Latest Updates
-
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే?
ఇంట్లో క్రిములు కీటకాలు లేకుండా చేయడానికి ఉత్తమ చిట్కాలుస
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం తగిన జాగ్రత్తలు తీసుకోనట్లైతే, ఇంట్లో క్రిములు మరియు కీటకాలు ఎక్కువ అవుతాయి. అలా సూక్ష్మ క్రిములు, కీటకాలు లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా క్లీన్ గా నీట్ గా ఉంచుకోవడం వల్ల మన ఇంటిల్లిపాది యొక్క ఆయురారోగ్యాలను కాపాడుకోవచ్చు.
ఎటువంటి క్రిములుకానీ, కీటకాలు కానీ మన ఇంట్లో చేరకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు గుర్తుపుట్టుకోవాలి. అందుకోసం కొన్ని పద్దతులను ఈ క్రింది విధంగా అందిస్తున్నాము...

ఇంట్లో కానీ, మరియు బాత్రూమ్ లేదా బెడ్ రూమ్ కానీ మురికి పడ్డ దుస్తులను ఎక్కువ రోజులు అలాగే వదిలేయకండి.
వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసేయాలి. లేదా ఒకటి -రెండు రోజులకైనా శుభ్రం చేయాలి. అలాగే మీరు ఉపయోగించే వాషింగ్ మిషన్ కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు మీరు మందుగా చేయాల్సిందే కొంత బ్లీచ్ ను మిషన్ లో వేసి కొన్ని నిముషాలు రన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మిషన్ లో చేరిన బ్యాక్టీరియా మరియు వైరస్ వంటివి నాశనం చేయబడుతుంది.
మరో సమస్యాత్మకమైన ప్రదేశం మురికి పడ్డ టవల్స్ - వారం పదిహేను రోజులకు వరకూ వాడిన టవల్స్ నే వాడకుండా రెండు మూడు రోజులకు ఒకసారి వాటి మార్చుతుండాలి. టవల్స్ ను ఎప్పుడు గోరువెచ్చని నీటిలో శుభ్రం చేయాలి. ఇలా వేడి నీటిలో శుభ్రం చేయడం వల్ల సూక్ష్మ క్రిములు తొలగిపోతాయి.
అలాగే ఇంట్లో ప్రత్యేకంగా ఒక్కోక్కరి కోసం ఒక్కో టవల్ ను ఉంచండి. అలాగే మీ ఇంట్లో ఉండే లెనిన్ కవర్స్ మరియు బెడ్ కవర్స్ ను ప్రతి వీకెండ్ లో మార్చుతుండాలి. ఇక బెడ్ మీద ఎటువంటి తినుబండారాలను విడిచిపెట్టకండి . వీటి వల్ల చీమలు మరియు ఫంగస్ లేదా బూజవంటిది చేరుతుంది. అది చర్మ ఇన్ఫెక్షన్ కు లేదా అలర్జీలకు దారితీస్తుంది.
ప్లాస్టిక్ మరియు గ్లాస్ తో ఉన్న వస్తువులను శుభ్రం చేయడానికి శానీటైజర్ ను ఉపయోగించండి. అలాగే మీరు వినియోగించే కప్ బోర్డ్స్ మరియు డోర్ నాబ్స్ మరియు హ్యాండిల్స్ ను అప్పుడప్పుడు శుభ్రం చేయడం మర్చిపోకండి.
ఇక మీ కంప్యూటర్ కీబోర్డ్ ను చిన్న వ్యాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయడం మర్చిపోకండి. అందులో మీకు లెక్కపెట్టలేనన్ని స్మూక్ష్మ క్రిములు దాగి ఉంటాయి.
మీ వంటగదిలోని షింక్ కూడా సూక్ష్మ క్రిములకు ఒక నివాస స్థలం కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు షింక్ ను శుభ్రం చేయడం మర్చిపోకండి. అలాగే మీ కిచెన్ ఫ్లాట్ ఫార్మ్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల ఆయురారోగ్యాలను పొందుతారు.
అలాగే బాత్రూమ్ ను ఉపయోగించిన ప్రతి సారి శుభ్రం చేసేయాలి. షింక్ తర్వాత సూక్ష్మ క్రిములకు ఆలవాలమైన ప్రదేశం బాత్రూమ్ . కాబట్టి, వీటిని శుభ్రం చేయడం ఎంతైనా అవసరం ఉంది.



Click it and Unblock the Notifications
