Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కీబోర్డ్స్ , మొబైల్స్, రిమోట్స్ శుభ్రం చేసే ఇయర్ బడ్స్
సాధారణంగా ఇంట్లో వస్తువులన్నీ శుభ్రం చేయడానికి వివిధ రకాల వస్తువలను, క్లీనింగ్ ఏజెంట్స్ ను ఉపయోగిస్తుంటారు. ఇంట్లో కొన్ని సున్నితమైన, విలువైన వస్తువులను శుభ్రం చేయడానికి కొన్ని క్లీనింగ్ టూల్స్ అవసరం అవుతాయి . కొన్ని సార్లు, మీరు అసాధారణ ప్రదేశాల్లో కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని మూలల్లో, కార్నర్స్ లో శుభ్రం చేయడం కష్టంగా అనిపిస్తుంది. ఇయర్ బడ్స్ ను ఉపయోగించి అటువంటి ప్రదేశాలు శుభ్రం చేస్తుంటారు .
ఇంట్లో కార్నర్స్ మరియు మూలల్లో, న్యారో ప్లేస్ ల్లో శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్ చాలా సౌకర్యవంతంగా చేస్తాయి. సాధారణంగా ఇయర్ బడ్స్ ను ఉపయోగించి చెవులను శుభ్రం చేస్తుంటారు. అయితే ఇరుకైన ప్రదేశాలు మరియు మూలల్లో ఇయర్ బడ్స్ ను ఉపయోగించి శుభ్రం చేయవచ్చు.
కొన్ని కష్టమైన ప్రదేశాల్లో ఇయర్ బడ్స్ ను ఉపయోగించి శుభ్రం చేయడానికి చిట్కాలు

1. కంప్యూటర్ కీబోర్డ్స్: కంప్యూటర్ కీబోర్డ్స్ లో దుమ్ము, ధూళి చాలా సులభంగా చేరుతుంది. ఈ దుమ్ము, ధూళిని శుభ్రం చేయడం కొంచెం కష్టం లవుతుంది. ఎప్పుడూ డస్టర్ తో శుభ్రం చేయడానికి వీలు పడదు. అటువంటి కష్టతరమైన ప్రదేశాల్లో శుభ్రం చేయడానికి ఇయర్ బడ్స్ బాగా సహాయపడుతాయి.
2. టేబుల్ కార్నర్: కొన్ని సందర్భాల్లో మీ ఇంట్లో టేబుల్ గ్లాస్ తో ఫిట్ చేయబడి ఉంటుంది. ఆ ప్రదేశంలో దుమ్మ, ధూళి చేరడం వల్ల శుభ్రం చేయడానికి కష్టం అవతుంది అటువంటి మూల్లల్లో దుమ్ము, ధూళిని తొలగించడానికి ఇయర్ బడ్స్ ను ఉపయోగించండి . మీరు ఇయర్ బడ్స్ ను సోప్ వారట్ లో వేసి, తర్వాత మురిబడ్డ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి.
3. రిమోట్ కంట్రోల్: కీబోర్డ్ లాగే రిమోట్ కంట్రోల్ కూడా శుభ్రం చేయడం కష్టమే. కీస్ మద్య చేరిన దుమ్ము, ధూలి శుభ్రం చేయడానికి, ఇయర్ బడ్స్ చాలా సులభంగా సహాయపడుతాయి. ఇయర్ బడ్స్ ను వెనిగర్ లో డిప్ చేసి మరింత ఉత్తమంగా శుభ్రం చేయవచ్చు.
4. విండోచానెల్ స్లైడ్స్ లో : ప్రస్తుత రోజుల్లో స్లైడింగ్ విండోలన్ ఫిట్ చేసుకొని ఉంటారు. ఇటువంటి ప్రదేశంలో, క్లాత్ తో శుభ్రం చేసిన తర్వాత ఇయర్ బడ్స్ ను ఉపయోగించి శుభ్రం చేయవచ్చు.
5. సోఫా కార్నర్స్ : మీ ఇంట్లో లెదర్ సోఫా, ఉన్నట్లైతే, కార్నర్స్ లో దుమ్ము, ధూళి చేరి ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. కాబట్టి, ఇయర్ బడ్స్ ను ఉపయోగించి సోఫా కార్నర్ ప్రదేశాలను కూడా శుభ్రం చేయండి.



Click it and Unblock the Notifications