సోడాతో కూడా శుభ్రం చేసుకోవచ్చు. బేకింగ్ సోడాతో షూలను మాత్రమే వైట్ సాక్సులు మరియు వైట్ దుస్తులను కూడా నేచురల్ బ్లీచ్ గా శుభ్రం చేయవచ్చు. సర్ఫ్ నీటిలో ొకద్దిగా బేకింగ్ సోడా వేసి షూలా కొద్ది సేపు నానబెట్టి తర్వాత మంచి నీటితో కడి శుభ్రం చేసుకోవాలి. కొద్దిగా మరకలున్నట్లైతే డిటర్జెంట్ పైడర్ బేకింగ్ సోడా నీటిలో స్పాంజ్ డిప్ చేసి షూ మీద రుద్ద శుభ్రం చేసుకోవచ్చు. తర్వాత ఎండలో బాగా ఎండబెట్టాలి.
నిమ్మరసం: మీరు పాదాల నిరంతరం చెమటకు గురి అవుతుంటే. తెల్లని షూల శుభ్రం చేయడానికి నిమ్మరసం వాడటం మర్చిపోకండి . తెల్లని షూల మీద పసుపుపచ్చని మొండి మరకలు తొలగించడానికి ఈ సిట్రస్సుపండ్ల యొక్క రసం బాగా సహాయపడుతుంది. మరియు చెమట వాసనను నివారిస్తుంది. అంతే కాదు ఇది ఒక క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేసి, చెమట వాసన పోయేలా చేస్తుంది. మీరు ఎలా శుభ్రం చేసినా కొంత సమయం ఎండలో పెట్టడం మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల చెమట వాసన తొలగిపోయి, బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.



Click it and Unblock the Notifications