Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
నిమ్మరసం వల్ల బహు ప్రయోజనాలు
ప్రపంచంలోనే అత్యధిక విటమిన్ సి కలిగిన ఆహారపానియాల్లో బాగా పాపులర్ అయినది నిమ్మరసం. ఈ నిమ్మకాయను బహువిధాలుగా ఉపయగోిస్తుంటారు . ముఖ్యంగా బ్యూటీ ప్రొడక్ట్స్ మరియు క్లీనింగ్ ప్రోడక్ట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . ఇందులో అనేక ఔషధగుణగణాలున్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియని కొన్ని చిట్కాలు అందిస్తున్నాము.
READ MORE:ఉదయాన్నేలెమన్ వాటర్ తాగితే: గొప్ప ప్రయోజనాలు
నిమ్మరసంను ఆహారాల్లో మంచి ఫ్లేవర్ కోసం మరియు ఆరోగ్య పరంగా, గొంతునొప్పి నివారించుకోవడానికి మరియు మరికొన్ని వ్యాధులను నివారించుకోవడం కోసం ఉపయోగిస్తుంటాము . నిమ్మరసం అనేక న్యూట్రీషియన్స్ తో నిండి ఉంటుంది. అందులో ముఖ్యంగా విటమిన్ సి, పెక్టిన్, యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్ బి మరియు క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, ఈ ఫ్రూట్ ను అల్ పర్ఫస్ గా వినియోగిస్తుంటారు.
READ MORE: నిమ్మ రసంతో 15 ఆశ్చర్యకరమైన బ్యూటీ బెనిఫిట్స్..!
మరి మన నిత్యజీవితంలో నిమ్మరసంను ఏవిధంగా ఉపయోగించాలో కొన్ని చిట్కాలను మీకోసం ఈ క్రింది విధంగా అందిస్తున్నాము . ఈ నిమ్మరసం యొక్క చిట్కాలు చాలా సింపుల్ గా ఉంటాయి. మరియు ఇది మరకలను చాలా తేలికగా వదులగొడుతుంది. మరి చిట్కాలేంటో ఒక సారి చూద్దాం...

దోమల నివారణకు:
మార్కెట్లో అందుబాటులో ఉండే దోమనివారణలు మీకు అలర్జీ కలిగిస్తున్నాయా? మస్కిటో కాయిల్స్, మ్యాట్స్, మరియు స్ప్రేలు మరియు మరియు రెస్పరేటర్ అలర్జీలకు కారణం అవుతున్నాయా? వీటికి బదులుగా ఒక ఆరోగ్యకరమైన హోం రెమెడీని తయారుచేసుకోవడం . ఒక బౌల్లో నిమ్మరసం మరియు కొన్ని లవంగాలు వేసి, దోమలున్న చోటు లేదా బెడ్ రూమ్ లో ఉంచుకోండి

క్లీనర్:
నిమ్మరసంను బహు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా నిమ్మరం మరియు నీళ్ళు సమంగా తీసుకొని స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసి శుభ్రం చేసుకోవచ్చు . ఇది వంట గది నుండి బాత్రూమ్ వరకూ అన్ని రకాలుగాను క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది.

లింగ్ రూమ్ లో మంచి సువాసన:
ఇంటికి అథితులు వస్తున్నట్లైతే రూమ్ ఫ్రెష్ నర్ గా వెంటనే మీకు నిమ్మరసం అందుబాటులో ఉంటుంది. ఇంట్లో అనుకోని, దుర్వాసనలు నివారించడంలో నిమ్మరసం బెస్ట్ . కొన్ని నిమ్మతొక్క లేదా నిమ్మరసం నీటిలో వేసి మరిగించడం వల్ల ఆ వాసన ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. చాలా ఫ్రెష్ గా ఫీలవుతారు.

ఆపిల్స్ ఫ్రెష్ గా ఉంచుతుంది.
ఆపిల్స్ ఫ్రెష్ గా ఉండాలంటే, కలర్ మారకుండా ఉండాలన్నా. కొద్దిగా నిమ్మరసంను వాటి మీద చిలకరించాలి . ఎక్కువ కాలం ఆపిల్స్ ఫ్రెష్ గా ఉంటాయి.

దంతాలను తెల్లగా మార్చుతాయి:
ఈ నేచురల్ హోం రెమెడీ వల్ల దంతాలు తెల్లగా తళతళలాడుతాయి. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి దంతాలకు అప్లై చేసి రుద్ది నోటి శుభ్రం చేసుకోవాలి. ఈ హోం రెమెడీ వల్ల తక్షణం మీ దంతాలు తెల్లగా తళతళలాడుతుంటాయి .

క్రిములు, కీటకాలను నివారిస్తాయి:
ఎఫెక్టివ్ బగ్ స్ప్రే నిమ్మరసం. ఏదైనా ఒక నూనెలో కొద్దిగా నిమ్మరసం జోడించి, బాగా షేక్ చేసి, ప్రభావిత ప్రదేశంలో స్ప్రే చేస్తే చాలా ఎఫెక్టివ్ గా అవి వదిలిపోతాయి.

కుక్కింగ్ బోర్డ్స్ ను క్లీన్ చేస్తాయి:
చోపింగ్ బోర్డ్ మరియు సానిటైజర్స్ ను చాలా ఎఫెక్టివ్ గా శుభ్రపరుస్తాయి . ఇది మైక్రోబయల్ కౌంట్ ను తగ్గిస్తాయి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్స్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కూరగాయలు కట్ చేసిన వెంటనే నిమ్మతొక్కతో చోపింగ్ బోర్డ్ ను రుద్ది కడగాలి.



Click it and Unblock the Notifications
