Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
ఉప్పుతో ఇంట్లో వస్తువులు తళతళ..మిళమిళ
ఉప్పు లేకుండా ఇంట్లో వంట పూర్తి కాదు, ఇది ఒక ప్రాధమిక వంటగది ఆహార పదార్థం. ప్రతి ఇంట్లోనూ ఇది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఉప్పును వంటలకు మాత్రమే పరితం చేయకుండా, ఇంటి శుభ్రతలో కూడా ఉపయోగించుకోవచ్చు . ఉప్పును ఉపయోగించి మీ ఇంటిని శుభ్రం చేయడానికి కొన్ని మార్గాలున్నాయి. ఉప్పును ఉపయోగించి మీ ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఎటువంటి దుర్వాసనైనా మరియు మాసిన వాసనను నిర్మూలిస్తుంది.
అవును, కచ్ఛితంగా ఉప్పు ఒక పవర్ ఫుల్ క్లీనింగ్ ఏజెంట్. ఉప్పు ఉపయోగించి మీ ఇంటిని శుభ్రం చేసి మరింత క్లీన్ గా ఉంచవచ్చు . ఉప్పును ఉపయోగించి, ఇంటిని శుభ్రం చేయడానికి ఇక్కడ కొన్నిచిట్కాలున్నాయి. ఇంటి శుభ్రపరచడానికి మాత్రమే కాదు, పచ్చికూరలను శుభ్రపరచడంలో కూడా ఉప్పు ను వాడవచ్చు. కూరగాయలను సాల్ట్ వాటర్ లో వేసి కొంత సమయం నానబెట్టి, తర్వాత శుభ్రం చేసుకోవచ్చు.
ఉప్పును ఉపయోగించి మీ ఇంటిని శుభ్రపరచడానికి ఇక్కడ కొన్ని సింపుల్ చిట్కాలున్నాయి. వీటిని పరిశీలించి, మీఇంటిని క్లీన్ గా అందంగా ఉంచుకోండి...

మరకపడ్డ గ్లాసులను శుభ్రపరుచుటకు సాల్ట్:
గ్లాసులను శుభ్రపరచడానికి ఉప్పు నీటిలో గ్లాసులను 10నిముషాల నానబెట్టి, తర్వాత నిమ్మరసం కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రపరచడం వల్ల మీ గ్లాసులు శుభ్రపడటంతో పాటు, మంచి షైనింగ్ తో ఉంటాయి మరియు ఎటువంటి వాసనైనా తొలగిస్తుంది.

ఐరన్ బాక్స్ క్లీన్ చేయడానికి ఉప్పు:
కొన్ని సందర్బాల్లో మీ ఇంట్లో తరుచూ ఉపయోగించే ఐరన్ బాక్స్ త్రుప్పు పడుతుంటుంది. కాబట్టి, చాలా సులభంగా మరియు తేలికగా త్రుప్పును తొలగించడానికి సాల్ట్ వాటర్ అద్భుతంగా సహాయపడుతాయి. ఒక సారితో తొలగిపోకంటే తిరిగి ప్రయత్నించండి.

సిల్వర్ వస్తువులు శుభ్రపరచడానికి :
మీ వెండి వస్తువలు మంచి షైనింగ్ తో మెరవాలంటే, ఉప్పును ఉపయోగించండి. మీ సిల్వర్ వస్తువులను ఉప్పునీటిలో వేసి లేదా ఉప్పుతో రుద్ది నెలకొకసారి శుభ్రం చేస్తుండాలి. ఇది సిల్వర్ వస్తువులకు మంచి షైనింగ్ ను అంధిస్తుంది. మరియు మీరు సిల్వర్ ఆభరణాలను సాల్ట్ వాటర్లో 15నిముషాలు నానబెట్టుకోవాలి. తర్వత మంచి నీటితో శుభ్రంచేసుకోవాలి.

వైన్ మరకలను తొలగించడానికి:
వైన్ మరకలను తొలగించడం చాలా కష్టమైన పని. కానీ, ఈ పనిని చాలా సులభంగా చేయడానికి ఉప్పు బాగా సహాయపడుతుంది. వైన్ మరకలను తొలగిస్తుంది. అంతే కాదు మరకలు పడ్డ దుస్తులను కొత్తవాటిలా మెరిపిస్తుంది. వైన్ పడిన దుస్తుల మీద కొద్దిగా ఉప్పును రుద్ది, పది నిముషాలు అలాగే వదిలేయాలి తర్వాత కొద్దిగా డిటర్జెంట్ తో కార్పెట్ ను శుభ్రం చేయాలి.

ఓవెన్ శుభ్రం చేయుటకు ఉప్పు :
ఓవెన్ శుభ్రపరుచుటకు ఒక ఉత్తమ మార్గం రెండు చెంచాలా ఉప్పులో కొద్దిగా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి, అందులో కాటన్ వస్త్రాన్ని డిప్ చేసి ఓవెన్ ను శుభ్రం చేయాలి. ఓవెన్ లోపలి జిడ్డు మొత్తం తొలగిపోవడాన్ని మీరు గమనించవచ్చు.

జీన్స్ ప్యాంట్లు శుభ్రపరచడానికి:
అవును, ఇప్పుడు జీన్స్ ప్యాంట్లను శుభ్రం చేయడానికి ఉప్ప బాగా సహాయపడుతుంది. బాగా మురికి పడ్డ జీన్స్ ను వాషింగ్ మిషన్ లో వేసి, డిటర్జెంట్ పౌడర్ తో పాటు ఒక కప్పు రాళ్ళ ఉప్పును కూడా వేసి పది నిముషాలు నానేలా టైమ్ సెట్ చేసి, ఆతర్వాత శుభ్రం చేయాలి. మంచి నీటిలో జాల్సాలి . ఇది మొండి మరకలను తొలగించడానికి సహాయపడుతుంది.

కాఫీ పాట్స్ ను శుభ్రపరుచుటకు:
కాఫీ పాట్ ను శుభ్రపరుచుటకు ఉప్పు బాగా సహాయపడుతుంది. కాఫీ పాట్ కాలీ అయినప్పుడు వేడినీళ్ళలో మూడు చెంచాలా ఉప్పు వేసి అందులో నానబెట్టుకోవాలి 5నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications