Latest Updates
-
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు..
వస్తువులను శుభ్రపరిచే గ్రేట్ క్లీనింగ్ ఏజెంట్ పంచదార
ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉండేటటువంటి నిత్యవసర వస్తువు పంచదార. పంచదార ఒక తియ్యటి వంటగది ఆహారపదార్థం. ఎందుకంటే షుగర్ ను ఆహారాల్లోనూ లేదా బెవరేజస్ లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. అద్భుతమైన తియ్యని రుచిని అందించే ఈ పంచదార వంటలంటే పిల్లలకు మరియు పెద్దలకు కూడా చాలా ఇష్టమైనవి.
ఇలాంటి తియ్యని పదార్థం వంటలకు తియ్యదం అందివ్వడం మాత్రమే కాదు, మన వంటగదిలో ఒక క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చాలా వరకూ క్లీనింగ్ విషయంలో ఉప్పును, నిమ్మరసంను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే క్లీనింగ్ ఏజంట్స్ లోకి ఇప్పుడు పంచదార కూడా చేరింది . ఈ స్వీట్ పదార్థాన్ని ఇతర క్లీనింగ్ పదార్థాలతో జోడించి ఇంట్లోని వస్తువును శుభ్రం చేయవచ్చు. పంచదార వల్ల మరో బలహీనత ఇది కీటకాలను చాలా త్వరగా ఆకర్షిస్తుంది .. కాబట్టి, పంచదారను ఇంకా ఏవింధంగా, వేటిని శుభ్రపరచడానికి ఉపయోగించుకోవచ్చు ఈ క్రింది విధంగా తెలుసుకుందాం...

1. షుగర్ అండ్ బేకింగ్ పౌడర్: మూడు చెంచాల పంచదారను ఒక చెంచా బేకింగ్ పౌడర్లో వేసి మిక్స్ చేసి, అందులో కొద్దిగా నీరు మిక్స్ చేసి ద్రవంలా చేయాలి. ఈ ద్రవాన్ని జిడ్డు ఉన్న పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించుకోవచ్చు . ఇది ఒక నేచురల్ డిటర్జెంట్ గా పనిచేస్తుంది . ఈ ద్రవంతో పాత్రలు శుభ్రం చేయడం వల్ల పాత్రలకు మంచి మెరుపు వస్తుంది.

2. షుగర్ మరియు రోజ్ వాటర్: మూడు చెంచాల షుగర్ తీసుకొని అందులో ఒక చెంచా రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. రోజ్ వాటర్ లో షుగర్ కరిగిపోయే వరకూ మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమ పదార్థాన్ని సిల్వర్(వెండి)వస్తువులను శుభ్రం చేయడానికి ఉపయోగించాలి . సిల్వర్ వస్తువులను తెల్లగా మిళమిళ మెరిపించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.
3. షుగర్ మరియు లెమన్ జ్యూస్: ఒక నిమ్మకాయ మొత్తాన్ని రసం పిండి అందులో 3 చెంచాల షుగర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తుప్పు పట్టిన వస్తువుల మీద వేసి రుద్దితే త్రుప్పు తొలగిపోతుంది . ఎక్కడైతే త్రుప్పు కనబడుతుందో ఆ ప్రదేశంలో కొద్దిగా వేసి రుద్దితే చాలు తొలగిపోతుంది.

4. షుగర్ మరియు వెనిగర్: ఫ్లోర్ (మొజాయిక్ లేదా ఉడెన్ )పడ్డ మరకలను తొలగించడానికి పంచదార బాగా సహాయపడుతుంది ఒక బౌల్లో 4 చెంచాల వెనిగర్ తీసుకొని అందులో పంచదార మిక్స్ చేయాలి. ఇందులో కాటన్ బాల్ ను డిప్ చేసి మరకలున్న ప్రదేశంలో వేసి రుద్దితే మరకలు మాయం అవుతాయి. ఈ హోం క్లీనింగ్ చిట్కా వల్ల కొత్తగా ఏర్పడ్డ మరకలు కూడా తొలగిపోతాయి...
5. టమోటో మరియు పంచదార: టమోటో ఒక స్ట్రాంగ్ బ్లీచింగ్ ఏజెంట్. ఇంట్లో దుస్తుల మీద ఎక్కువ మరకలు పడినప్పుడు టమోటో జ్యూస్ లో కొద్దిగా పంచదార మిక్స్ చేసి దుస్తులుపై ఏర్పడ్డ మరక మీద వేసి రుద్దితే మరకలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications
