నూనె మరకలు తొలగించడానికి సులభ క్లీనింగ్ చిట్కాలు

సాధారణంగా ఇంట్లో వంటగదిలో నిరంతరం వంటలు చేస్తుంటారు. ఆ ప్రదేశంలో ఇతర చెత్త, చెదారంతో పాటు నూనె మరకలు కూడా పడుతుంటాయి. ముఖ్యంగా మన ఇండియాలో నూనెను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అనేక నివారణ చర్యలు తీసుకొన్నా కూడా ఆయిల్ మరకలు మాత్రం అక్కడక్కడ మనం గమనిస్తూనే ఉంటాం. చివరకు కొన్ని రోజుల తర్వాత ఆయిల్ మరకలను నివారించడానికి కొంత సమయం పడుతుంది.

వంటగది, వంటగదిలో ఫ్లోన్, సౌట్ ఏరియా, వంటగదిలో, స్టౌవ్ ఉంచే ప్రదేశంలో మరియు సీలింగ్ పాయింట్స్ వంటి ప్రదేశంలో ఆయిల్ మరకలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆయిల్ మరకలను శుభ్రం చేయడానికి, కొంచెం కష్టమైన పనే. ఆయిల్ మరకలను తొలగించడానికి కొంచె శ్రమతో పాటు కొన్ని క్లీనింగ్ చిట్కాలు కూడా అవసరం వుతుంది. కఠనమైన మొండి ఆయిల్ మరకలను తొలగించడానికి కొన్ని చిట్కాలను క్రింది విధంగా ఇవ్వబడ్డాయి....

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆయిల్ మరకలను తొలగించడానికి మీరు కొన్ని మినిరల్ ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్ వంటివి ఉపయోగించవచ్చు. కొంత ఆలివ్ ఆయిల్ టిష్యు పూపర్ మీద వేసి, ఆయిల్ మరకల మీద రుద్దాలి. ఈ ఆయిల్ మరకలు తగ్గి, ఆయిల్ జిడ్డును ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.

వంటగదిలో ఆయిల్ మరకలను తగ్గించడానికి ఇది ఒక ఎఫెక్టివ్ మార్గం.

వెనిగర్:

వెనిగర్:

నీరు మరియు వెనిగర్ ను 2:1నిష్పత్తిలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆయిల్ మరకలను తొలగించడానికి ఉపయోగించాలి . వంటగదిలో కఠిమనమైన ఆయిల్ మరకలను నివారించడానికి వెనిగర్ ఒక ఎఫెక్టివ్ పదార్థం. ఈ రెండింటి మిశ్రమంను తీసుకొని బాగా మిక్స్ చేసి

అందులో పొడి వస్త్రాన్ని డిప్ చేసి. ఆయిల్ మరకలున్న ప్రదేశంలో రుద్ది శుభ్రం చేయాలి. ఇది వంటగడిలో గోడలు మరియు క్యాబినెట్స్ కూడా బాగా శుభ్రపడుతాయి.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా కూడా ఒక మంచి క్లీనింగ్ ఏజెంట్. బేకింగ్ సోడా మరియు నీళ్ళు మిక్స్ చేసి, ఒక స్పాంజ్ తీసుకొని అందులో డిప్ చేసితర్వాత ఆయిల్ మరకలున్న ప్రదేశంలో రుద్ది శుభ్రం చేయాలి. బేకింగ్ సోడా ఆయిల్ మరకలను లైట్ చేస్తుంది. మరకలు పోయే వరకూ ఇలా రెగ్యులర్ గా ఈ పద్దతిని అనుసరించండి. ఇది మీ వంటగదిలో ఆయిల్ మరకలను తొలగించడానికి ఒక ఎఫెక్టివ్ పద్దతి.

 డిటర్జెంట్:

డిటర్జెంట్:

డిటర్జెంట్ కూడా ఫ్లోర్ మీద, మరియు ఇతర వంటగది వస్తువుల మీద పడ్డ ఆయిల్ మరకలను ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది.గోరు వెచ్చని నీటిలో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ మిక్స్ చేసి, ఈ మిశ్రమంతో ఆయిల్ మరకలను తొలగించవ్చు. గోరువెచ్చని నీళ్ళే మరియు డిటర్జెంట్ పౌడర్ ఆయిల్ మరకలను తొలగించడానికి చాలా సులభంగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

ఆయిల్ మరకలను తొలగించడానికి నిమ్మరసం మరియు బేకింగ్ సోడా ఒక సూపర్ కాంబినేషన్. నిమ్మరసంలో బేకింగ్ సోడా మిక్స్ చేసి, మరియు నూనె మరకల మీద రుద్ది శుభ్రం చేసుకోవాలి . అలాగే నూనె మరకలను తొలగించడానికి నిమ్మరసం ఉపయోగించినా సరిపోతుంది.

వేడి నీళ్ళు:

వేడి నీళ్ళు:

ఆయిల్ మరకలు అప్పుడప్పుడు పడినట్లైతే,వెంటనే వేడినీళ్ళతో శుభ్రం చేసి తొలగించవచ్చు . హాట్ వాటర్ ఫ్లోర్ మీద ఆయిల్ మరకలను తొలగిస్తుంది.

Story first published: Saturday, February 1, 2014, 15:08 [IST]
Desktop Bottom Promotion