Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
కళ్ళ అద్దాలను క్లీన్ చేసుకోవడమెలా?
ప్రస్తుత కాలంలో పెద్దల నుండి చిన్న పిల్లల వరకూ స్పెక్టికల్స్ (అద్దాలను)ఉపయోగిస్తున్నారు. అయితే రెగ్యులర్ గా వాడే అద్దాలను ఎలా క్లీన్ గా ఉంచుకోవాలని చాలా మందికి తెలియక ఎలా పడితే అలా రుద్దేస్తుంటారు. రెగ్యులర్ గా వాడే అద్దాల మీద మురికి, మరకలు, గీతలు వల్ల మీ ఐ విజన్ (కంటిచూపు)బ్లర్ గా కనబడేలా చేస్తుంది.
అందువల్ల మీరు రెగ్యులర్ గా ఉపయోగించే కంటి అద్దాలను ఎప్పుడు కొత్తవాటిలో మెరిపిస్తుండాలంటే వాటి కోసం ఒక మంచి కేర్ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే కంటి చూపు మీద ప్రభావం చూపడంతో పాటు కంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మరి ఈ ఆర్టికల్ లో మనం కంటి అద్దాలను శుభ్రం చేయడానికి సహాయపడే చిట్కాల గురించి తెలుసుకుందాం...

మెత్తటి కాటన్ వస్త్రంతో తుడవాలి: కంటి అద్దాలను రెగ్యులర్ గా శుభ్రంగా ఉంచుకోవాలంటే,వాటి మీద దుమ్ము పడకుండా సాప్ట్ గా ఉండే మస్లిన్ క్లాత్ తో శుభ్రంగా తుడవాలి. గ్లాస్ లను తుడవడానికి రఫ్ గా ఉండే క్లాత్ లను ఎప్పటీకి ఎంచుకోకూడదు. గ్లాస్ శుభ్రం చేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.
గోరువెచ్చని నీళ్ళ మరియు సోపు: ఒక బౌల్లోనికి ఫుల్ గా గోరువెచ్చని నీటిని తీసుకొని, అందులో నాణ్యమైన సోపును వేసి బాగా మిక్స్ చేసి, ఇప్పుడు అందులో అద్దాలను డిప్ చేయాలి. నాణ్యమైన సోపు మురికిని వదలగొడుతుంది. గోరువెచ్చని నీళ్ళు, సోపు రెండింటి మిశ్రమం అద్దాలు మంచి షైనింగ్ తో ఉండేదుకు సహాయపడుతుంది. మీ అద్దాలను క్లీన్ గా క్లియర్ గా ఉంచుకోవాలంటే వారానికొకసారి ఇలా చేయడం మంచిది.
తడి వస్త్రంతో: మీ కంటి అద్దాల మీద ఎక్కువ డస్ట్ చేరి ఉన్నట్లైతే, మీరు ఖచ్చితంగా తడి వస్త్రంను ఉపయోగించాలి. నీటిలో ముంచిన బట్టతో అద్దాల యొక్క లోపలివైపు మరియు అవతలి వైపు కూడా క్లీన్ గా తుడవాలి. శుభ్రం చేసిన తర్వాత ఒక సారి వేసుకొని చూసి, మరకలు, డస్ట్ ఉంటే తిరిగి పొడి వస్త్రంతో తుడవాలి. తుడిచేటప్పుడు అద్దాల మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ లేకుండా చూసుకోవాలి.
నీరుదారాళంగా వచ్చే ట్యాప్ క్రింది శుభ్రం చేయడం: ఎక్కువ మురికపట్టినట్లైతే, నీరు ఫోర్సుగా వచ్చే టాప్ క్రింద పెట్టి కడగం వల్ల, మురికి నీటిలో కొట్టుకుపోతుంది. నీటితో శుభ్రం చేసిన తర్వాత ఒక మెత్తటి కాటన్ వస్త్రంతో శుభ్రం చేయాలి.
గ్లాస్ క్లెన్సర్ సొల్యూషన్ వాడాలి: గ్లాస్ శుభ్రం చేయడానికి కొన్ని రకాల క్లెన్సర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి అద్దాలను శుభ్రం చేసి మంచి షైనింగ్ పొందేలా చేయాలి. ఈ ద్రవాల్లో మురికిని వదిలించే లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ ద్రవాలు కళ్ళ అద్దాలు షాపులో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి, అద్దాలు శుభ్రం చేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.



Click it and Unblock the Notifications
