డబ్బు మరియు సమయాన్ని పొదుపు చేసే వంటగది రహస్యాలు

By Super

ఇల్లే వైకుంటం అనుకుంటూ కొందరు ఉదయం నుండి రాత్రి పడుకొనే వరకూ వంటింట్లోనే కాలక్షేపం చేస్తుంటారు. కొద్దిగా పెద్ద కుటుంబం..ఉమ్మడికుటుంబం అయితే సరేసరి..ఉదయం లేచినప్పటి నుండి టిఫిన్ ఏం చేయాలా..మద్యాహ్నాం భోజనంలోకి ఏం కూర వండాలా ఆలోచిస్తుంటారు అటువంటివారి కోసం కొన్ని వంటింటి చిట్కాలు. వీటిని పాటిస్తే వంటింట్లో ఎడతెగకుండా సమస్యలుగా ఉండేవాటికి కొంత పరిష్కారం లభించినట్లే... అవేమిటో ఇప్పుడు చూద్దాం....

READ MORE: పర్యావరణానికి దగ్గరగా...కాలుష్యానికి దూరంగా....!

సాధారణంగా వంటింటి చిట్కాలు గృహిణులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి చిట్కాల్లో కొన్నింటిని వారి కోసం...

గుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలా

గుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలా

గుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో గుడ్లను వేసినప్పుడు మునిగినవి ఫ్రెష్ గా ఉన్నాయని, తేలినవి పాడైనాయని గుర్తించాలి

అల్లంను స్పూన్ తో తీయడం

అల్లంను స్పూన్ తో తీయడం

అల్లం భూమిలో పండే దుంపల్లో ఇది ఒకటి, దీని అవుటర్ స్కిన్ తొలగించడం కొంచెం కష్టం, చాకుతో లేదా వెజిటేబుల్ పీలర్ తో కాకుండా స్పూన్ తో అవుటర్ స్కిన్ కు వ్యతిరేఖంగా స్క్రీప్ చేస్తే సరిపోతుంది

వెజిటేబుల్స్ ఎక్కువ సమయం ఫ్రెష్ గా ఉండాలంటే

వెజిటేబుల్స్ ఎక్కువ సమయం ఫ్రెష్ గా ఉండాలంటే

వెజిటేబుల్స్ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే, ఫ్రిజ్ లో వెజిటేబుల్ ట్రేల్ పేపర్ టవల్ ను అమర్చాలి. ఇది ఎక్సెస్ వాటర్ ను గ్రహిస్తుంది మరియు వెజిటేబుల్స్ ను ఫ్రెష్ గా ఉంచుతాయి.

నిమ్మకాయలను వేస్ట్ చేయకుండా

నిమ్మకాయలను వేస్ట్ చేయకుండా

నిమ్మకాయలో కొన్ని చుక్కల నిమ్మరసం మాత్రమే మీకు అవసరం అవుతుంది. అలాంటప్పుడు చాకుతో మొత్తం నిమ్మకాయను కట్ చేయకుండా మెటల్ స్క్రీవర్ తో రంద్రం పెట్టి జ్యూస్ ను పిండుకుంటే సరిపోతుంది. కొద్దిగా అవసరం అయ్యే నిమ్మరసానికి చాకుతో కట్ చేయడం వల్ల అది త్వరగా ఎండి పోడం లేదా వేస్ట్ అవుతుంది.

గ్రీన్ లీఫ్స్ ఫ్రెష్ గా ఉండాలంటే

గ్రీన్ లీఫ్స్ ఫ్రెష్ గా ఉండాలంటే

పుదీన, కొత్తిమీర, మరియు ఇతర హెర్బ్స్ మంచి టేస్ట్ తో ఫ్రెష్ గా ఉండాలంటే, వాటిని విడిపించి, నీటిలో కడిగి, కొద్దిసేపు నీరు మొత్తం ఫిల్టర్ అయిన తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్ లేదా కవర్ లో వేసి స్టోర్ చేసుకోవాలి

చీజ్ త్వరగా డ్రై అవ్వకుండా ఉండాలంటే

చీజ్ త్వరగా డ్రై అవ్వకుండా ఉండాలంటే

చీజ్ త్వరగా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఎప్పుడూ సీల్ చేసి ఉండాలి లేదా రిఫ్రిజరనేటర్ లో స్టోర్ చేసుకోవాలి

వెజిటేబుల్స్ మొత్తబడకుండా ఫ్రెష్ గా ఉండాలంటే

వెజిటేబుల్స్ మొత్తబడకుండా ఫ్రెష్ గా ఉండాలంటే

ముల్లంగి, సెలరీ, క్యారెట్స్, క్రంచీగా ఉండాలంటే వాటిని కట్ చేయడానికి ముందు ఐస్ వాటర్లో, ఒక బంగాళదుంపతో సహాయ వేయాలి. ముడుచుకుపోయిన వెజిటేబుల్స్ తిరిగి ఫ్రెష్ గా కనబడుతాయి

