Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
దుస్తులపై నూనె మరకలు తొలగించడానికి: చిట్కాలు
కొన్ని సందర్భాల్లో వంటగదిలో పనిచేసే ఆడవారి దుస్తులకు, అలాగే వాహనాలు నడిపే స్త్రీ, పురుషలు దుస్తులకు కొన్ని సందర్భాల్లో గ్రీజ్, ఆయిల్ మరకలు అవుతుంటాయి ?అయితే ఈ గ్రీజ్, ఆయిల్ మరకలను నివారించడం అంత సులభం కాదు అని చెబుతుంటారు. అందువల్ల, ఒక సారి దుస్తులు గ్రీజ్ మరకలు అంటుకొన్నప్పుడు, వాటిని పారేయడం లేదా ఇంట్లో వస్తువులు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తుంటారు.
అయితే ఆ దుస్తులు పాతవైతే పర్వాలేదు కానీ కొంత మంది కొత్త బట్టలు మీద పడేతే చాలా బాధపడుతుంటారు. మరి కొత్తవైనా పాతవైనా సరే ఈ గ్రీజ్, నూనె మరకలు పడి తడి ఆరిపోయినప్పుడు వాటిని తొలగించడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి, గ్రీజ్ లేదా, నూనె మరకలు అయిన వెంటనే వాటిని శుభ్రం చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అలా గ్రీజ్ మరకలను తొలగించడానికి కొన్ని చిట్కాలున్నాయి..అవేంటో ఒక సారి చూద్దాం...

1. టాల్కం పౌడర్: దుస్తుల మీద గ్రీజ్ మరకల మీద నీళ్ళు పోసి రుద్దడం వల్ల అది దుస్తుల యొక్క కలర్ పోవడం లేదా దుస్తుల మీద మరింత విస్తరించడం జరగుతుంది. కాబట్టి, నీటికి బదులు డ్రైపదార్థాలు అంటే టాల్కం పౌడర్ లేదా బేబీ పౌడర్ వంటివి వేసి గ్రీజ్ మరకలను తొలగించాలి. దుస్తుల మీద పౌడర్ ను వేసి పఫ్ తో రుద్దాలి. దాంతో గ్రీజ్ మరకు పూర్తిగా తొలగిపోతాయి.
2. ఉప్పు: గ్రీజ్ మరకలను తొలగించడానికి, ఫ్యాబ్రిక్ పోకుండా ఉండాలంటే ఉప్పు బెస్ట్. ఒక బాగం ఉప్పును, 4బాగాల ఆల్కహాల్ లో వేసి, మిక్స్ చేసిన గ్రీజ్ మరకల మీద వేసి రుద్ది శుభ్రం చేయాలి.
3. బేకింగ్ సోడా: దుస్తుల మీద మొండిమరకలను తొలగించడానికి ఎక్కువగా బేకింగ్ సోడాను ఉపయోగిస్తుంటారు. బేకింగ్ సోడా గ్రీజ్ మరకలను కూడా తొలగిస్తుంది. బేకింగ్ సోడాను మరకలున్న ప్రదేశంలో చిలకరించి తర్వాత 15 నుండి 20అలాగే ఉంచి తర్వాత రుద్ది శుభ్రం చేయాలి.
4. వెనిగర్: నిమ్మరసం మరియు వెనిగర్ దుస్తులు శుభ్రం చేయడానికి ఒక ఉత్తమ వస్తువు. అలాగే గ్రీన్ మరకలు తొలగించడంలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. గ్రీన్ మరకలను, మొండిమరకలను తొలగించడంతో పాటు, దుస్తుల్లో దుర్వాసనను నివారిస్తుంది.
5. కార్న్ స్ట్రార్చ్: టాల్కం పౌడర్ లాగే, మొక్కజొన్న పిండిని కూడా మీరు ఉపయోగించి గ్రీజ్ మరకలను తొలగించవచ్చు. గ్రీజ్ అంటుకొన్న దుస్తుల మీద కార్న్ స్టార్చ్ వేసి బాగా రుద్దు అలాగే 10 ఉంచి తర్వాత శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
