Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గోడల మీద పడ్డ మరకలను తొలగించడానికి నేచురల్ మార్గాలు
ఎంత అందంగా ఉన్న ఇల్లైనా సరే, మొదట ఎఫెక్ట్ కనిపించేది, ఇంటి గోడల మీదే. ముఖ్యంగా చిన్న పిల్లలున్న ఇంట్లో మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి క్రియేటివిటితో గోడల మీద గీస్తూ, పెయింట్ చేసేస్తుంటారు . పెయింటెడ్ వాల్స్ మీద ఇటువంటి పెన్, పెన్సిల్ మరకలను తొలగించడం కష్టం అవుతుంది . గోడల మీద పడ్డ మరకలను తొలగించడానికి ఎక్కువగా మాన్యువల్ వర్క్ ఎక్కువగానే ఉంటుంది.
పెయింట్ వాల్స్ మీద మరకలను తొలగించడం కష్టం మరియు మరకలతో పాటు కొన్ని సందర్భాల్లో ఒరిజినల్ పెయింట్ కూడా తొలగిపోతుంది. మీ ఇంటిని శుభ్రం చేయడానికి నేచురల్ పదార్థాలను ఎంపిక చేసుకోవడం చాలా సులభం. ఇంటికి సంబంధించినంత వరకూ సాధ్యమైనంత వరకూ నేచురల్ పదార్థాలను ఉపయోగించేడమే ఉత్తమం. గోడలను శుభ్రం చేసేప్పుడు గుర్తుంచుకోవల్సిన మరో విషయం. గోడల మీద ఎక్కువ ప్రెజర్ పెట్టి రుద్దకూడదు.
నిమ్మ, వెనిగర్ మరియు బేకింగ్ పౌడర్ వంటివి మీ వంటగదిలో ఖచ్చితంగా ఉండేటటువంటి క్లీనింగ్ ఏజెంట్స్. ఇంట్లో వస్తువు క్లిన్ గా మరియు చూడటానికి అందంగా కనబడాలంటే ఇటువంటి నేచురల్ క్లీనింగ్ వస్తువులు ఇంట్లో ఉంటడం ఎంతైనా అవసరం. ఈ మూడు నేచురల్ క్లీనింగ్ వస్తువులు ప్లోర్ మీద, దుస్తుల మీద పడ్డ మరకలను తొలగించడం మాత్రమే కాదు, గోడల మీద పడ్డ మరకలను కూడా సులభంగా తొలగిస్తుంది. మరి గోడల మీద ఎలా మరకలను తొలగిస్తుందో చూద్దాం...

వెనిగర్
వాల్ పెయింట్ మీద పడ్డ మరకలను తొలగించడానికి వెనిగర్ గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు, గోడల మీద పడ్డ మరకలతో పాటు, వాసనను కూడా తొలగించడానికి ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

ఆల్కహాల్
ఆల్కహాల్ కూడా మరో నేచురల్ ఎఫెక్టివ్ పదార్థం. కొద్దిగా ఆల్కహాల్ ను కాటన్ వస్త్రం మీద వేసి మరకలున్న వాల్ పెయింట్ మీద సున్నితంగా తుడబాలి.సర్కులర్ మోషన్ లో తుడవాలి.అవసరం అయితే మరో సారి కూడా ప్రయత్నించవచ్చు.

మరో ప్రభావంతమైన పదార్థం పౌడర్
పౌడర్ ఉపయోగించి గోడల మీద మరకలను ఎలా తొలగించవచ్చు అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. గోడల మీద పడ్డ మరకల(ఆయిల్) మీద పౌడర్ ను స్ప్రే చేయడం వల్ల మరకలు చాలా త్వరగా సులభంగా తొలగిపోతాయి.అయితే, మరక పడ్డ వెంటనే ఈ పనిచేయాలి.

బేకింగ్ పౌడర్
బేకింగ్ పౌడర్ ను నీటితో మిక్స్ చేసి, పేస్ట్ లా చేసి, ఈ పేస్ట్ ను పెయిట్ వాల్స్ మీద పడ్డ మరకల మీద అప్లై చేయాలి. 5నిముషాల తర్వాత పొడి బట్టతో తుడివాలి. మరకలు పోయే వరకూ మరో సారి కూడా ప్రయత్నించవచ్చు.

సిట్రస్ లెమన్
పెయింట్ వాల్స్ ప్రకాశవంతంగా మరియు మరకలు లేకుండా కనిపించాలంటే, సిట్రస్ లెమన్ ను ఉపయోగించవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా, ఒక నిమ్మకాయ రసాన్ని పిండి, అందులో బేకింగ్ పౌడర్ వేసి, ఈ రెండింటి మిశ్రమంతో పేస్ట్ లా తయారుచేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ ను మరకలున్నగోడమీద అప్లై చేయాలి. అప్లై చేసిన ఒక గంట తర్వాత సాఫ్ట్ క్లాత్ మరియు స్పాంజ్ తో తుడిచి శుభ్రం చేయాలి.

టూత్ పేస్ట్
పేస్ట్ తో దంతాలు ఎలా శుభ్రం అయి, తెల్లగా మంచి షైనింగ్ తో ఉంటాయో అదే విధంగా, పాత టూత్ బ్రష్ కు టూత్ పేస్ట్ వేసి మరకలున్న చోట్ రుద్ది కొద్దిసేపు అలాగే వదిలేసి, తర్వాత సాఫ్ట్ క్లాత్ లేదా బ్రష్ తో తుడివాలి.



Click it and Unblock the Notifications