కుకీస్ గట్టిపడకుండా ఉండాలంటే

కుకీస్ గట్టిపడకుండా ఉండాలంటే

కుక్కీస్ లో మెత్తనివి, లేదా ఆయిల్ కుక్కీస్ వేరుగా, గట్టిగా ఉన్న కుక్కీస్ ను వేరువేరు డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకోవాలి. వీటిని కలిపి ఉంచడం వల్ల మెత్తగా ఉండే కుక్కీస్ లోని తేమ గట్టి వాటికి తాకడం వల్ల అవి మెత్తబడి, క్రంచీని కోల్పోతాయి

అరటిపండ్లు తొందరగా బ్రౌన్ గా అవ్వకుండాలంటే

అరటిపండ్లు తొందరగా బ్రౌన్ గా అవ్వకుండాలంటే

అరటిపండ్లు తొరగా బ్రౌన్ గా మారకుండా ఉండాలంటే, వాటిని కాండం నుండి వేరుచేయకుండా ఉండాలి. వాటిని స్టెమ్ నుండి విడదీయడం ద్వారా త్వరగా బ్రౌన్ కలర్ లోకి మారుతాయి.

ఉప్పు గడ్డకట్టకుండా ఉండాలంటే

ఉప్పు గడ్డకట్టకుండా ఉండాలంటే

సాల్ట్ డబ్బలో కొద్ది బియ్యం వేసి ఉంచడం వల్ల త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది. బియ్యం తేమను గ్రహించడం వల్ల ఉప్పు పొడిపొడిగా ఉంటుంది.

బటర్ ఫ్లేవర్ ఫుల్ గా ఉండాలంటే

బటర్ ఫ్లేవర్ ఫుల్ గా ఉండాలంటే

బటర్ ను తీసుకొచ్చిన వెంటనే స్టోర్ చేయాలి. దీన్ని ఫ్రీజర్ లో స్టోర్ చేయడం వల్ల కనీసం 6నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుంది. బటర్ ను గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేయాలి .దాని వల్ల బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.

మరో డైరీ టిప్:

మరో డైరీ టిప్:

కాటేజ్ చీజ్ లేదా సోర్ క్రీమ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే, ఫ్రిజ్ లో డబ్బాను తిప్పించి మల్లించి పెట్టాలి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరకుండా ఫుడ్ చెడకుండా ఉంటుంది.

 తేనె స్వచ్చంగా ఉండాలంటే

తేనె స్వచ్చంగా ఉండాలంటే

మీరు నమ్ముతారో నమ్మరో కానీ, తేనె కూడా పాడవుతుంది. తేనె స్పటికలుగా ఏర్పడినప్పుడు అది పాడైనదని గ్రహించాలి.

పాస్తాలో తేమ కోల్పోకుండా

పాస్తాలో తేమ కోల్పోకుండా

పాస్తా వండిన తర్వాత మిగిలిపోయనదాన్ని తినకుండా ఉండటం మంచిది. మిగిలన పదార్థం గట్టిపడకుండా ఉండాలంటే, ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిజ్ లో పెట్టాలి . తినే ముందు కొన్ని వేడినీళ్ళలో వేసి తర్వాత నీరు వంపేసి తినాలి.

పెరగుకు ప్రత్యామ్నాయం:

పెరగుకు ప్రత్యామ్నాయం:

వంటలకు పెరుగు లేదా పెరుగు క్రీమ్ ను ఉపయోగిస్తుంటారు. పెరుగు లేనప్పుడు ప్రత్యామ్నాయంగా పెరుగుకు బదులుగా పాల మీగడను వంటల్లో చేర్చుకోవచ్చు.

పాలు మాడినప్పుడు

పాలు మాడినప్పుడు

పాలు కాచేప్పుడు పాలు స్టౌమీద బర్న్ అయినప్పుడు కొద్దిగా ఉప్పును చిలకరించడం వల్ల మాడువాసన పోతుంది. టేస్ట్ బాగుంటుంది

పండ్ల నుండి ఎక్కువ రసాన్ని తీయాలంటే

పండ్ల నుండి ఎక్కువ రసాన్ని తీయాలంటే

సిట్రస్ పండ్ల నుండి జ్యూస్ తియ్యడానికి ముందు, వాటిని వెనకు ముందుకు రోల్ చేసి తర్వాత కట్ చేసి రసం తియ్యాలి

పండ్లు త్వరగా పండు అవ్వాలంటే

పండ్లు త్వరగా పండు అవ్వాలంటే

పండ్లు త్వరగా పండు అవ్వాలంటే, వాటిని పేపర్ బ్యాగ్ లో చుట్టిపెట్టాలి . ఆపిల్స్ ఇథలిన్ గ్యాస్ విడుదల చేస్తాయి కాబట్టి త్వరగా కాయలు పక్వానికి వస్తాయి.

పాత్రలు వాసనపోవాలంటే

పాత్రలు వాసనపోవాలంటే

ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్స్ లో ఫుడ్స్ పెట్టినప్పుడు వాటి శుభ్రం చేసినా కూడా వాసన వస్తుంటుంది. అలాంటిప్పుడు శుభ్రం చేసిన తర్వాత వాటిలో కొన్ని న్యూస్ పేప్లర్ వేసి ఉంచండి. ఇవి చెడు వాసనను గ్రహించివేస్తాయి.

Desktop Bottom Promotion