Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
బంగారు ఆభరణాలు ఎప్పటికీ వన్నెతగ్గకుండాలంటే
ఆభరణాలను అలంకరించుకోవడంలో ఉన్నంత శ్రద్ధ వాటిని శుభ్రంగా ఉంచడంలో చాలామందికి ఉండదు. అందుకే ఆభరణాలు త్వరగా మెరుపు కోల్పోయినట్టుగా కనపడతాయి. బంగారు ఆభరణాలను శుభ్రపరచడానికి మేలైన చిట్కాలు...
ఆభరణాలను దాదాపుగా ఇంట్లోనే శుభ్రపరుచుకోవడం శ్రేయస్కరం. ఖర్చు తక్కువ అవుతుంది. బయట శుభ్రపరచడానికి ఇచ్చినప్పుడు తలెత్తే మోసాలనూ అరికట్టవచ్చు.

వేటికవి విడిగా
విభిన్నరకాల ఆభరణాలు ఉంటాయి. వెండి, బంగారు, ప్లాటినమ్, పూసలు, రాళ్లు.. ఇలా ఆభరణాలను వేటికవి విడివిడిగా ఉంచాలి. లిక్విడ్ సోప్ డ్రాప్ట్స్ (మార్కెట్లో లభిస్తాయి) వీటిని ఆభరణాల మీద వేసి మృదువుగా రుద్ది, కడిగి, మెత్తని నూలు వస్తంతో తుడవాలి. ఇంకా దుమ్ము, జిడ్డు ఉన్నాయి.. పోవడం లేదు అనుకుంటే క్లబ్ సోడాను ఉపయోగించాలి. బంగారు ఆభరణాల జిడ్డు వదలాలంటే 15 నిమిషాల పాటు సబ్బు నీటిలో ఉంచి, తర్వాత శుభ్రపరచాలి.
మృదువైన టూత్ బ్రష్
ఆభరణాల మురికిని తీసివేయడానికి బ్రష్‌ను వాడుతుంటారు. ఇందుకు మృదువైన బ్రష్‌ను ఉపయోగించాలి. టూత్‌బ్రష్ కొనుగోలు చేసే ముందు లేబుల్‌పై ‘సాఫ్ట్ బ్రిస్టల్స్'అని ఉన్నది తీసుకోవాలి. బ్రష్‌తో ఆభరణాలను శుభ్రం చేయడానికి ముందు దానిని 10 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఉపయోగించాలి. దీని వల్ల బ్రష్ కుచ్చు మృదువుగా తయారవుతుంది. ఫలితంగా ఆభరణాలకు హాని కలగదు. మురికి కూడా వదులుతుంది. ఐబ్రో బ్రష్, హెయిర్ డై బ్రష్‌లను ఆభరణాల శుభ్రతకు ఉపయోగించకూడదు.
అమ్మోనియా ద్రావణం
అమ్మోనియా ద్రావణానికి ఆరు భాగాల నీళ్లు కలపాలి. ఆభరణాలను సబ్బు నీటితో శుభ్రపరిచిన తర్వాత వాటిని అమ్మోనియా నీటిలో ముంచి, తడి లేకుండా తుడవాలి. ఇలా చేస్తే ఆభరణాలకు మెరుపు వస్తుంది. అయితే ధరించిన ప్రతీసారి అమ్మోనియాతో శుభ్రపరచకూడదు. ఒక్కోసారి అమ్మోనియా కారణంగా ఆభరణం రంగు మారే అవకాశం ఉంటుంది.
వెచ్చని నీరు
ఆభరణాన్ని బ్రష్‌తో రుద్దుతున్నప్పుడు గోరువెచ్చని నీటిని పోస్తూ రబ్ చేస్తూ ఉంటే మురికి వదులుతుంది. ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం ఉండదు. అయితే, ఆభరణాలను అన్నింటినీ కలిపి కాకుండా విడి విడిగా శుభ్రపరచాలి.
రత్నాలను నీటిలో ఉంచరాదు
రత్నాలు పొదిగి ఉండే ఆభరణాలను ఎక్కువసేపు నీళ్లలో ఉంచకూడదు. సబ్బు నీటిలో ముంచి, వెంటనే తీయాలి. గోరువెచ్చని నీటిని పోస్తూ మృదువుగా రుద్దాలి. తర్వాత మెత్తని వస్త్రంతో తడి లేకుండా తుడవాలి. ఆభరణం వెనకవైపు కూడా తడి లేకుండా తుడిచి, భద్రపరచాలి.
టూత్‌పేస్ట్ ఉపయోగం
టూత్బ్రష్కి కొద్దిగా పేస్ట్ అద్ది, దాంతో బంగారు ఆభరణాలను శుభ్రపరచాలి. గోరువెచ్చని నీళ్లు పోస్తూ రుద్దుతూ కడిగితే, చక్కగా శుభ్రపడతాయి.
మరిగితే మెరుపు
మైనం, గ్రీజ్ వంటివి ఆభరణాలకు అంటితే త్వరగా పోవు. ఇలాంటప్పుడు మరుగుతున్న నీటిలో ఆభరణాలను వేసి, తర్వాత సబ్బునీటితో శుభ్రపరచాలి.



Click it and Unblock the Notifications
